ఆ సమయంలో అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయా: రెజీనా | Regina Cassandra Comments On Her Childhood Secrets | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో అమ్మకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయా: రెజీనా

Published Fri, Oct 11 2024 12:13 PM | Last Updated on Fri, Oct 11 2024 12:20 PM

Regina Cassandra Comments On Her Childhood Secrets

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా  నటి రెజీనాకు అభిమానులు ఉన్నారు. సుమారు 17 ఏళ్లుగా ఆమె పలు సినిమాలతో పాపులర్‌ అయ్యారు. ఒకప్పుడు తమిళం, తెలుగు ,హిందీ తదితర చిత్రాల్లోనూ కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా ఛాన్సులు రావడం లేదు. దీంతో వెబ్‌ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే, తాజాగా తమిళంలో నటుడు అజిత్‌ కథానయకుడిగా నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇండస్ట్రీలో రెజీనా చాలా బోల్డ్‌ నటి అనే చెప్పాలి. 

సాధారణంగా నటీమణులు వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానిక ఇష్టపడరు. అయితే రెజీనా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈమె సినిమా విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను ధైర్యంగా బయటకు చెప్పేస్తారు. ఆ మధ్య తాను చాలా మందితో డేటింగ్‌ చేశాయని చాలా బోల్డ్‌గా చెప్పిన ఈ అమ్ముడు తాజాగా మరో వ్యక్తిగత విషయాన్ని బయట పెట్టారు. తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రెజీనా ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో తన అభిమానులతో ముచ్చటించారు. 

ఈ సందర్భంగా ఒక అభిమాని చెప్పకూడని ఏదైనా విషయం చేసి తల్లిదండ్రుల వద్ద దొరికిపోయారా అని ప్రశ్నించాడు. అందుకు బదులిచ్చిన రెజీనా ఒకసారి పక్క ఇంట్లో ఎదో జరుగుతుంది. అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం అని ఇంటిలోకి తొంగి చూస్తుండగా అమ్మ కంటిలో పడ్డానని, అప్పుడు అమ్మ తనను గట్టిగానే చివాట్లు పెట్టారని చెప్పారు. ఇరుగుపొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని హెచ్చరించింది. కాగా 33 ఏళ్ల ఈ పరువాల భామ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement