
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు.
(ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!)
Comments
Please login to add a commentAdd a comment