Tamil Actress VJ Deepika Revealed About Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Actress VJ Deepika: రాఘవ లారెన్స్‌ సినిమా ఆడిషన్స్‌కు వెళ్తే డైరెక్టర్‌ అలా చేయమని బలవంతం!: నటి

Published Sun, Jul 30 2023 11:56 AM | Last Updated on Sun, Jul 30 2023 1:07 PM

Tamil Actress VJ Deepika Revealed About Casting Couch Experience - Sakshi

యూట్యూబర్‌ నుంచి నటిగా, అక్కడి నుంచి హోస్ట్‌గా పలు అవతారాలెత్తింది వీజే దీపిక. ఈ తమిళ బుల్లితెర నటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగే ఉంది. పాండియన్‌ స్టోరీస్‌ సీరియల్‌తో ఈమెకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఆడిషన్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. 'రాఘవ లారెన్స్‌ సినిమాలో అతడి చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాను. డైరెక్టర్‌ నన్ను ఓకే చేయడంతో ఎగిరి గంతేశాను.

అయితే సినిమాలో ఓ ముద్దు సీన్‌ ఉంటుందని, ఇప్పుడు దాన్ని ఓసారి రిహార్సల్‌ చేసి చూపించమని అడిగాడు. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆడిషన్స్‌లో ముద్దు సీన్‌ చేసి చూపించడమేంటని నేను చేయనన్నాను. కానీ డైరెక్టర్‌ నాపై ఒత్తిడి తెచ్చాడు. ఇది నీకు మంచి అవకాశం, ఛాన్స్‌ చేజారుతుంది, నీ ఇష్టం అని మాట్లాడాడు. నాకు అతడి మాటతీరు, ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. అతడు చెప్పినట్లు చేయకపోతే ఆడిషన్‌కు వచ్చినవారిలో ఎవరో ఒకరిని సెలక్ట్‌ చేసుకుంటానని దురుసుగా మాట్లాడాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఎంతగానో మధనపడ్డాను' అని చెప్పుకొచ్చింది దీపిక.

కాగా 2018లో వచ్చిన పాండియన్‌ స్టోరీస్‌ సీరియల్‌తో వీజే దీపిక వార్తల్లో నిలిచింది. ఇందు సుజిత, స్టాలిన్‌ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపిక యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలు కూడా చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

చదవండి: 9వ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్‌
నాకు ప్రెగ్నెంట్‌ అవాలనుంది: గేమ్‌ ఛేంజర్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement