ఖమ్మం జిల్లా కేంద్రంలోని వికలాంగులకాలనీలో దారుణం చోటు చేసుకుంది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వికలాంగులకాలనీలో దారుణం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ తండ్రి నిద్రిస్తున్న కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలు రేష్మ(11), రహీమా(6)లుమ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి అన్వర్ బాషా(38) చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. వివరాలు.. వికలాంగుల కాలనీలో నివాసముంటున్న అన్వర్ బాషా గురువారం రాత్రి తన భార్యతో గొడవ పడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.