వాళ్లు కూడా మనుషులే...! | 'Third Man' a movie on the life of Hijras | Sakshi
Sakshi News home page

వాళ్లు కూడా మనుషులే...!

Published Tue, Sep 30 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

వాళ్లు కూడా మనుషులే...!

వాళ్లు కూడా మనుషులే...!

 ‘‘దేవుని సృష్టిలో ఆడ, మగ మాత్రమే కాదు, మూడో తెగ కూడా ఉంది. వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తోంది సమాజం. వాళ్లను మనుషుల్లో ఒకరిగా గుర్తించని పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. హిజ్రాలూ మనుషులే, వారికీ మనోగతాలుంటాయి... వ్యథలుంటాయి... ఆత్మాభిమానాలుంటాయని తెలిపే కథాంశంతో మేం తెరకెక్కించిన సినిమానే ‘థర్డ్ మేన్’’ అని హెచ్.ఎం.ఇమ్రాన్ (ఇంద్రమోహన్) చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో నటుడు పృధ్వీ హిజ్రాగా కీలక పాత్ర పోషించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 80 మంది హిజ్రాలు ఈ చిత్రంలో నటించడం విశేషం.
 
 ఇంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘హిజ్రాలకు కూడా చట్ట సభల్లో సమాన హక్కు కల్పించిన ఈ శుభ సందర్భంలో మా సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. ఇందులో మూడు పాటలు కూడా ఉంటాయి. ఇది నేను ఆత్మసంతృప్తి కోసం మాత్రమే తీసిన సినిమా. దీనికి ప్రభుత్వం నుంచి కూడా తగు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెల రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అలైఖ్య, పూజా, యాన, మల్లిక, షమ, రేష్మ, శ్రీదేవి, టీనా తదితర హిజ్రాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, సంగీతం: బొంబాయి బోలే, కెమెరా: ప్రసాద్ కొల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement