Reshma Pasupuleti Want To Be Part Of Lokesh Kanagaraj Film, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Reshma Pasupuleti: అవకాశాలు రావడం లేదన్న నటి.. నీ ముఖం చూడలేమన్న నెటిజన్లు

Published Wed, Jan 25 2023 7:27 PM | Last Updated on Wed, Jan 25 2023 7:54 PM

Reshma Pasupuleti Want to Be Part Of Lokesh Kanagaraj Film - Sakshi

'మసాలా పాదం' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమిళ నటి రేష్మ పసుపులేటి. పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళ బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి సీరియల్‌ చేస్తున్న ఆమె తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదని వాపోయింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. 

'నాకు లోకేశ్‌ కనగరాజన్‌ సినిమాలో నటించాలనుంది. కానీ ఆయన్ను ఎలా సంప్రదించాలో తెలియడం లేదు. ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేర్చండి. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతోంది.. కానీ సరైన అవకాశాలు లేవు. మా కంటే కొత్తగా వచ్చినవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. దాన్ని నేను పూర్తిగా తప్పుపట్టడం లేదు. కానీ ఇది నిజంగా అన్యాయం. ఈ అసమానతలు లేని సిస్టమ్‌ రావాలి' అని ట్వీట్‌ చేస్తూ దానికి కొన్న ఫోటోలు జత చేసింది రేష్మ. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇప్పటిదాకా నటించింది చాలులే.. నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది నేరుగా చూస్తే ఏమైపోవాలో!పైగా నీకంత యాక్టింగ్‌ కూడా రాదు. ముందు నీ వృత్తి మార్చుకో' అని సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: అతియా- రాహుల్‌ పెళ్లి.. ఆడి కారు, లక్షల విలువైన బైకు, ఫ్లాట్‌.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement