రామచంద్రాపురం, న్యూస్‌లైన్: బియ్యం తెస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరిన ఓ యువతి హత్యకు గురైంది. ఈ ఘటన రామచంద్రాపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉండే రేష్మ(20) ఏడో తరగతి వరకు చదువుకొని ఇంట్లోనే ఉంటుంది. ఆమె తల్లి షమీం భర్తతో విడిపోయి రామచంద్రాపురం పట్టణానికి వచ్చి జీవిస్తున్నారు. షమీం పారిశ్రామికప్రాంతంలోని ఓ పరిశ్రమలో హౌస్‌కీపింగ్ డిపార్‌టమెంట్‌లో పనిచేస్తుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా రేష్మా పెద్ద కూతు రు. మంగళవారం మధ్యాహ్నం బియ్యం తెస్తానని ఇంట్లో వారికి చెప్పి రేష్మ బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
ఇదిలాఉండగా బుధవారం తెల్లవారుజామున భెల్ టౌన్‌షిప్‌లోని హోలిక్రాస్ జూనియర్ కళాశాల వెనక ముళ్ల పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించిది. మృతదేహాన్ని చూసిన భెల్ పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు రవీందర్‌రెడ్డి, వెంకట్, లోకేష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రేష్మ తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేష్మ దుస్తులు కూడా సక్రమంగా లేకపోవడంతో ఈ హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రేష్మ మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కవిత సందర్శించారు. క్లూస్ టీం సం ఘటన స్థలానికి సందర్శించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు జరుపుతామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
యువతి దారుణ హత్య
Published Thu, Dec 19 2013 12:32 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement