![NTR brother in law Narne Nithin is the hero of Mad have you seen the teaser - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/1/MAD%20Still-FL-TeaserOutNow.jpg.webp?itok=Sjn9wqlW)
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు.
ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి.
Comments
Please login to add a commentAdd a comment