
‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’(Robinhood). శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఆయన ఫస్ట్ లుక్‌ని శనివారం రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ కట్, ట్రెండీ దుస్తులు, చిరునవ్వు, కూల్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న వార్నర్ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
‘‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్‌ది అతిథి పాత్ర అయినప్పటికీ ఆయనకు ఉన్న ప్రపంచ ప్రజాదరణ, మ్యాసీవ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ సినిమాపై స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమేరా: సాయి శ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్: హరి తుమ్మల, లైన్‌ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి.
Comments
Please login to add a commentAdd a comment