
మార్చి అంటేనే పరీక్షల సీజన్. నెల చివర్లో తప్పితే మిగతా రోజుల్లో సినిమాలు సరిగా రిలీజ్ కావు. కానీ ఈ సారి మాత్రం స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు 10 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా పలు రీ రిలీజులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏంటవి? వాటి సంగతేంటి?
మార్చి తొలివారంలో కింగ్ స్టన్, ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు నారి అనే తెలుగు మూవీ రాబోతుంది. వీటిలో 'ఛావా'పైనే అంచనాలు ఉన్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
రెండో వారంలో నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', హిందీ మూవీ 'డిప్లమాట్' విడుదలవుతాయి. వీటిలో దేనిపైన పెద్దగా అంచనాల్లేవు.
మూడో వారంలో ఇప్పటివరకైతే ఏ సినిమాలు లేవు. నాలుగో వారంలో మాత్రం లూసిఫర్ సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' మార్చి 27న, నితిన్ రాబిన్ హుడ్ 28న, మ్యాడ్ స్క్వేర్ 29న థియేటర్లలోకి వస్తాయి. వీటిలో మ్యాడ్ 2పైనే కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')
మార్చి 28న పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పొచ్చు. అలానే మార్చిలోని సినిమాలకు హిట్ టాక్ వస్తే లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే!
వీటితో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో రీ రిలీజ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం)
Comments
Please login to add a commentAdd a comment