సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ కాంబినేషన్‌లోనే రూపొందిన హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్ (2023)’కు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
తొలి భాగానికి కూడా వీరే నిర్మాతలనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ‘‘ప్రేక్షకులు ఊహించినదానికంటే రెట్టింపు వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Comments
Please login to add a commentAdd a comment