
మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాతో థియేటర్స్‌లో నవ్వులు పూయించిన మ్యాడ్ గాంగ్.. బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా మార్చి 28 సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మ్యాడ్ స్క్వేర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లకు దగ్గరగా మ్యాడ్ స్క్వేర్ మొదటిరోజు కలెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఆయన మాటే నిజం అయిందని నెటిజన్లు అంటున్నారు. 2023లో విడుదలైన మ్యాడ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు రూ. 26 కోట్లు అని తెలిసిందే.
(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)
ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీనే ఉంది. లూసిఫర్-2, వీర ధీర శూర, రాబిన్ హుడ్ వంటి సినిమాలు థియేటర్స్‌లో ఉన్నాయి. ఇలాంటి పోటీ సమయంలోనూ మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టింది. మ్యాడ్ పార్ట్-1 కోసం రూ. 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే రూ. 26 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ రూ. 20.8 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.