‘నెట్‌’లో చిక్కుకున్న చిన్నారులు | Local Circles Institute Survey on Children | Sakshi
Sakshi News home page

‘నెట్‌’లో చిక్కుకున్న చిన్నారులు

Published Thu, Sep 28 2023 4:41 AM | Last Updated on Thu, Sep 28 2023 3:10 PM

Local Circles Institute Survey on Children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానల్లు కురవాలి వానదేవుడా/ వరిచేలు పండాలి వానదేవుడా/..వానా వానా వల్లప్ప...వాకిట తిరుగు చెల్లప్ప/ చెట్టుమీద దెయ్యం/ నాకేం భయ్యం / వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమీ...ఇవన్నీ పల్లెటూళ్లలో చిన్నారులు ఆరుబయట ఆటలు ఆడుకుంటూ పాడుకునే పాటలు. బడి నుంచి ఇంటికొచ్చేసి వీధి కూడలిలోనో, ఇంటిముందో పిల్లలు చేరుకుని ఇలా కబడ్డీ, పైలా పచ్చీస్, ఖోఖో, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకుంటుంటే పెద్దవాళ్లు కూడా ఆ చిన్నారుల్ని చూసి ఆనందపడిపోయేవారు.

అదంతా గతం..ఇప్పుడా ఆటల్లేవు పాటల్లేవు...ఆ ఆనందమూ లేదు. ఎందుకంటారా? ఇదిగో ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన అంతర్జాలం(ఇంటర్‌నెట్‌)...ఈ మాయ లో పడి నేటితరం పిల్లలు ఆటపాటలూ..ఆనందమూ అందులోనే వెతుక్కుంటున్నారు. నాటితరం ఆటలు శారీరక వ్యాయామానికి, మానసిక వికాసానికి దోహదపడితే నేటితరం ఆన్‌లైన్‌ ఆటలు పిల్లల్లో తీవ్ర ఒత్తిడిని, అసహనాన్ని పెంచుతున్నాయి. 

సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు 
ఎంతమంది పిల్లలు ఆన్‌లైన్‌లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎటువంటివి ఎక్కువగా చూస్తున్నారు? వంటి అంశాలపై ‘లోకల్‌ సర్కిల్స్‌’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోభాగంగా దేశవ్యాప్తంగా 46 వేలమంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. తొమ్మిది నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు ఆన్‌లైన్‌లో ఆటలు ఆడటం, టీవీ వీక్షణం, ఓటీటీలు చూడటం వంటి పనుల్లో రోజుకు మూడు గంటలకు పైగానే గడుపుతున్నారని 61% మంది పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. 


(కొందరు తల్లిదండ్రులు ఒకటి కంటే ఎక్కువ అంశాలు గమనించినట్లు చెప్పారు)

డిజిటల్‌ ఎడిక్షన్‌ కాకుండా చూడాలి
ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా పిల్లలకు స్మార్ట్‌ ఫోన్ల అలవాటు తప్పనిసరైంది. అయితే అది డిజిటల్‌ ఎడిక్షన్‌ కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సైబర్‌ సెక్యూరిటీ అంశాలను వారికి తెలియజెప్పాలి. అవసరం మేరకు చైల్డ్‌ రిస్ట్రిక్షన్‌ ఆప్షన్లు ఎనేబుల్‌ చేసుకోవాలి – డాక్టర్‌ ప్రజ్ఞా రష్మీ, మానసిక వైద్యురాలు

తల్లిదండ్రులు ఓ కన్నేయాలి
స్మార్ట్‌ ఫోన్లలో పిల్లలు ఏ వీడియోలు చూస్తున్నారు? ఎలాంటి గే మ్‌లు ఆడుతున్నారు ? వంటి విషయాలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. అవసరం మేరకు మాత్రమే పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం ఉత్తమం. – భాను పద్మజ, రిటైర్డ్‌ టీచర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement