రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్‌లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్‌పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీని పెంచనుంది. ఇప్పటికే జీఎస్టీ పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్‌లైన్ గేమింగ్‌పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరింది. ఒకవేళ జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది. ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజు వేచి చూడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీని పెంచితే.. గేమింగ్ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ షట్ డౌన్ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు.
మే 18లోపు జీఎస్టీపై క్లారిటీ
జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం సభ్యులకు చైర్మన్‌గా కాన్రాడ్ సంగ్మా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రుల బృందం ఇప్పటికే మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ..బుధవారం (మే18)న జరగనున్న సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై పన్ను వేయాలా..లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్‌పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు.
చదవండి👉నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
Comments
Please login to add a commentAdd a comment