జీవితం నాశనం.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ రీచార్జ్‌ కోసం.. | Police Arrested Thief In Anantapur District | Sakshi
Sakshi News home page

Online Games: జీవితం నాశనం.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ రీచార్జ్‌ కోసం..

Published Thu, Sep 9 2021 8:04 AM | Last Updated on Thu, Sep 9 2021 11:57 AM

Police Arrested Thief In Anantapur District - Sakshi

సాక్షి,తాడిపత్రి: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఓ చిన్నారి భవితను నాశనం చేశాయి. గేమ్స్‌ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్‌ డబ్బుకోసం ఏకంగా దొంగను చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీఎస్‌కే చైతన్య తెలిపారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడిన నార్పలకు చెందిన ఓ బాలుడు 8వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. నిరంతరం ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. అయితే ముందుకు వెళ్లాలంటే రీచార్జ్‌ చేయాల్సి రావడంతో... సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు.

ఆ తర్వాత ఈనెల 1వ తేదీన తాడిపత్రిలో, 4వ తేదీన రూరల్‌ పరిధిలో వరుస చోరీలు చేసి రూ.3.79 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ, రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేసుకుని గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆటోనగర్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు..ఆ దారి గుండా వెళుతున్న బాలుడిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగు చూసింది. దీంతో బాలుడి వద్ద ఉన్న రూ.3.79 లక్షల నగదుతో పాటు రూ.3 లక్షల విలువైన బంగారు నగలను స్వాదీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. నార్పలలో జరిగిన చోరీ ఘటనల్లోనూ  మూడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

చదవండిమచ్చా అన్నందుకు డబుల్‌ మర్డర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement