న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల మండలి (జీఎస్‌టీ కౌన్సిల్) శనివారం భేటీ కానుంది. జీఎస్‌టీ చట్టం కింద కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్ (కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించడం), అపీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు.
వీటితో పాటు పాన్ మసాలా.. గుట్ఖా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టే విధానం రూపకల్పనపై ఇందులో చర్చించనున్నారు. జీఎస్‌టీతో పాటు ఆన్‌లైన్ గేమింగ్, కేసినోల అంశాలు కూడా 48వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!
Comments
Please login to add a commentAdd a comment