
కుమారుడి అకాల మరణాన్ని తట్టుకోలేకపోతున్నా.. (మీడియాతో సాయికృష్ణ తండ్రి)
కామారెడ్డి క్రైం: పబ్జీ ఆటపై మోజు ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజీద్ గల్లీకి చెందిన సాయికృష్ణ (20) కొంత కాలంగా పబ్జీ ఆటకు బానిస య్యాడు. అయితే, ఈ గేమ్‌పై కేంద్రం నిషేధం విధించడంతో థర్డ్‌పార్టీ యాప్ ద్వారా కొరియన్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. సోమ వారం ఉదయం నుంచి బంగ్లాపై గదిలో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఆటపై ధ్యాసతో ఒత్తిడికి లోను కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సాయంత్రమైనా అతడు కిందకు దిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా పడిపోయి కనిపించాడు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.
(చదవండి: సడన్‌గా లేచి.. కాల్చండని కేకలు)
Comments
Please login to add a commentAdd a comment