వడోదర : లాక్‌డౌన్‌తో ఇప్పుడు అందరూ ఇండోర్ గేమ్స్ మీద పడ్డారు. అష్టాచమ్మా, వైకుంఠపాళీ, లూడో లాంటి పాతకాలపు ఆటలను మళ్లీ ఇప్పుడు ఆడుతూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ గేమ్స్ కాస్త గొడవలకు దారి తీస్తున్నాయి. లూడో గేమ్‌లో తనను తరచూ ఓడిస్తుందన్న కోపంతో భార్యను చితకబాదాడు ఓ భర్త. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది.
(చదవండి : వామ్మో! ఖైదీల లాక్‌డౌన్ అంటే ఇలానా?)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరకు చెందిన ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడు.లాక్‌డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఉండడంతో భర్తతో లూడో గేమ్ ఆడాలకుంది. భర్తను ఒప్పించి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడారు. వారితో పాటు కాలనీలోని మరికొంత మంది కూడా ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడారు. అయితే ప్రతిసారి ఆమె తన భర్తను ఓడించింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. ఆమెతో గొడవదిగి దాడి చేశాడు. తీవ్రంగా దాడి చేయడంతో ఆమె వెన్నెముక విరిగిపోయిందని వైద్యులు వెల్లడించారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త క్షమాపణలు కోరడంతో ఆమె కేసు విత్‌డ్రా చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment