సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా, ‘ట్రంప్ విజయం ఖాయం’ అంటూ బ్రిటన్‌కు చెందిన మాజీ బ్యాంకర్ ఒకరు ఏకంగా ఐదు మిలియన్ డాలర్లు (దాదాపు 37.5 కోట్ల రూపాయలు) పందెం కట్టారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ఎన్నికలపై ఇంత మొత్తంలో ఒక్కరే బెట్ కాసిన దాఖలాలు ఇంతవరకు లేవని బెట్ నిర్వాహకులే చెబుతున్నారు. సదరు మాజీ బ్యాంకర్ కరీబియన్‌లోని కురకావోలో ఓ బుక్ మేకర్‌తో ఈ పందెం కట్టారట. తాను గుడ్డి అభిమానంతోని ట్రంప్ గెలుస్తాడంటూ బెట్ కట్టలేదని, ట్రంప్ శిబిరంలోని ఇన్‌సైడర్లతోని సంప్రతింపులు జరిపే కట్టానని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మాజీ బ్యాంకర్ తెలిపారు.
(చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటే ఎన్నికల ముందు సర్వేలో తెలియజేయగా, పోటీ పోటీగా ఉందంటూ పోలింగ్ రోజు అంచనాలు తెలియజేస్తున్నాయి. నిజంగా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే మాజీ బ్యాంకర్‌కు తన కాచిన బెట్‌కన్నా మూడింతలు అంటే, 11.6 మిలియన్ పౌండ్లు (దాదాపు 112 కోట్ల రూపాయలు) వరిస్తాయి. బైడెన్ గెలుస్తాడని భావించిన బుకీస్ కూడా పోలింగ్ చివరి నిమిషంలో ట్రంప్ గెలిచే అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు.
బ్రిటన్‌కు చెందిన మరో పౌరుడు బుకీస్ వద్ద బైడన్‌పై 1 మిలియన్ పౌండ్ల బెట్ కాశారు. బుకీస్ ఫెవరైట్ బైడెన్ కనుక ఆయన గెలిస్తే సదరు బ్రిటిష్ పౌరుడికి పది లక్షల పౌండ్లకుగాను పదిహేను లక్షల పౌండ్లు మాత్రమే వస్తాయి.
ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు
Published Tue, Nov 3 2020 6:14 PM | Last Updated on Tue, Nov 3 2020 6:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment