దుబాయ్: భారత్‌లో జూదాన్ని (పందేలు/బెట్టింగ్) చట్టబద్ధం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ రావడమే కాకుండా, ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయని పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. బెట్టింగ్ ఆపరేటర్ల నియంత్రణకు కార్యాచరణ అవసరమని పేర్కొంది.
అంతర్జాతీయంగా బెట్టింగ్ ఆపరేటర్లకు కావాల్సిన నైపుణ్య సేవలను పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ అందిస్తుంటుంది. ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ పరిమ్యాచ్ బ్రాండ్‌పై హక్కులు ఈ సంస్థకే ఉన్నాయి. ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు బెట్టింగ్ గేమ్‌లూ ఊతమిస్తాయని మేము భావిస్తున్నాం. భారత్‌లో జూదాన్ని చట్టబద్ధం చేస్తే మెదటగా సమర్థించేది మేమే’’అని పీఎంఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దిమిత్రి బెలియనిన్ పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున పన్ను ఆదాయం సమకూరుతుందంటూ.. మోసపూరిత ఆపరేటర్లను కట్టడి చేసేందుకు సరైన రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment