legalise
-
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూదం చట్టబద్ధం.. ఎన్నో లాభాలు! తెరపైకి కొత్త డిమాండ్
దుబాయ్: భారత్‌లో జూదాన్ని (పందేలు/బెట్టింగ్) చట్టబద్ధం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ రావడమే కాకుండా, ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయని పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. బెట్టింగ్ ఆపరేటర్ల నియంత్రణకు కార్యాచరణ అవసరమని పేర్కొంది. అంతర్జాతీయంగా బెట్టింగ్ ఆపరేటర్లకు కావాల్సిన నైపుణ్య సేవలను పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ అందిస్తుంటుంది. ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ పరిమ్యాచ్ బ్రాండ్‌పై హక్కులు ఈ సంస్థకే ఉన్నాయి. ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు బెట్టింగ్ గేమ్‌లూ ఊతమిస్తాయని మేము భావిస్తున్నాం. భారత్‌లో జూదాన్ని చట్టబద్ధం చేస్తే మెదటగా సమర్థించేది మేమే’’అని పీఎంఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దిమిత్రి బెలియనిన్ పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున పన్ను ఆదాయం సమకూరుతుందంటూ.. మోసపూరిత ఆపరేటర్లను కట్టడి చేసేందుకు సరైన రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అనుచిత విధానాలను అరికట్టవచ్చవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుపరమైన ఆదాయాలు కూడా లభించవచ్చన్నారు. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) పార్ట్‌టైమ్ సభ్యుడు నీలేష్ షా చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ ఈ మేరకు స్పందించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు దీన్ని చట్టబద్ధం చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీన్ని క్రీడలు లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని మంత్రి చెప్పారు. బెట్టింగ్ అన్నది వ్యవస్థాత్మకమైనదని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారిని గుర్తించేందుకు దీన్ని ఉపయోగించు కోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
హామీలకు చట్టబద్ధత
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60 శాతం మేర నెల రోజుల్లోనే అమల్లోకి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటపై నిలబడటాన్ని చాటి చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఆ హామీల్లోని పలు అంశాలకు 40 రోజుల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 12 బిల్లులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలనే విషయమై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘ కసరత్తు చేశారు. ఆయా బిల్లులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, న్యాయ శాఖతో సమన్వయంతో బిల్లులను రూపొందించాలని చెప్పారు. ఆయా బిల్లులపై మంత్రులు, అధికార సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా చట్టాలను తీసుకురావడంతో పాటు, ఇదివరకు చేసిన చట్టాల్లో సవరణల కోసం ఉద్దేశించిన బిల్లులు ఇప్పటికే తుదిరూపు దిద్దుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమావేశం అయ్యారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బిల్లులు రూపొందబోతున్నాయి. ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు, కాలేజీ ఫీజులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి వైఎస్ జగన్ 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ, పర్యవేక్షణకు చేయనున్న చట్టం కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు, శాశ్వత బీసీ కమిషన్.. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం తదితర అంశాలపై రూపొందించే చట్టాల విషయమై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉపాధికి ఊతం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడారు. ఈ చట్టం పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగత్రలు తీసుకోవాలని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్టం కార్యరూపం దాలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి రోజులు ఇప్పటికే మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించడమే కాకుండా ఎస్సీ మహిళకు హోం శాఖను అప్పగించి ఇప్పటికే ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. వెనుకబాటుతనాన్ని చెప్పుకోవచ్చిక.. వివిధ కులాలను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా బీసీలుగా గుర్తింపు పొందడానికి ఆ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వారి స్థితిగతులతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఎందుకు వారు బీసీలుగా మారాలని కోరుకుంటున్నారనే అంశాలను అధ్యయనం చేసి బీసీ కమిషన్ సిఫార్సులు చేస్తుందని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఇందుకు అనుగుణంగా శాశ్వత ప్రాదిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించనున్నారు. ఏపీఐడీఈ చట్టంలో మార్పులు ఇష్టానుసారం టెండర్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. స్విస్ చాలెంజ్ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్‌పై కట్టబెట్టడం వంటి అనైతిక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పులుస్టాప్ పెట్టనుంది. ఒక రకంగా చెప్పాలంటే గత టీడీపీ సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపధ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఆదా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్ల స్క్రూటినీకి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణలను చేయాలని నిర్ణయించింది. గత చంద్రబాబు సర్కారు రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కోసం స్విస్ చాలెంజ్ ముసుగులో కారు చౌకగా రైతుల నుంచి తీసుకున్న భూములను అప్పగించేందుకు వీలుగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆథారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా, గత టీడీపీ సర్కారులో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపాక ఆ అథారిటీకి ఆ ప్రతిపాదనలను పంపించారు. దీనిని హైకోర్టు తప్పుపట్టడంతో ఆ అథారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు సవరణలు చేసింది. అలాగే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐడీఈ చట్టం నుంచి ఈ సవరణలన్నీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తించనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. ఇదే చట్టంలో టెండర్లను జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రొవిజన్‌ను కొత్తగా చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడిషియల్ స్క్రూటినీ అనంతరమే ఖరారు చేయనున్నారు. భూముల రీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమి మరొకరు కాజేయడం, భూమి హక్కు పత్రాలను సృష్టించడం వంటి చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందుకు స్వస్తి పలికి రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్‌ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పాలక మండళ్లపై సర్కారుకే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సహా పలు ఆలయాల పాలకమండళ్లు, ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ చేయనుంది. ఆ నియమాకాలను సూపర్ సీడ్ చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ దేవదాయ చట్టంలో సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీతో పాటు వివిధ ట్రస్టుల ఛైర్మన్లు, సభ్యులకు సంబంధించి రాజకీయ నియామకాలు జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వం మారితే గత ప్రభుత్వం నియమించిన రాజకీయ పదవుల్లోని వారు రాజీనామా చేస్తారు. అయితే ఇప్పుడు పలువురు రాజకీయం చేయడానికి ఆ పదవుల్లోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ సహా ఇతర ట్రస్టుల చైర్మన్లు, సభ్యులను రీకాల్ చేసే అధికారం ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేలా దేవదాయ శాఖ చట్టంలో సవరణలు తీసుకువస్తూ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టకేలకు లోకాయుక్త రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటు కాలేదు. గత ఐదేళ్ల చంద్రబాబు సర్కారు లోకాయుక్త ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ తరహాలోనే లోకాయుక్త చట్టానికి సవరణలు చేస్తూ లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్తోనే లోకాయుక్త ఏర్పాటు చేయాలని ప్రస్తుత చట్టంలో ఉంది. అయితే రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోయిన పక్షంలో రిటైర్డ్ జడ్జిని నియమించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రస్తుత అసెంబ్లీసమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేయడాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలు పటిష్టం చేయడానికి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య, కాలేజీ విద్య నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఫీజుల నియంత్రణతో పాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సమగ్ర బిల్లును అసెంబీల్లో ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించనున్నారు. కౌలు రైతులకు అండ భూ యజమానుల హక్కులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇచ్చేందుకు వీలుగా చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల పాటు కౌలు ఒప్పందంపై కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేయనున్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులకు చెక్ రాష్ట్రంలో రైతులను పట్టిపీడుస్తున్న కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్ పెట్టాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విత్తన కంపెనీలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం చేసుకున్న కంపెనీల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనాలని రైతులకు ప్రభుత్వం సూచించనుంది. విత్తన, ఇతర కంపెనీల టర్నోవర్ ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు వంద కోట్ల టర్నోవర్ గల కంపెనీ అయితే రెండు కోట్ల రూపాయల మేర సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలతో చేసుకునే అవగాహన ఒప్పందాల్లోనే నకిలీ విత్తనాల వల్ల మొలకెత్తకపోయినా లేదా దిగుబడి రాకపోయినా, దిగుమతి తగ్గినా ఆయా రైతులకు నష్టపరిహారం ఆయా కంపెనీల ద్వారా చెల్లించేలా క్లాజులను పొందు పరచాలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. నకీలీ విత్తనాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యే మార్గంగా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందాలను చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వం మారినా పదవులు వదలని నేతలు అధికారం కోల్పోయిన తర్వాత నైతిక ప్రమాణాలు, విలువలు పాటించి గత ప్రభుత్వంలో దక్కిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసే సంప్రదాయాన్ని టీడీపీ నేతలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కావస్తున్నా చాలా మంది టీడీపీ నేతలు ఇంకా తమ పదవులను వదిలేందుకు ఇష్టపడడం లేదు. టీటీడీ చైర్మన్‌గా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయకుండా మొండికేశారు. ఎట్టకేలకు విమర్శలు తట్టుకోలేక రాజీనామా చేశారు. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న వర్ల రామయ్య, ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నామన రాంబాబు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు.. ఇలా చాలా మంది ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. అధికార మార్పిడి తర్వాత వదిలిపెట్టాల్సిన పదవులను వదిలే విషయంపై చంద్రబాబు సైతం వారికి సరైన దిశా నిర్దేశం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు వదలని వ్యవహారంపై టీడీపీలోని పలువురు సీనియర్ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ నీతులు, విలువల గురించి చెబుతూ ఆచరణలో పాటించక పోవడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది -
సంచలనం.. బెట్టింగ్‌లకు అనుమతించండి
క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్‌లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది. 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయొచ్చా?
ప్రజాభిప్రాయం కోరిన న్యాయ కమిషన్ న్యూఢిల్లీ: బెట్టింగ్, జూదాలను చట్టబద్ధం చేయొచ్చో లేదో తెలపాలని న్యాయ కమిషన్ ప్రజలను కోరింది. వీటిని చట్టబద్ధం చేస్తే దేశంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో కూడా తెలపాలంది. బెట్టింగ్, జూదాలకు లైసెన్స్ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందా? లాంటి విషయాలను ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. మన దేశంలో జూదం, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయడం ఎంత వరకు నైతికంగా సరైందని ప్రశ్నించింది. ‘ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారు దివాలాతీయకుండా కాపాడేందుకు ఉన్న మార్గం ఏంటి? ఒకవేళ వీటిని చట్టబద్ధం చేస్తే విదేశీ కంపెనీలను భారత్‌లోకి అనుమతించాలా?’ అని కమిషన్ అడిగింది. బీసీసీఐ వర్సెస్ బిహార్ క్రికెట్ అసోసియేషన్ కేసును విచారిస్తూ, బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని 2016లో సుప్రీంకోర్టు, న్యాయ కమిషన్‌ను ఆదేశించింది. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
మిర్యాలగూడ టౌన్ : ఎస్సీవర్గీకరణ చట్టభద్ధతను కల్పించేంత వరకు ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పులిపాటి ప్రకాశ్‌మాదిగ, జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య అన్నారు. సోమవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేవానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మాణం చేసి వదిలేసిందని, కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు కేసీఆర్ అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. నవంబరు 20న హైదరాబాద్‌లో 30లక్షల మంది దళితులతో మాదిగల ధర్మయుద్ధ మహాసభను నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న నల్లగొండలోని బండారి గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ ఏడుకొండలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తలకొప్పుల సైదులు, ఇరుగు ఎల్లయ్య, నాయకులు ఉబ్బపల్లి రాజశేఖర్, రామ్‌లక్ష్మణŠ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ టాక్సీలకు గ్రీన్ సిగ్నల్
ట్రాఫిక్ రద్దీతో... సమయం చూసి అధిక రేట్లతో బాది పారేస్తున్న క్యాబ్ సర్వీసులతో విసిగిపోయిన మెట్రోనగర వాసులకు ఇక ఊరట లభించనుంది. దేశంలో మోటార్ బైక్ సర్వీసులకు కేంద్రం ఒకే చెప్పనున్నట్టు తెలుస్తోంది. టూ వీలర్ టాక్సీ సర్వీసులకు చట్టబద్థత తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కేంద్ర మోటార్ వెహికల్ చట్టాన్ని సవరణ తీసుకొచ్చే యోచనలో ఉంది. వీటిని చట్టబద్ధం చేయడంతోపాటు..త్వరలోనే సమగ్రమైన మార్గనిర్దేశకాలను రూపొందించనుంది. కేంద్ర రవాణా శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలకు ఉమ్మడి సమగ్ర విధానంకోసం చర్చిస్తున్నారని రవాణా అధికారి తెలిపారు. రాష్ట్ర రవాణామంత్రులతో కూడిన నిపుణుల బృందం దీనిపై చర్చించి విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి సృష్టించడంతో పాటు ప్రజా రవాణా విస్తరించే అవకాశమున్నందున భారత ప్రభుత్వం మోటర్ బైక్ టాక్సీ వ్యవస్థపై ఆశాజనకంగా ఉందన్నారు. అయితే కేవలం కమర్షియల్ గా నమోదు చేసుకున్న ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు మాత్రమే అవకాశమన్నారు. రిఫ్లెక్టర్ జాకెట్ తో పాటు హెల్మెట్ విధిగా ధరించాలనే నిబంధనను కూడా పొందుపర్చనున్నారు. ఇప్పటికి చాలా టాక్సీ ఎగ్రిగేటర్స్ ప్రయివేటు వాహనాలను టూ వీలర్ టాక్సీలుగా వాడుకుంటున్నట్టుగా తమ దృష్టికివచ్చిందని..దీన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ లైసెన్సింగ్ విధానం దేశవ్యాప్తంగా ఒకే లా ఉండాలని ఎం టాక్సీ వ్యవస్థాపకుడు అర్నబ్ మాధుర్ పేర్కొన్నారు.తాము కూడా కేంద్ర రవాణా శాఖకు ఒక వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయన్నారు. -
సింగిల్ విండోకి చట్టబద్ధత
-
సింగిల్ విండోకి చట్టబద్ధత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేలా సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి చట్టబద్ధత కూడా కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్స్(టీపీఏఎస్‌ఎస్-టీపాస్) 2014 పేరుతో ప్రత్యేక బిల్లును తీసుకొచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్త పారిశ్రామిక విధానంపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి వివిధ పారిశ్రామిక సంఘాలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సమావేశమయ్యారు. వారం రోజుల్లో అభిప్రాయాలను అందిస్తే సాధ్యమైనంత త్వరగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, అసెంబ్లీ సమావేశాల్లో మొదటి బిల్లుగా టీపాస్-2014ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని పారిశ్రామిక ప్రతినిధులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పారిశ్రామిక విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు ఒకే చోట అన్ని అనుమతులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతుల మంజూరు కాలపరిమితి దాటితే అధికారులపై చర్యలు, అవసరమైతే జరిమానా విధింపు అనుమతులు వచ్చేలోగా సెల్ఫ్ డిక్లరేషన్‌తో పనులు మొదలు పెట్టుకునే వెసులుబాటు అధికారులకు జవాబుదారీతనం కల్పించేం దుకు టీపాస్-2014 చట్టం ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి పరిశ్రమలకు అనుమతి వాటర్ గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా {పభుత్వ పారిశ్రామిక పార్కులతో పాటు, ప్రైవేటు పార్కుల ఏర్పాటుకు అనుమతి పరిశ్రమల ఏర్పాటుకు తక్షణం అందుబాటులో 3 లక్షల ఎకరాలు పారిశ్రామిక సంఘాల హర్షం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం ముసాయిదా అద్భుతంగా ఉందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ విధానంతో పారిశ్రామికంగా తెలంగాణ అగ్ర గామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమల్లోకి వస్తే పారిశ్రామిక పెట్టుబడులకు స్నేహపూర్వక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కుతుందని సీఐఐ(తెలంగాణ) వైస్ చైర్మన్ నృపేందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలరన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి పాలసీని దేశంలో ఎక్కడా చూడలేదని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్(టీఐఎఫ్) అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీఐఐ, టీఐఎఫ్, ఫ్యాప్సీ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు పాపారావు, టీజెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్, ఇంధన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు పాల్గొన్నారు.