ప్రతీకాత్మక చిత్రం
ఆసియాకప్ 2022లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలవ్వడానికి మరో రెండు గంటల సమయం మాత్రమే ఉంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే అభిమానులకే కాదు బెట్టింగ్ రాయులు కూడా పండుగ చేసుకుంటారు. తాజాగా మ్యాచ్‌ను పురస్కరించుకొని జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. టాస్ భారత్ గెలిస్తే.. బెట్టింగ్ వేసి వ్యక్తి సుమారు వెయ్యి- 5వేల వరకు పొందే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ మొదలయ్యాకా బెట్టింగ్ జోరు మరింత దూకుడుగా సాగడం ఖాయం.
ఇక టీమిండియా ఎలాగైనా పాక్‌పై మ్యాచ్ గెలవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు తమ దేవుళ్లను మొక్కుతున్నారు. ఇంకొందరు మాత్రం మరింత ముందుకెళ్లి భారత్ గెలవాలంటూ యాగాలు, హోమాలు, పూజలు చేయడం విశేషం. అంతేకాదు కోహ్లి కూడా సెంచరీ చేయాలని అతని ఫోటోకు అభిషేకాలు చేయడం ఆసక్తిగా నిలిచింది.
గత టి20 ప్రపంచకప్‌లో ఇదే వేదికలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఆ మ్యాచ్‌లో విజయం అందుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక మేజర్ టోర్నీల్లో ఎప్పటిలాగే పాకిస్తాన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.
ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
చదవండి: Viral Video: బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
IND Vs PAK Asia Cup 2022: దాయాదుల సమరం.. రికార్డులు, పరుగులు, వికెట్లు చూసేద్దామా!
Comments
Please login to add a commentAdd a comment