homam
-
యూట్యూబర్ ఇంట్లో శుభకార్యం.. నిహారిక, ప్రదీప్‌తో పాటు వాళ్లంతా (ఫొటోలు)
-
రేణూ దేశాయ్ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు)
-
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం (ఫొటోలు)
-
తిరుమల శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న మంత్రి రోజా
-
పార్లమెంటు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ముందుగా హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలతో ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధాన కార్యక్రమంలో 18 ఎన్డీఏ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు 25 పక్షాలు పాలుపంచుకోనున్నాయి. బిజూ జనతాదళ్, జేడీ(ఎస్), అకాలీదళ్, బీఎస్పీ, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్), టీడీపీ వీటిలో ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో దాదాపు 21 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన వేళ లోక్‌సభలో 50 మంది ఎంపీల బలమున్న ఈ ఏడు పార్టీల సంఘీభావం పాలక బీజేపీకి నైతిక స్థైర్యమిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. పాల్గొంటున్న బీఎస్పీ, టీడీపీ పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించనుండటాన్ని స్వాగతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. విపక్షాల బహిష్కరణ నిర్ణయం సరికాదన్నారు. ఆదివాసీ గౌరవం గురించి మాట్లాడుతున్న విపక్షాలకు రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపదీ ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. చరిత్రాత్మక సందర్భాన్ని రాజకీయం చేయకుండా హాజరై పెద్ద మనసు చూపాలని విపక్షాలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని కూడా పార్లమెంటులో భాగమేనని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతి అంటే మనందరికీ గౌరవమే. ద్రౌపదీ ముర్ము గురించి కాంగ్రెస్ నేతలు ఎలా మాట్లాడారో గుర్తు చేసి ఆ పదవిని వివాదాల్లోకి లాగదలచుకోలేదు’’ అన్నారు. కార్యక్రమం ఇలా... ► పార్లమెంటు నూతన భవన ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. తర్వాత సర్వమత ప్రార్థనలుంటాయి. ► అనంతరం హోమ వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తారు. ► అనంతరం లోక్‌సభ చాంబర్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ► మధ్యాహ్నం ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు పాల్గొంటారు. ► మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష పార్టీల నేతలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. -
పాక్‌తో మ్యాచ్.. జోరుగా బెట్టింగ్‌లు, టీమిండియా గెలవాలని పూజలు
ఆసియాకప్ 2022లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలవ్వడానికి మరో రెండు గంటల సమయం మాత్రమే ఉంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే అభిమానులకే కాదు బెట్టింగ్ రాయులు కూడా పండుగ చేసుకుంటారు. తాజాగా మ్యాచ్‌ను పురస్కరించుకొని జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. టాస్ భారత్ గెలిస్తే.. బెట్టింగ్ వేసి వ్యక్తి సుమారు వెయ్యి- 5వేల వరకు పొందే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ మొదలయ్యాకా బెట్టింగ్ జోరు మరింత దూకుడుగా సాగడం ఖాయం. ఇక టీమిండియా ఎలాగైనా పాక్‌పై మ్యాచ్ గెలవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు తమ దేవుళ్లను మొక్కుతున్నారు. ఇంకొందరు మాత్రం మరింత ముందుకెళ్లి భారత్ గెలవాలంటూ యాగాలు, హోమాలు, పూజలు చేయడం విశేషం. అంతేకాదు కోహ్లి కూడా సెంచరీ చేయాలని అతని ఫోటోకు అభిషేకాలు చేయడం ఆసక్తిగా నిలిచింది. గత టి20 ప్రపంచకప్‌లో ఇదే వేదికలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఆ మ్యాచ్‌లో విజయం అందుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక మేజర్ టోర్నీల్లో ఎప్పటిలాగే పాకిస్తాన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. చదవండి: Viral Video: బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు IND Vs PAK Asia Cup 2022: దాయాదుల సమరం.. రికార్డులు, పరుగులు, వికెట్లు చూసేద్దామా! -
‘అంటే సుందరానికీ..’అప్డేట్.. ఫన్నీగా పోస్టర్
Ante Sundaraniki Makers Treats Fans On Nani Birthday: 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్టు కొట్టిన నాని అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ..’రీసెంట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. పుట్టినరోజుకి ఒకరోజు ముందుగా యువ సుందరుడి బర్త్ డే హోమం.. అందరూ ఆహ్వానితులే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలారు. దీన్ని రీట్వీట్ చేసిన నాని ఏంటో.. అంటూ సిగ్గుపడుతున్న ఎమోజీని షేర్ చేశారు. మరి నాని బర్త్‌డే ట్రీట్ ఏ విధంగా ఉంటుదన్నది చూడాల్సి ఉంది. Yentoo 🙈#AnteSundaraniki https://t.co/oZ3znSMOc3 — Nani (@NameisNani) February 22, 2022 -
చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు
బెంగళూరు: మహమ్మారి కరోనా వైరస్‌పై ఇంకా మూఢ నమ్మకాలు పోవడం లేదు. స్వయంగా ప్రజాప్రతినిధులే ఆ పూజలు ఈ పూజలు చేయండి.. కరోనా పోతుందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిహోత్ర హోమం చేపట్టారు. ఆ హోం చేయడం వరకు మంచిదే కానీ.. ఆ తర్వాత ధూపం పేరిట ఊరంతా పొగ పెట్టాడు. సామ్రాణి వేస్తూ స్వయంగా ఆ ఎమ్మెల్యే రిక్షా బండి తోలుకుంటూ వెళ్లాడు. కర్నాటకలోని బెళగావి దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మంగళవారం పూజలు చేశాడు. కొబ్బరి, నెయ్యి, బియ్యం ఇతర మూలికలు వేసి అగ్నిహోత్ర హోమం చేశాడు. అనంతరం ఒక రిక్షా బండిలో కూడా ఆ పదార్థాలన్నీ వేసి నిప్పు పెట్టాడు. పొగ వస్తుండడంతో ఆ రిక్షా బండిని తన అనుచరులతో కలిసి గుంపుగా బెళగావి పట్టణంలో తిరిగాడు. ఆ పొగ పీలిస్తే కరోనా పోతుందని ఎమ్మెల్యే అభయ్ పాటిల్ తెలిపాడు. అయితే అతడి చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. మూఢనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా తన అనుచరులతో తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
వైఎస్ జగన్ సీఎం కావాలంటూ అనంతలో హోమం
-
హోమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్ రాజశ్యామల హోమం
-
కేసీఆర్ రాజాశ్యామల హోమం
జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతకాలు, ముహూర్తాలను ఎక్కువగా విశ్వసించే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రాజాశ్యామల హోమం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు యాగం నిర్వహించనున్నారు. ఇటీవల చినజీయర్‌స్వామిని కలిసిన కేసీఆర్.. ఫాంహౌస్‌లోనే హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వామి వారి శిష్యబృందం వేద పండితులతోనే రాజాశ్యామల హోమం చేపట్టనున్నారు. హోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు ముఖ్య అనుచరులు పాల్గొనే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం నుంచే హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. రాజయోగం.. ప్రజా సంక్షేమం కోసమే... ఫాంహౌస్‌లో ఆదివారం నిర్వహించే హోమం కేసీఆర్ రాజయోగం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి జన్మదినం సం దర్భంగా స్వామి హోమం నిర్వహించారు. స్వామిజీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఈనెల 10న అక్కడికి వెళ్లారు. కేసీఆర్ తన మనసులోని మాటను చినజీయర్‌స్వామికి, వేద పండితులకు వివరించగా మంచి ముహూర్తం చూసి హోమం చేయాలని పండితులు చెప్పగా వారి సూచనలు, సలహాల మేరకు ఆదివారం ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు హోమానికి శ్రీకారం చుట్టారు. 120 మంది ఋత్వికులతో హోమం... రాజాశ్యామల హోమాన్ని చినజీయర్‌స్వామి శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రమే వారంతా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒకేసారి 120 మంది ఋత్వికులతో హోమం జరగనుంది. హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని పూజలు చేయనున్నారు. రెండోరోజు కేసీఆర్ కుమారుడు, కుమార్తెలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ముఖ్య అనుచరులు కూడా పాల్గొననున్నారు. హోమానికి ముమ్మర ఏర్పాట్లు... కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం నిర్వహించే రాజాశ్యామల హోమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే ఫాంహౌస్‌లో అన్ని రకాల ఏర్పాట్లలో వేద పండితులు నిమగ్నమయ్యారు. ముందుగానే పండితులు ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మలు ఫాంహౌస్‌కు చేరుకుని హోమంకు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. రాత్రి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకుని హోమం ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిసింది. ఫాంహౌస్‌కు ప్రధాన గేటుకు ఎడమ భాగంలో హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. హోమం చేసేందుకు పందిళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం
జగిత్యాల జోన్/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు. వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు. -
‘మృత్యుంజయ హోమం వైద్యవృత్తికే అవమానం’
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) :హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు మృత్యుంజయ హోమం చేయడం వైద్యవృత్తికే అవమానమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఆధునిక వైద్యం శాస్త్రీయపరంగా చాలా అభివృద్ధి చెందిందని, వైద్యవృత్తి చేసేవారికి మానవ శరీర నిర్మాణం, జనన, మరణాలపై కనీస పరిజ్ఞానం ఉంటుందన్నారు. వైద్యకళాశాలల్లో ఇందుకు సంబంధించిన విజ్ఞానం నేర్చుకున్న వైద్యులు గాంధీ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు హోమాలు చేయడం అనాగరిక చర్య అని అన్నారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చేసిన మృత్యుంజయ హోమం వైద్యుల మూఢ నమ్మకాలకు నిదర్శనమన్నారు. ఈ చర్యలను జనవిజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి రోగులను కాపాడాల్సిన బాధ్యత నుంచి డాక్టర్లు తప్పుకుని దేవుడిపై భారం వేయడం దారుణమని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ రవీంద్ర సూరి, రామ్మోహన్రావు, నర్ర రామారావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
గాంధీలో ‘హోమం’పై విచారణ
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో హోమం నిర్వహించడంపై పాలన యంత్రాంగం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. తల్లీపిల్లల మరణాలు నివారించేందుకంటూ ఆస్పత్రి ప్రసూతి వార్డులో సోమవారం మహామృత్యుంజయ హోమం నిర్వహించిన సంగతి విదితమే. దీనిపై ఆస్పత్రి సెమినార్ హాలులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావునేత, ఆర్ఎంఓ–1 జయకృష్ణ, ఆర్‌ఎంఓలు శేషాద్రి, సాల్మన్ మాట్లాడారు. ఆసుపత్రిలో హోమం జరపటంపై తమకు సమాచారం లేదన్నారు. గైనకాలజీ వైద్యులే హోమం చేశారా లేక తమ కుటుంబసభ్యులు బాగుండాలని రోగులు నిర్వహించిన హోమానికి వైద్యులు హాజరయ్యారా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని సాయిబాబా ఆలయంలో నాలుగేళ్లుగా మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నామని, ఈసారి మాత్రం రోగులు, వారి సహాయకుల అభ్యర్థన మేరకు ఆస్పత్రి వరండాలో నిర్వహించినట్లు కొందరు వైద్యులు వివరణ ఇచ్చారు. -
ఆస్పత్రికి వాస్తు దోషమట మరణాలు ఆగాలట!
-
దేవుడా.. దేవుడా!
గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో మహా మృత్యుంజయ హోమం ఆస్పత్రికి వాస్తు దోషమట.. తల్లీపిల్లల మరణాలు ఆగాలట! హోమం నిర్వహణపై వెల్లువెత్తిన విమర్శలు సాక్షి, హైదరాబాద్: సర్జరీలు జరగాల్సిన చోట శాస్త్రోక్తంగా పూజలు చేశారు.. స్టెతస్కోప్‌తో రోగి గుండెచప్పుడు వినాల్సిన డాక్టర్లు హోమగుండం వద్ద భక్తిప్రపత్తులతో నిల్చున్నారు.. ఆసుపత్రికి పట్టిన వాస్తుదోషం తొలగిపోవాలని, తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాలని దేవుడ్ని వేడుకున్నారు! ఈ తతంగమంతా జరిగింది ఎక్కడో కాదు.. మన రాజధాని నగరంలోని గాంధీ ఆస్పత్రిలో! సోమవారం గైనకాలజీ విభాగంలో నాలుగు గంటలపాటు హోమం చేయించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఆస్పత్రిలో నమోదవుతున్న తల్లీబిడ్డల మరణాలకు వాస్తుదోషమే కారణమని, మృత్యుంజయ హోమం చేయించడం ద్వారా పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని ఓ వ్యక్తి చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇలా చేశారు. వాస్తు దోషాలు, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన వైద్యులే ఇలా హోమాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ జనరల్ ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజూ సగటున 2,500 మంది రోగులు వస్తుంటారు. గైనకాలజీ విభాగంలో రోజూ సగటున 30–40 ప్రసవాలు జరుగుతుంటాయి. ఆస్పత్రికి వచ్చే కేసుల్లో అధిక శాతం హైరిస్కు కేసులే ఉంటాయి. ఇటీవల బాలింతలు, చిన్నారుల మరణాలు పెరగడంతో సోమవారం హోమం చేశారు. ఇందులో గైనకాలజీ విభాగాధిపతి అనుపమ, మాజీ ఆర్ఎంవో ప్రమీలతోపాటు వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌ను ప్రశ్నించగా.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. -
శ్రీమఠంలో ముగిసిన హోమాలు
లోకకల్యాణార్థం మూడురోజులుగా నిర్వహణ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో లోక కల్యాణార్థం చేపట్టిన హోమాలు బుధవారంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో మూడురోజులుగా శాంతి, వాస్తు హోమాలు నిర్వహించారు. శ్రీమఠం యాగశాలలో పండితుల వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా, భక్తుల హర్షధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా పురోహితులు క్రతువులు కానిచ్చారు. హోమాల సమర్పణోత్సవంలో భాగంగా పూర్ణాహుతి కనుల పండువగా చేశారు. ముందుగా పీఠాధిపతి పూర్ణకుంభాలతో రాఘవేంద్రుల బృందావనంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా మంచాలమ్మ ఆలయం చేరుకుని పట్టువస్త్ర, ఆభరణాల సమర్పణ పూజలు చేశారు. యాగ శాలను చేరుకుని పూర్ణహుతి పలికారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో హోమాలు చేపట్టినట్లు పీఠాధిపతి వివరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
నూతన కలశ పునఃప్రతిష్ఠాపన
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ స్వర్ణగోపురం సప్తదళ బంగారు కలశాన్ని శనివారం పునఃప్రతిష్ఠించారు. ముందుగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో యాగశాలలో పుణ్యవచనం, శాంతి, నవగ్రహ, ప్రాయశ్చిత హోమాలు, వాస్తుపూజలు కానిచ్చారు. ప్రాణప్రతిష్ఠతో కలశాన్ని గోపురంపై ప్రతిష్ఠించారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈనెల 7వ తేదీ రాత్రి ఈదురు గాలులకు బంగారు కలశం విరిగి పడిన విషయం విదితమే. పునఃప్రతిష్టాపన వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, దివాన్ వాదిరాజాచార్ పాల్గొన్నారు. -
వైభవంగా శోభనాచలుడి శాంతికల్యాణం
ఆగిరిపల్లి : శ్రీశోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం శాంతి కల్యాణం, సుదర్శన శాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభనాచలస్వామి వెలసిన కొండ మీద మూడు దేవాలయాల్లో ఉదయం స్వామివారికి నవకలశ పంచామృత స్నపన, విశేష అలంకరణ, శాంతి కల్యాణం, లక్ష్మీనృసింహ సుదర్శన మూలమంత్ర శాంతి హోమం, పూర్ణాహుతిని జరిపారు. ఆగిరిపల్లికి చెందిన వై.చంద్రశేఖర్ మిత్ర బృందం, విజయవాడకు చెందిన టి.కోటేశ్వరరావు దంపతులు, ఈదులగూడేనికి చెందిన చిట్నేని వెంకట శివరామకృష్ణారావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, జి.అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఆలయ ఈవో జె.రాంబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
‘తెలుగు’ కోసం హోమం
తెలుగు భాషా పరిరక్షణ కోసం దర్శక-నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఆయన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ హోమం చేశారు. ప్రపంచంలోని తెలుగువారందరూ మాతృభాషపై ప్రేమ పెంపొందించు కోవాలని, తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2006 నిర్బంధ భాషా చట్టం రద్దు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ హోమంతో అయినా పాలకుల్లో మార్పు రావాలన్నారు. త్వరలో ఈ ఆలయ ప్రాంగణంలో తెలుగుతల్లి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు. -
సీఎం చిత్రపటంతో హోమం
భద్రాచలం(ఖమ్మం) : అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అర్చక-ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు నాల్గోరోజుకు చేరాయి. శుక్రవారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో వినూత్న రీతిలో నిరశన తెలిపారు. శ్రావణ శుక్రవారం కావటంతో తమ సమస్యలపై ప్రభుత్వానికి జ్ఞానోదయం కలుగాలని శ్రీమహాలక్ష్మి హోమంను నిర్వహించారు. భద్రాచలంలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ గుండంను ఏర్పాటు చేసి యాగం జరిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలను అక్కడ ఏర్పాటు చేసి హోమం నిర్వహించటం గమనార్హం. హోమం అనంతరం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అర్చక, ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ అమలు మేరకు అర్చక, ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భక్తులను అయోమయే పరిచే రీతిలో కొంతమంది విరుద్ధ ప్రకటనలు ఇవ్వటం కూడా సరైంది కాదన్నారు. ప్రభుత్వం దీనిపై సత్వరమే స్పందించాలని కోరారు. -
సినీ పరిశ్రమ మేలు కోసం యాగం
‘‘పలువురు సినీ ప్రముఖులు ఇటీవల ఆకస్మికంగా కన్ను మూశారు. దాంతో, అందరూ సినీ పరిశ్రమకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సినీ పరిశ్రమ మేలు కోసం స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం’ చేస్తున్నాం. పరిశ్రమలోని అన్ని శాఖల వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని నటీనటుల సంఘం అధ్యక్షులు మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ యాగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని రమేశ్, ఆకెళ్ల గిరిబాబు, శివకృష్ణ తదితరులు మాట్లాడారు. -
జగన్ దీక్షకు మద్దతుగా ఆంజనేయ హొమం