నూతన కలశ పునఃప్రతిష్ఠాపన
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ స్వర్ణగోపురం సప్తదళ బంగారు కలశాన్ని శనివారం పునఃప్రతిష్ఠించారు. ముందుగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో యాగశాలలో పుణ్యవచనం, శాంతి, నవగ్రహ, ప్రాయశ్చిత హోమాలు, వాస్తుపూజలు కానిచ్చారు. ప్రాణప్రతిష్ఠతో కలశాన్ని గోపురంపై ప్రతిష్ఠించారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈనెల 7వ తేదీ రాత్రి ఈదురు గాలులకు బంగారు కలశం విరిగి పడిన విషయం విదితమే. పునఃప్రతిష్టాపన వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, దివాన్ వాదిరాజాచార్ పాల్గొన్నారు.