
Ante Sundaraniki Makers Treats Fans On Nani Birthday: 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్టు కొట్టిన నాని అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ..’రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. పుట్టినరోజుకి ఒకరోజు ముందుగా యువ సుందరుడి బర్త్ డే హోమం.. అందరూ ఆహ్వానితులే అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదిలారు. దీన్ని రీట్వీట్ చేసిన నాని ఏంటో.. అంటూ సిగ్గుపడుతున్న ఎమోజీని షేర్ చేశారు. మరి నాని బర్త్‌డే ట్రీట్ ఏ విధంగా ఉంటుదన్నది చూడాల్సి ఉంది.
Yentoo 🙈#AnteSundaraniki https://t.co/oZ3znSMOc3
— Nani (@NameisNani) February 22, 2022