నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్. ఈ సినిమా నుంచి 'రంగో రంగా'.. అనే లిరికల్ సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇందులో నాని లుక్ తలకు గాయంలో చేత్తో సైకిల్‌ను పట్టుకొని భయంతో చూస్తున్నట్లు ఉంది. కాగా ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది.
Kickstarting with a quirk ;)#AnteSundaraniki #RangoRanga pic.twitter.com/bgYY7xq3h7
— Nani (@NameisNani) May 21, 2022
Comments
Please login to add a commentAdd a comment