Nani Ante Sundaraniki Movie Teaser Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki Teaser: అంటే సుందరానికి టీజర్‌ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

Published Mon, Apr 18 2022 3:33 PM | Last Updated on Mon, Apr 18 2022 4:54 PM

Nani Ante Sundaraniki Teaser To Release On April 20th - Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. జూన్‌ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా టీజర్‌ రిలీజ్‌కు రంగం సిద్దమైంది. ఈ మేరకు మేకర్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంటే సుందరానికి టీజర్‌ను ఈనెల 20న ఉద‌యం 11.07 నిమిషాల‌కు  రిలీజ్‌ చేయనున్నట్లు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒక పోస్టర్లో సుందర్, లీలా హిందూ సంప్రదాయ పద్ధతిలో, మరో పోస్టర్లో వెస్ట్రన్ పెళ్లి దుస్తుల్లో కన్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement