సినీ పరిశ్రమ మేలు కోసం యాగం
‘‘పలువురు సినీ ప్రముఖులు ఇటీవల ఆకస్మికంగా కన్ను మూశారు. దాంతో, అందరూ సినీ పరిశ్రమకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సినీ పరిశ్రమ మేలు కోసం స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం’ చేస్తున్నాం.
పరిశ్రమలోని అన్ని శాఖల వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని నటీనటుల సంఘం అధ్యక్షులు మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ యాగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని రమేశ్, ఆకెళ్ల గిరిబాబు, శివకృష్ణ తదితరులు మాట్లాడారు.