swaroopananda saraswathi
-
రామ మందిరం ఎలా వుండాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్‌లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు. -
విశాఖ శారదా పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి
హైదరాబాద్: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు. ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా ఆయ నను నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం: నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి మంగళవారం విశాఖ పర్యటనకు విచ్చేశారు. గన్నవరం నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులందరినీ ఆయన పేరుపేరునా పలుకరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎన్ఎడీ, వేపగుంట మీదుగా మధ్యాహ్నం 12.20 గంటలకు పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలో ఉన్న శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. పీఠం సంప్రదాయం ప్రకారం మేళతాళాల మధ్య గురువులు, వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. పీఠంలోని జగద్గురు సన్నిధిలో వేంచేసి ఉన్న పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిజీని వైఎస్ జగన్ దర్శించుకుని వారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామిజీని తులసి, పుష్పమాలలతో సత్కరించి పట్టు వస్త్రాలు, పండ్లు బహూకరించారు. స్వామిజీతో కొద్దిసేపు మాట్లాడారు. భేటీ అనంతరం స్వామిజీతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వర్ణమండపంలో కొలువైన అమ్మవారి సన్నిధిలో స్వామిజీ స్వయంగా పూజలు నిర్వహించి సీఎంను ఆశీర్వదించారు. అక్కడి నుంచి పీఠంలోని వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి, మేధా దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శారదాంబ పీఠార్చన ప్రాంగణాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సింహాచలం వేద పండితుల ఆశీర్వాదం సింహాచలం దేవస్థానం వేద పండితులు పీఠంలో సీఎంను దుశ్శాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో చంద్రమోహన్ అప్పన్న చిత్రపటాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. పీఠంలో సుమారు రెండు గంటల పాటు గడిపిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరగా, పీఠం ఉత్తరాధికారి బాల స్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, పీఠం ప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో గన్నవరం బయల్దేరారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, డాక్టర్ భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, పెట్ల ఉమా శంకర గణేష్, చెట్టి ఫల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, ధర్మాన కృష్ణదాస్, విశ్వసరాయ కళావతి, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, తెర్లం బాలరాజు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వర రావు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరరావు, బలిరెడ్డి సత్యారావు, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం 3.40 గంటలకు వైజాగ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరారు. -
తాంత్రిక పూజల్లో పెద్దల హస్తం
-
తాంత్రిక పూజల్లో పెద్దల హస్తం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : విజయవాడ దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేవలం కొందరి లబ్ధి కోసం ప్రజలకు, రాష్ట్రానికి ఏర్పడే నష్టం గురించి తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన రీతిలో తాంత్రిక పూజలు నిర్వహించడం దారుణమన్నారు. పవిత్రమైన దేవాలయంలో అపచారం జరిగితే దానివల్ల జరిగే అనర్థాలను నివారించేందుకు పీఠాధిపతులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని.. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్వామీజీ హెచ్చరించారు. ఈ ఘటనపై పెద్దలను వదిలి అర్చకులను దోషులను చేయడం బాధాకరమన్నారు. తాంత్రిక పూజలు నిర్వహించిన వారిని వదిలిపెట్టి బ్రాహ్మణులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. నేడు బ్రాహ్మణుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వారి స్థలాలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాంత్రిక పూజల మలినాన్ని కడిగి సంప్రోక్షణ చేయాలని స్వామీజీ సూచించారు. -
సినీ పరిశ్రమ మేలు కోసం యాగం
‘‘పలువురు సినీ ప్రముఖులు ఇటీవల ఆకస్మికంగా కన్ను మూశారు. దాంతో, అందరూ సినీ పరిశ్రమకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అందుకే సినీ పరిశ్రమ మేలు కోసం స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం’ చేస్తున్నాం. పరిశ్రమలోని అన్ని శాఖల వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని నటీనటుల సంఘం అధ్యక్షులు మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ యాగానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని రమేశ్, ఆకెళ్ల గిరిబాబు, శివకృష్ణ తదితరులు మాట్లాడారు.