విజయవాడ దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేవలం కొందరి లబ్ధి కోసం ప్రజలకు, రాష్ట్రానికి ఏర్పడే నష్టం గురించి తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన రీతిలో తాంత్రిక పూజలు నిర్వహించడం దారుణమన్నారు.