
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలులో రేస్ కోర్స్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ రేస్ క్లబ్ ద్వారా గుర్రపు పందేలు, బెట్టింగులు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలోనే రెండు రాష్ట్రాలోన్లూ ప్రస్తుతం బెట్టింగ్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ రేస్ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు కూడా.