ఢిల్లీ నుంచి బెట్టింగ్ రేషియో
ఐపీఎల్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా దందా
ఇరువురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్
సిటీబ్యూరో: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.84 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చెందిన గజానంద్ ఉపాధ్యాయ, బేగంబజార్‌కు చెందిన అతడి స్నేహితుడు సందీప్ టక్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బుకీలుగా మారారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఫోన్ల ద్వారా పరిచయస్తులు, స్నేహితుల నుంచి పందాలు అంగీకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్‌డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన బుంటి భాయ్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.నాలుగు వేలు చొప్పున చెల్లించేవారు.
దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలకు బుంటి భాయ్ లాంటి వాళ్ళు రేష్యోలు చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకుంటుంటారు. కేవలం రూ.లక్ష లోపు పందాలను మాత్రమే గజానంద్, సందీప్ అంగీకరిస్తారు. పందెం రాయుళ్లు అంతకంటే ఎక్కువ మొత్తం బెట్టింగ్ కాయాలని కోరితే... వారిని కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన లడ్డూ కచువకు పరిచయం చేసి కమీషన్ తీసుకునేవారు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి వీరి దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ నేతృత్వంలో ఎòౖÜ్సలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్.సైదాబాబు దాడులు నిర్వహించి నిందితులు గజానంద్, సందీప్‌లను అరెస్టు చేశారు. పరా>రీలో ఉన్న నిందితులు బుంటి భాయ్, లడ్డూ కోసం గాలిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు.