IPL cricket match
-
రికీ పాంటింగ్ కి రూల్స్ అర్థం కాలేదా ?
-
క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రతి మ్యాచ్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్‌కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. బెట్టింగ్‌లకు బానిసగా మారాడు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్ ఉదయ్ కుమార్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన లైన్లను తీసుకునేవాడు. మన్సూరాబాద్‌లోని చండీశ్వర్ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్‌ను సబ్– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్ లోటస్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్ దాడులు చేసి మెయిన్ ఆర్గనైజర్ దేవినేని చక్రవర్తి, సబ్ బుకీ హరీష్‌లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్రెడ్డి సురేశ్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ ఆసిఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్ ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు. (చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్ వీడియో) -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్‌బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌కుమార్, వెంకటసుదర్శన్‌రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్‌రావు వివరించారు. -
ఐపీఎల్ బ్లాక్ టికెటింగ్ ముఠా ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా వారం క్రితం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు బ్లాక్టికెట్లు అమ్ముతున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్న సంగతి మరువకముందే మరో ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన ప్రతీ నగరంలోనూ యథేచ్ఛగా కొనసాగిన వీరి బ్లాక్టికెట్ల దందాకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. కేవలం ఫేస్బుక్ ద్వారా ముగ్గురు ఒకరినొకరు పరిచయం చేసుకుని బ్లాక్టికెట్ల దందాను కొనసాగించారు. బ్లాక్టికెట్ల అమ్మకాలకు ఏకంగా విమానంలోనే వీరు రాకపోకలు సాగిస్తుండటం కొసమెరుపు. ఫేస్బుక్ ద్వారా పరిచయం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆయుష్ విధేలే, కోల్‌కతాకు చెందిన సచిన్ శుక్లా, రాజస్తాన్ వాసి రిషబ్ సుథార్లు వేర్వేరు కాలేజీల్లో విద్యార్థులు. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఈ ముగ్గురు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. అందుకు బ్లాక్టికెట్లను అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్లో ఈ మెయిల్ ఐడీ ద్వారా పరిమిత సంఖ్యలోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో పథకం ప్రకారం ఈ ముగ్గురూ అనేక ఈమెయిల్ ఐడీలు సృష్టించారు. వీటి ఆధారంగా దేశంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లను భారీగా ఆన్లైన్లో బుక్ చేసి టికెట్ కౌంటర్ల ద్వారా వాటిని తీసుకుంటున్నారు. మ్యాచ్ తేదీకి కొద్దిరోజుల ముందు ఈ ముగ్గురూ విమానాల్లో సంబంధిత నగరానికి చేరుకుని మ్యాచ్‌లకున్న డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రెట్టింపు ధర లేదా అంతకంటే ఎక్కువకు అమ్ముకుంటున్నారు. ఈనెల 14, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలోని ఎస్ఆర్హెచ్–డీసీ, ఎస్ఆర్హెచ్–కేకేఆర్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లతో వీరు కొద్దిరోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. అయితే 14న జరిగిన మ్యాచ్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో వీరు బుక్ చేసుకున్న టికెట్లలో 89 టికెట్లను విక్రయించలేకపోయారు. రెండో మ్యాచ్‌కు సంబంధించి 162 టికెట్లను సికింద్రాబాద్ కేంద్రంగా అమ్మడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడి జింఖానా గ్రౌండ్స్ సమీపంలోని టికెట్ కౌంటర్ వద్దకు మంగళవారం చేరుకుని తమ వద్ద ఉన్న టికెట్లను అమ్మడం మొదలెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 251 టికెట్లు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులైన ఈ ముగ్గురూ జల్సాలకు అలవాటు పడ్డారని, అందుకు అవసరమైన డబ్బు కోసమే ఈ మార్గం ఎంచుకున్నారని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
వాట్సాప్‌లో బెట్టింగ్!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ మొదలుకాగానే బెట్టింగ్ జోరు మళ్లీ మొదలైంది. రోజూ వందల కోట్ల రూపాయల పందేలు జోరుగా జరిగిపోతున్నాయి. బుకీలు, సబ్–బుకీలు వాట్సాప్ గ్రూపులు పెట్టి మరీ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నిఘా ఎక్కువగా ఉండటంతో.. ‘సెట్టింగు’లన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అకౌంట్ల నిర్వహణకు మాట్రిక్స్ సాఫ్ట్‌వేర్‌ను.. ఆర్థిక లావాదేవీల కోసం ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, పేటీఎం వంటి యాప్స్‌ను వాడుతున్నారు.. ఇలా వ్యవస్థీకృతంగా బెట్టింగ్ దందా సాగిస్తున్న నాలుగు ముఠాలకు హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. గట్టి నిఘా పెట్టి.. 12 మందిని అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సోమవారం ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇక్కడ హడావుడి లేకుండా.. సాధారణంగా బెట్టింగులు నిర్వహించే బుకీలు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలు, సెట్‌టాప్ బాక్సులు, ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్ బాక్సులు వంటివి అవసరమవుతాయి. బెట్టింగ్ స్థావరాలపై పోలీసులకు సమాచారం అందడానికి ఇవి కారణంగా మారుతాయి. దీంతో ప్రస్తుతం ప్రధాన బుకీలు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, మంగళ్‌హాట్, కాచిగూడ, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సబ్–బుకీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సబ్–బుకీలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. అందులో బెట్టింగ్ నిర్వహిస్తారు. ఈ గ్రూపులు ఇంటర్నెట్ ద్వారా ప్రధాన బుకీ వద్ద ఉండే ల్యాప్‌టాప్‌లోని మ్యాట్రిక్స్ అనే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఒక్కో మ్యాచ్ పూర్తయిన తరవాత సదరు ల్యాప్‌టాప్ నుంచి బ్యాలెన్స్ షీట్ తీస్తారు. ఎవరెవరు ఏ టీమ్‌పై పందెం కాశారు, రేషియో ఎంత, గెలుపోటములను బట్టి ఎవరికి ఎంత చెల్లించాలి, ఎవరి నుంచి ఎంత వసూలు చేయాలన్న వివరాలన్నీ వస్తాయి. ఇందులో పంటర్ల పేర్ల స్థానంలో మాత్రం బుకీలు, సబ్–బుకీలు ఇచ్చిన కోడ్ నేమ్స్ వస్తాయి. బెట్ఫేర్, లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ ఏర్పాట్లతో.. సాధారణంగా బుకీలు తమకు పరిచయస్తులైన పంటర్ల నుంచే బెట్టింగులు అంగీకరిస్తారు. ముందుగా ఒక్కో పంటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. ఆపై వారికి కొన్ని నంబర్లు ఇస్తారు. మ్యాచ్ ప్రారంభవడానికి ముందు పంటర్లు బుకీలకు ఫోన్ చేసి స్ట్రైక్ తెలుసుకుంటారు. ఏ టీమ్‌పై ఎంత చొప్పన పందెం నడుస్తోందో తెలియజేయడాన్ని స్ట్రైక్ అంటారు. అంటే బలహీనంగా ఉన్న జట్టుపై పందెం కాసిన పక్షంలో... ఆ జట్టు గెలిస్తే కట్టిన సొమ్ముకు రెండు నుంచి నాలుగింతలు ఇస్తారు. అదే బలమైన జట్టుపై పందెం కాస్తే... కేవలం రెట్టింపుగానీ, అంతకన్నా తక్కువగానీ ఇస్తారు. ఈ స్టైక్ తెలుసుకున్న పంటర్లు తాము ఏ టీమ్‌పై పందెం కాస్తున్నామో చెబుతారు. స్ట్రైక్స్ తెలుసుకోవడానికి ప్రత్యేకంగా బెట్ఫేర్ అనే వెబ్సైట్ కూడా పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో బుకీలంతా కలసి లైవ్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. హరియాణా కేంద్రంగా ఉన్న ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన భాషలన్నింటిలో.. ఎప్పటికప్పుడు జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన రేషియో, ఫేవరెట్ టీమ్, ఫేవరెట్ ప్లేయర్ తదితరాలను ప్రధాన, సబ్–బుకీలకు అందుబాటులో ఉంచుతారు. దీనికోసం ఒక్కొక్కరు నెలకు రూ.4 వేల చొప్పున రుసుము చెల్లిస్తుంటారు. ఫేస్బుక్ ద్వారా సలహాలు, సూచనలు.. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి అనేకమంది అనలిస్టులు ఫేస్బుక్ ద్వారా పంటర్లకు అందుబాటులో ఉంటారు. తమ చిరునామా, ఇతర వివరాలను బయటపడనీయని వారు.. ఆ మ్యాచ్‌లో ఎవరు ఫేవరేట్, తీరు తెన్నులు, గెలుపోటములు ఎలా ఉంటాయి? వంటి అంశాలపై ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సలహాలు ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆన్లైన్లో వసూలు చేస్తుంటారు. పందాలు కాయడానికి ఫేవరెట్స్‌ను మాత్రం నిర్ణయించేది చేసేది బుకీలే. టాస్ ఎవరు గెలుస్తారనే దానిపై రూ.1,000 పందెం కాసి గెలిస్తే.. గెలిచిన వ్యక్తికి రూ.1,900 చెల్లిస్తారు. ఫేవరెట్ టీమ్, క్రీడాకారుడిపై రూ.1,000 పందెం కాసి.. గెలిస్తే రూ.1,400 ఇస్తారు. ఫలానా ఓవర్లో, లేదా కొన్ని ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారనే ‘సెషన్స్’పై రూ.1,000 పందెం కాసి గెలిస్తే రూ.2వేలు చెల్లిస్తారు. ఈ ఐపీఎల్ సీజన్లో టాస్, ఫేవరెట్, సెషన్స్ మీదే ఎక్కువగా పందాలు సాగాయి. చిక్కింది వీరే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ముంబై కేంద్రంగా ఉన్న ప్రధాన బుకీలు పి.మహేష్, ఆర్.చిరాన్ల కింద పనిచేస్తున్న సబ్–బుకీలు, ఏజెంట్లయిన మహేష్ మనియాల్, ఎస్.సాయికుమార్, రాజ్‌కుమార్, వినోద్.. – గోవా కేంద్రంగా దందా నడుపుతున్న ప్రధాన బుకీ ప్రకాశ్‌సింగ్ కింద పనిచేస్తున్న ఎన్.ముఖేశ్‌సింగ్, సి.శ్రీనివాస్, కునాల్‌సింగ్, సుర్జీత్‌సింగ్.. – రాజస్థాన్‌లో కేంద్రం నడిపిస్తున్న ప్రధాన బుకీ రాకేశ్, రాజుల కింద పనిచేస్తున్న వినయ్ మోదీ, పిట్టీ ప్రీతేష్.. – ఈ మూడు గ్యాంగులతో పాటు మరో గ్యాంగుకు చెందిన జి.ఉపాధ్యాయను పోలీసులు పట్టుకున్నారు. వీరిందరి నుంచి రూ.15.5 లక్షల నగదు, 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.7.27 లక్షలను ఫ్రీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
ఢిల్లీ నుంచి బెట్టింగ్ రేషియో
ఐపీఎల్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా దందా ఇరువురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సిటీబ్యూరో: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.84 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చెందిన గజానంద్ ఉపాధ్యాయ, బేగంబజార్‌కు చెందిన అతడి స్నేహితుడు సందీప్ టక్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బుకీలుగా మారారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఫోన్ల ద్వారా పరిచయస్తులు, స్నేహితుల నుంచి పందాలు అంగీకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన బుంటి భాయ్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.నాలుగు వేలు చొప్పున చెల్లించేవారు. దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలకు బుంటి భాయ్ లాంటి వాళ్ళు రేష్యోలు చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకుంటుంటారు. కేవలం రూ.లక్ష లోపు పందాలను మాత్రమే గజానంద్, సందీప్ అంగీకరిస్తారు. పందెం రాయుళ్లు అంతకంటే ఎక్కువ మొత్తం బెట్టింగ్ కాయాలని కోరితే... వారిని కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన లడ్డూ కచువకు పరిచయం చేసి కమీషన్ తీసుకునేవారు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి వీరి దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ నేతృత్వంలో ఎòౖÜ్సలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్.సైదాబాబు దాడులు నిర్వహించి నిందితులు గజానంద్, సందీప్‌లను అరెస్టు చేశారు. పరా>రీలో ఉన్న నిందితులు బుంటి భాయ్, లడ్డూ కోసం గాలిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. -
ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడం మంచిదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన పేరు ప్రకారం భారత్‌లోనే జరగాలని... అయితే లీగ్‌కు ఉన్న ఆదరణ కారణంగా వేరే దేశంలో కూడా నిర్వహిస్తే మంచిదేనని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ భారత్‌కు మాత్రమే చెందినది కాదని, అదిప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తానికి చెందిన ఆస్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. గతంలో రెండు సార్లు విదేశాల్లో లీగ్ సఫలమైన విషయాన్ని గుర్తు చేసిన శాస్త్రి... ఐపీఎల్ కారణంగానే కూడా యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారన్నారు. -
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు
⇒ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బందోబస్తులోనే.. ⇒ ఉగ్రదాడుల నేపథ్యంలోతీవ్ర బందోబస్తు.. వారాంతపు సెలవులూ బంద్ ⇒ మానసిక ఒత్తిడికి గురవుతున్న రక్షక భటులు సాక్షి, ముంబై: ఇండియన్ ప్రెమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ల నగర పోలీసుల మీదకొచ్చి పడింది. క్రికెట్ స్టేడియాల వద్ద మధ్యాహ్నం నుంచి బందోబస్తులో ఉంటున్న పోలీసులు అర్ధరాత్రి దాటాక కూడా ఇళ్లకు వెళ్లలేక పోతున్నారు. ఇప్పటికే ముంబైకి అత్యంత సమస్యాత్మక నగరంగా పేరు ఉంది. ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ఉగ్రవాదుల దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నగరానికి రక్షణ ఇవ్వడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ముంబైలోని వాంఖడే, బ్రబార్న్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే అదనపు పని భారంతో సతమతమవుతున్న పోలీసులు బందోబస్తుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. వేసవి సెలవుల్లో అందరూ ఆనందంగా గడుపుతోంటే, తమకు కనీసం వారంతపు సెలవులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు క్రికెట్ మ్యాచ్ ఉంటే .. 12 గంటల నుంచే బందోబస్తుకు వెళ్లాలి. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఉంటే మధ్యాహ్నం 3 గంటలకే రిపోర్టు చేయాలి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 10 మంది పోలీసులు ఉండాల్సిన చోట 50 మందిని నియమిస్తున్నారు. ఎర్రని ఎండలో బందోబస్తు ఉండే పోలీసుల వెతలు వర్ణనాతీతం. అర్ధరాత్రి మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ప్రేక్షకులందరూ వెళ్లిపోయేదాకా బందోబస్తు ఉండాలి. అనంతరం తమ కార్యాలయాలకు వెళ్లి వారి సీనియర్ అధికారులకు నివేదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలి. ఉదయం యథాతథంగా విధులకు హాజరు కావలి. దీంతో సమయానికి భోజనం, తగినంత నిద్ర, విశ్రాంతి లేక నరకయాతన పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల సెలవులు మంజూరు కావడం లేదు. కొన్ని వారాలపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మూడు నెలల్లో 26 మంది.. పనుల ఒత్తిడి వల్ల జనవరి 1 నుంచి మార్చి 31 వరకు (మూడు నెలల్లో) ముంబై పోలీసు శాఖకు చెందిన సుమారు 26 మంది కానిస్టేబుళ్లు వృుత్యువాత పడ్డారు. సమయానికి భోజనం, విశ్రాంతి లేకపోవడం, రక్తపోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి సమస్యలతో చనిపోయారు. 2014 లోనూ ఇదే పరిస్థితి. పోలీసు ఇన్స్పెక్టర్లు మొదలుకుని కానిస్టేబుల్ స్థాయి వరకు సుమారు 147 మంది దాకా చనిపోయారు. ఇందులో 41 పోలీసులు గుండెపోటుతో మృతి చెందినట్లు రికార్డులున్నాయి. రోజురోజుకు పోలీసుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిం చేందుకు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో వాటిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమలు చేయాలనుకుంటున్నవి జరిగితే పోలీసులపై ఒత్తిడి కొంత మేరకైనా తగ్గే అవకాశాలున్నాయి.