సాక్షి, జైసల్మీర్ : గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు.. బీజేపీనే విజయం సాధించే అవకాశాలున్నాయని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ అనూహ్య ఫలితాల నేపథ్యంలో మెజారిటీ సీట్లపై పందెం రాయుళ్లు ఆచితూచి వ్యహరిస్తున్నట్లు బెట్టింగ్ మార్కట్ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయాలు, ప్రధాని మోదీ పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని. బికనీర్, ఫలోదిలోని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీకీ 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 71 సీట్లు రావచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకీ 192 నుంచి 200 సీట్లు వస్తాయని పందెం రాయుళ్లు భారీగా పందెం కాశారు. అనూహ్య ఎన్నికల ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు భారీగా నష్టపోయారు. గుజరాత్‌లో కూడా విన్నింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని.. అయితే సీట్ల విషయంలో కొంత అనిశ్చితి నెలకొందని బుకీలు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 115 దక్కించుకుంది. కాంగ్రెస్ 68 సీట్లతో ప్రతిపక్షంలో నిలిచింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో ట్రెండ్స్ రోజురోజుకూ మారుతున్నాయని బుకీలె చెబుతున్నారు. బీజేపీ గెలుపుపై సందేహాలున్నా.. మెజారిటీ పందెం రాయుళ్లు మాత్రం కాషాయ పార్టీపైనే బెట్టింగ్ చేస్తున్నారని బుకీలు తెలిపారు. బెట్టింగ్ మార్కెట్‌లో బీజేపీ గెలుపుపై రూ. 50 పైసలు, కాంగ్రెస్‌పై రూ.2 బెట్టింగ్ నడుస్తోందని బుకీలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment