betting market
-
Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్‌కు 55–65 సీట్లు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల పోలింగ్, ప్రచారసరళిని బట్టి తాజా లెక్కల ప్రకారం బీజేపీకి 295 –305 సీట్లు రావొచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కాంగ్రెస్ ఈసారి 55–65 సీట్లు సాధించవచ్చు అని ఆయా వర్గాలు విశ్లేíÙంచాయి. బీజేపీ జనంలోకి బాగా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయతి్నంచిన ‘ఈసారి 400 సీట్లు’ నినాదం పనిచేయకపోవచ్చని బెట్టింగ్ మార్కెట్ ఊహిస్తోంది. బీజేపీకి ఈసారి 400 సీట్లు కష్టమని, అయినాసరే ఈసారి బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. ‘‘ తొలి దశ ఎన్నికల ముందు వరకు బీజేపీ ఎక్కువ చోట్ల గెలుస్తుందన్న అంచనాలుండేవి. బీజేపీ 315–325 వరకు, కాంగ్రెస్ 45–55 వరకు గెలవచ్చు అని తొలుత భావించాం. కానీ మూడు దశలు ముగిశాక చూస్తే బీజేపీ 270–280 వరకు, కాంగ్రెస్ 70–80 వరకు గెలవచ్చు అని అంచనాలొచ్చాయి. ప్రస్తుతం చూస్తే బీజేపీ 295–305 వరకు, కాంగ్రెస్ 55–65 వరకు సీట్లు గెలువొచ్చు’’ అని ముంబైలో ఉండే ఒక కీలకమైన బుకీ బుధవారం చెప్పారు. ‘‘ బీజేపీ 400 కాదుకదా కనీసం 350 గెలుస్తుందని ఏనాడూ బెట్టింగ్‌లో గణాంకాలు రాలేదు. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రూ.8–9 లక్షల కోట్ల మేర బెట్టింగ్ జరుగుతోంది’ మరో బుకీ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో 28 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 64–66 స్థానాలు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. గుజరాత్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు. -
Illegal betting: చట్ట విరుద్ధంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతుండడంతో, మరోవైపు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలు కూడా ఉపందుకుంటున్నాయి. అనధికారిక మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నడుస్తున్నట్టు, ఈ రూపేణా ఏటా రూ.2లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని భారత్ కోల్పోతున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) నివేదిక తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడిచే క్రీడల బెట్టింగ్ మార్కెట్లోకి భారత్ నుంచి ఏటా రూ.8,20,000 కోట్లు వస్తున్నట్టు ఈ ఫోరమ్ అంచనా వేసింది. ప్రస్తుత జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం చూస్తే ఈ మొత్తంపై భారత్ ఏటా రూ.2,29,600 కోట్లు నష్టపోతున్నట్టు తెలిపింది. ఈ తరహా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాల నిరోధానికి నూతన జీఎస్టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ సంస్థల కార్యకలాపాలను గుర్తించేందుకు, అవి భారత్‌లో రిజిస్టర్ చేసుకునేలా చూసేందుకు టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తద్వారా భారత్ నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కోసం నిధులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. లేకుంటే మరింత నష్టం ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు లేకుంటే మరింత ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. నూతన జీఎస్టీ విధానంతో చట్టపరిధిలో పనిచేసే గేమింగ్ మార్కెట్ బదులుగా చట్ట విరుద్ధంగా పనిచేసే ఆఫ్‌షోర్ బెట్టింగ్ కంపెనీలు ఎక్కువ వృద్ధిని చూడనున్నాయని, ఫలితంగా మరింత పన్ను నష్టం ఏర్పడుతుందని వివరించింది. ఐపీఎల్ సమయంలోనూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగడాన్ని ప్రస్తావించింది. మన దేశంలో బెట్టింగ్, గేమింగ్‌పై 14 కోట్ల మంది సాధారణంగా పాల్గొంటూ ఉంటారని, ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లావాదేవీలపై నిషేధం విధించడంతో చట్ట విరుద్ధంగా భారత్ లోపల, భారత్ నుంచి వెలుపలకు నిధులు తరలింపు కోసం రహస్య పద్ధతులను అనుసరించేందుకు దారితీస్తున్నట్టు వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీలు, అక్రమ చానళ్లు నిధుల తరలింపునకు వీలు కలి్పస్తూ.. భారత్ దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నట్టు పేర్కొంది. ఇలా అక్రమంగా తరలించే నిధులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, జాతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు వనరులుగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లు భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది. -
T20 World Cup 2021 Ind vs Pak: పాక్‌పై రూ. వెయ్యికి రూ.4 వేలు బెట్టింగ్!
T20 World Cup 2021 Ind vs Pak Match Today: టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆదివారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. మరి... దాయాదుల పోరు అంటేనే భావోద్వేగాలు పెల్లుబికే సమయం కదా. అందుకే ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రెడీ అయిపోయారు. ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ నిర్వహణకు తెరతీశారు. ఇందులో భాగంగా... ఫస్ట్‌బాల్ నుంచి లాస్ట్బాల్ వరకు బెట్టింగ్‌లకు ప్లాన్ చేశారని సమాచారం. ఎవరు ఎంత కొడతారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అనేదానిపై కూడా రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, యువ సంచలనం రిషభ్ పంత్‌పైనే ఎక్కువ బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్, బయట మార్కెట్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న తీరు ►ఆన్లైన్ మార్కెట్లో పాక్‌పై రూ. వెయ్యికి రూ. 1600 ►బయట మార్కెట్లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 2 వేలు ►ఆన్లైన్ మార్కెట్లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 530 ►బయట మార్కెట్లో పాక్‌పై రూ. వెయ్యికి రూ.4 వేలు చదవండి: Babar Azam: మా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్‌తో మాట్లాడాము -
గుజరాత్.. బీజేపీదే!
సాక్షి, జైసల్మీర్ : గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు.. బీజేపీనే విజయం సాధించే అవకాశాలున్నాయని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ అనూహ్య ఫలితాల నేపథ్యంలో మెజారిటీ సీట్లపై పందెం రాయుళ్లు ఆచితూచి వ్యహరిస్తున్నట్లు బెట్టింగ్ మార్కట్ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయాలు, ప్రధాని మోదీ పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని. బికనీర్, ఫలోదిలోని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకీ 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 71 సీట్లు రావచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకీ 192 నుంచి 200 సీట్లు వస్తాయని పందెం రాయుళ్లు భారీగా పందెం కాశారు. అనూహ్య ఎన్నికల ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు భారీగా నష్టపోయారు. గుజరాత్లో కూడా విన్నింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని.. అయితే సీట్ల విషయంలో కొంత అనిశ్చితి నెలకొందని బుకీలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 115 దక్కించుకుంది. కాంగ్రెస్ 68 సీట్లతో ప్రతిపక్షంలో నిలిచింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో ట్రెండ్స్ రోజురోజుకూ మారుతున్నాయని బుకీలె చెబుతున్నారు. బీజేపీ గెలుపుపై సందేహాలున్నా.. మెజారిటీ పందెం రాయుళ్లు మాత్రం కాషాయ పార్టీపైనే బెట్టింగ్ చేస్తున్నారని బుకీలు తెలిపారు. బెట్టింగ్ మార్కెట్లో బీజేపీ గెలుపుపై రూ. 50 పైసలు, కాంగ్రెస్‌పై రూ.2 బెట్టింగ్ నడుస్తోందని బుకీలు తెలిపారు. -
యూపీ ఫలితాలపై జోరందుకున్న బెట్టింగ్‌లు
లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ పోరాడుతుండగా.. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, బీఎస్పీ.. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ బరిలో దిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. యూపీలో విజయం ఎవరిది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తారా అనేదానిపై సర్వేల్లో స్పష్టత రావడం లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జోరందుకున్నా.. ఎవరు గెలుస్తారనే విషయంలో బుకీలు కూడా గందరగోళంలో పడ్డారు. యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసింది. మొదటి రెండు దశల ఎన్నికల వరకు ఎస్పీ గెలుస్తుందని జోరుగా పందేలు కాశారు. ఆ తర్వాత బెట్టింగ్ రాయుళ్లు బీజేపీ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారు. ప్రస్తుతం ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హాంగ్ వస్తుందని భావించిన బుకీలు.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం చూసి మనసు మార్చుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పందేలు కాయడానికి వెనుకంజ వేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో.. సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాయని బుకీలు భావిస్తున్నారు. 403 స్థానాలకు గాను బీజేపీ 161, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 150, బీఎస్పీ 72 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. పందేలు కూడా ఇదే లెక్కన కాస్తున్నారు.