బెట్టింగ్ మార్కెట్ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల పోలింగ్, ప్రచారసరళిని బట్టి తాజా లెక్కల ప్రకారం బీజేపీకి 295 –305 సీట్లు రావొచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కాంగ్రెస్ ఈసారి 55–65 సీట్లు సాధించవచ్చు అని ఆయా వర్గాలు విశ్లేíÙంచాయి.
బీజేపీ జనంలోకి బాగా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయతి్నంచిన ‘ఈసారి 400 సీట్లు’ నినాదం పనిచేయకపోవచ్చని బెట్టింగ్ మార్కెట్ ఊహిస్తోంది. బీజేపీకి ఈసారి 400 సీట్లు కష్టమని, అయినాసరే ఈసారి బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. ‘‘ తొలి దశ ఎన్నికల ముందు వరకు బీజేపీ ఎక్కువ చోట్ల గెలుస్తుందన్న అంచనాలుండేవి.
బీజేపీ 315–325 వరకు, కాంగ్రెస్ 45–55 వరకు గెలవచ్చు అని తొలుత భావించాం. కానీ మూడు దశలు ముగిశాక చూస్తే బీజేపీ 270–280 వరకు, కాంగ్రెస్ 70–80 వరకు గెలవచ్చు అని అంచనాలొచ్చాయి. ప్రస్తుతం చూస్తే బీజేపీ 295–305 వరకు, కాంగ్రెస్ 55–65 వరకు సీట్లు గెలువొచ్చు’’ అని ముంబైలో ఉండే ఒక కీలకమైన బుకీ బుధవారం చెప్పారు.
‘‘ బీజేపీ 400 కాదుకదా కనీసం 350 గెలుస్తుందని ఏనాడూ బెట్టింగ్‌లో గణాంకాలు రాలేదు. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రూ.8–9 లక్షల కోట్ల మేర బెట్టింగ్ జరుగుతోంది’ మరో బుకీ వెల్లడించారు. ఎన్‌డీఏ కూటమి మహారాష్ట్రలో 28 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 64–66 స్థానాలు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. గుజరాత్‌లో బీజేపీ క్వీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment