bookies
-
క్లీనర్ సహాయంతో ఫిక్సింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్‌లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు అనుమానించారు. స్టేడియంలో ఒక మూలన అతడిని చూసి పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అదే నంబర్‌కు మళ్లీ డయల్ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతడిని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరో కేసు విచారణ సందర్భంగా ఐపీఎల్ దొంగ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై çపూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్ హుస్సేన్ చెప్పారు. -
ఖాకీలకు చిక్కని బుకీలు
సాక్షి, ఒంగోలు: సప్త వ్యసనాల్లో లేని కొత్త వ్యసనం ఒకటి దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంత యువతను పెడదోవ పట్టిస్తూ పీల్చిపిప్పి చేస్తోంది. ఆ వ్యసనం పేరే క్రికెట్ బెట్టింగ్. గత 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ బెట్టింగ్ వ్యసనం మొదట్లో ఇండియా జట్టు ఆడే మ్యాచ్‌లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ఆడేది వన్డే, టెస్ట్‌మ్యాచ్ అనే బేధం లేకుండా, ఆడేది మన జట్టా, విదేశీ జట్లా అనేది చూసుకోకుండా బెట్టింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. టి–20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం బాగా ఊపందుకుంది. దీనికితోడు ఐపీఎల్ అంటూ ఒక సీజన్లో వరుసగా 90 నుంచి 100 మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్ జాఢ్యం మరింత ముదిరి పాకాన పడినట్లయింది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే బుకీలు ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఏజంట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ వ్యసనాన్ని దేశవ్యాప్తం చేశారు. విచారణలో జాప్యం.. అజ్ఞాతంలోకి కీలక బుకీలు.. ఒంగోలు నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సుమారు 15 రోజుల క్రితం పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో రెండు విభాగాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. అయితే పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల విచారణ ముందుకు సాగలేదు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. విచారణలో జరిగిన జాప్యం వల్ల కీలక బుకీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బెట్టింగ్ ముఠా దొరగ్గానే వారి నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ఉంటే కీలక బుకీలు దొరికే అవకాశం ఉండేది. ఇప్పటికైనా పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీలను పట్టి అత్యాశతో జీవితాలు కోల్పోతున్న యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు. కీలక బుకీలను పట్టలేక పోతున్నారు... ఎక్కడెక్కడో ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు సైతం తమ బెట్టింగ్‌ను విస్తరించి కోట్లు గడిస్తున్న బుకీలను పోలీసు వ్యవస్థ ఏమి చేయలేకపోవడం శోచనీయం. ఆన్లైన్ ద్వారా అనేక మంది ఏజంట్లను పెట్టుకొని దేశవ్యాప్తంగా తమ బెట్టింగ్ దందాను నడుపుతున్న బుకీలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు బుకీల నుంచి మామూళ్లు తీసుకుంటూ బెట్టింగ్‌లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే బుకీల మూలాలను కనిపెట్టి ఆటకట్టించాల్సిన పోలీసులు లాడ్జిలు, హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లలో చిన్న చిన్న బెట్టింగ్‌లు నిర్వహించే యువకులను అదుపులోకి తీసుకొని వారిపై తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్ నిర్వహించే ఏజంట్లను అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారు ఎవరి వద్ద నుంచి లైన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారో కనుగొని తద్వారా తీగలాగుతూ డొంకను కదిలించాల్సిన పోలీసు అధికారులు మాకేం పట్టిందిలే అనుకుంటూ దొరికిన వారిపై చోటా మోటా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పోలీసు, ఇంటిలిజెన్స్ రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించి బెట్టింగ్ మహమ్మారిని కూకటి వేళ్ళతో పెకిలించకపోతే ఎందరో యువకులు బలి కావడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలకూ పాకిన జాఢ్యం.. మొదట్లో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో, ఈ వ్యసనానికి బానిసలైన యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే బుకీల వద్ద నుంచి వారి ఏజంట్లు, క్రికెట్ బెట్టింగ్లాడే యువత వరకు వీరందరిలో క్రికెట్ అంటే తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. క్రికెట్ బెట్టింగ్‌లు ఆడేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా ప్రైవేట్ కంపెనీలు, చిన్నచిన్న షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తున్న యువకులు, విద్యార్థులు, చివరకు పొలం పనులు చేసుకునే యువ రైతులు సైతం ఈ బెట్టింగ్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నుంచి క్రికెట్ బుకీలు ఆన్లైన్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతను ఆకర్షిస్తూ బెట్టింగ్ మహమ్మారిని విస్తరిస్తున్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారికి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు బెట్టింగ్‌ల్లో సర్వం కోల్పొయి ఉన్న అప్పులు చెల్లించలేక ఊరు వదిలి పరారై అజ్ఞాతంలో జీవనం సాగిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
‘సట్టా’ చాటేదెవరు.. బీజేపీకి బుకీల జై!
హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ సట్టా (బెట్టింగ్)పై రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి. రాజస్తాన్.. కాంగ్రెస్‌కే చాన్స్! ‘రాజస్తాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ వెంటనే మళ్లీ అధికారంలోకి రావడం గత 25 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరగలేదు. ఈ సారి కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వసుంధర రాజే కరిజ్మా తగ్గినట్లు కనిపిస్తోంది’ అని ఢిల్లీలో పేరుగాంచిన బుకీ ఒకరు చెప్పారు. రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకే పరిమితం కావచ్చని సట్టా మార్కెట్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 105 స్థానాలు వస్తాయని, మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుస్తారని చెబుతోంది. ఇందుకు తగ్గట్లే బెట్స్ జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా? ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మధ్యప్రదేశ్‌పై బెట్టింగ్ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. ఇరు పక్షాల మధ్య చాలా స్వల్ప వ్యత్యాసంతో పందేలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇరు పార్టీల సీట్ల విషయంలో తేడా స్వల్పంగా ఉంటుందని బుకీలు అంచనా వేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీదే హవా! ఎన్నికలు పూర్తయిన చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి మెజార్టీ వస్తుందని బుకీ ట్రెండ్ చెబుతోంది. బుకీల అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో వచ్చేనెల 11న తెలిసిపోతుంది. -
క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారు!
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను ఫిక్సింగ్ భూతం వదిలేటట్లు కనబడుటం లేదు. ఇప్పటికే పలువురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా నిషేధాని గురవ్వగా, తాజాగా పీఎస్ఎల్లో మరొకసారి ఫిక్సింగ్ కలకలం రేగింది. దుబాయ్‌లో జరుగుతున్న పీఎస్ఎల్ క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారనే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.' 'కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా బుకీలు ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆటగాళ్ల నుంచి వారికి ఎలాంటి స్పందన దక్కలేదు. ఈ సమస్యను ఇప్పటికే ఆటగాళ్లు మా దృష్టికి తీసుకువచ్చారు. అప్రమత్తమైన మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం' అని సదరు ప్రతినిధి తెలిపారు.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకల చెలరేగడం ఇది తొలిసారి కాదు. గత సీజన్లో లతీఫ్, షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఐదేళ్ల నిషేధం పడగా, నాసీర్ జంషెడ్‌పై ఏడాది నిషేధం విధించారు. -
గుజరాత్.. బీజేపీదే!
సాక్షి, జైసల్మీర్ : గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు.. బీజేపీనే విజయం సాధించే అవకాశాలున్నాయని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ అనూహ్య ఫలితాల నేపథ్యంలో మెజారిటీ సీట్లపై పందెం రాయుళ్లు ఆచితూచి వ్యహరిస్తున్నట్లు బెట్టింగ్ మార్కట్ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయాలు, ప్రధాని మోదీ పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని. బికనీర్, ఫలోదిలోని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకీ 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 71 సీట్లు రావచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకీ 192 నుంచి 200 సీట్లు వస్తాయని పందెం రాయుళ్లు భారీగా పందెం కాశారు. అనూహ్య ఎన్నికల ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు భారీగా నష్టపోయారు. గుజరాత్లో కూడా విన్నింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని.. అయితే సీట్ల విషయంలో కొంత అనిశ్చితి నెలకొందని బుకీలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 115 దక్కించుకుంది. కాంగ్రెస్ 68 సీట్లతో ప్రతిపక్షంలో నిలిచింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో ట్రెండ్స్ రోజురోజుకూ మారుతున్నాయని బుకీలె చెబుతున్నారు. బీజేపీ గెలుపుపై సందేహాలున్నా.. మెజారిటీ పందెం రాయుళ్లు మాత్రం కాషాయ పార్టీపైనే బెట్టింగ్ చేస్తున్నారని బుకీలు తెలిపారు. బెట్టింగ్ మార్కెట్లో బీజేపీ గెలుపుపై రూ. 50 పైసలు, కాంగ్రెస్‌పై రూ.2 బెట్టింగ్ నడుస్తోందని బుకీలు తెలిపారు. -
టీడీపీలో బుకీల కలకలం
- క్రికెట్ బుకీలతో కొందరు టీడీపీ నేతలకు సత్సంబంధాలు - పోలీసులకు పట్టుబడ్డ కీలక బుకీ బాలాజీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి బంధువు - ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షి, గుంటూరు: జిల్లాలోని అధికార పార్టీలో క్రికెట్ బుకీల కలకలం రేగింది. ఇటీవల గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు కీలక క్రికెట్ బుకీతోపాటు, క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కీలక బుకీ అయిన మాదినేని బాలాజీ రాజధాని ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేకు వరసకు బావమరిది కావడంతో పాటు మరో బుకీ అయిన బి.చిరంజీవి సదరు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు కావడంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు తెచ్చారు. అయితే క్రికెట్ బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకుని తనకు లక్షల్లో బాకీ పడ్డ వారి నుంచి సదరు క్రికెట్ బుకీ సుమారు పది ఎకరాలకు పైగా భూమి, 50 సెంట్ల ఇళ్ళ స్థలాలు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేను ఆశ్రయించడం, ఆయన సూచనతోనే బాధితులంతా అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలను కలిసి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో అర్బన్ ఎస్పీ విజయరావు.. ఇద్దరు డీఎస్పీలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం ఐదు రోజుల క్రితం కీలక బుకీ బాలాజీతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి క్రికెట్ బెట్టింగ్‌లకు వినియోగించే సెల్‌ఫోన్, బ్యాగులు, ల్యాబ్టాప్లు, నగదు వంటివి స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళు పెరిగిపోవడంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇంకా వీరి నుంచి కీలక సమాచారం రాబట్టడంతోపాటు, పరారీలో ఉన్న మరికొంత మంది కీలక బుకీలను అదుపులోకి తీసుకుంటే క్రికెట్ బెట్టింగ్ మూలాన్ని పట్టే అవకాశం ఉంటుంది. అజ్ఞాతంలోకి పలువురు బుకీలు.. ఇదిలా ఉంటే క్రికెట్ బెట్టింగ్ ముఠా పోలీసులు అదుపులో ఉన్నారని తెలుసుకున్న జిల్లాలోని అనేక మంది కీలక బుకీలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అధికార పార్టీలోని తమ గాడ్ఫాదర్ల వద్దకు వెళ్లి వారి స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా గుంటూరు నగరంలోని ఓ కీలక బుకీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత వద్దకు వెళ్ళగా, మరో క్రికెట్ బుకీ పల్నాడు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వద్దకు, మరికొందరు ఓ మంత్రి వద్దకు వెళ్ళి పోలీసులు తమ జోలికి రాకుండా ఆశ్రయం కోరినట్లు తెలిసింది. పోలీసులు తమను అరెస్టు చేయకుండా కాపాడితే భారీ మొత్తంలో ముట్టజెబుతామని ఆఫర్లు ఇచ్చినట్లు కూడా సమాచారం. గతంలోనూ పోలీసులు బుకీలను అదుపులోకి తీసుకున్న ప్రతి సందర్భంలో కొందరు అధికార పార్టీ నేతలు కలుగజేసుకుని ఒత్తిడి తీసుకురావడం అందరికి తెలిసిందే. దీంతో కీలక బుకీలను పోలీసులు విచారిస్తే అధికార పార్టీ నేతల మూలాలు సైతం బయటకు వస్తాయనేది బహిరంగ రహస్యమే. అయితే అధికార పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు మాత్రం బెట్టింగ్ బుకీలపై కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో బెట్టింగ్ రాజకీయం వేడెక్కింది. బుకీల అరెస్టులు.. బుకీలను అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సదరు బుకీలు గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పెదకూరపాడు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన వారు కావడంతో తమ వద్ద బలవంతంగా లాక్కొన్న భూములను తిరిగి ఇప్పించాలంటూ రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడుకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలోని క్రికెట్ బుకీలపై ఇప్పటికే పూర్తి స్థాయి నిఘా ఉంచామంటున్న రూరల్ ఎస్పీ క్రికెట్ బుకీల ఆట కట్టిస్తామని చెబుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి జిల్లాలోని అనే కుటుంబాలు రోడ్డున పడడంతోపాటు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బెట్టింగ్ మాఫియాపై సీరియస్‌గా దృష్టి సారించి పార్టీలకు అతీతంగా ఎంతటివారు ఇందులో ఉన్నా కఠినంగా వ్యవహరిస్తేనే దీన్ని రూపుమాపే అవకాశం ఉంటుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీలో బుకీల తుపాన్
- డీఎస్పీలు, సీఐలు మాట వినడం లేదని మంత్రికి ఫిర్యాదు - ఇసుక నుంచి మద్యం వరకు కట్టడి చేస్తే ఎలాగని ఆవేదన - వాడీవేడిగా జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం - మంత్రులు అమర్నాథ్రెడ్డి, నారాయణ హాజరు - మంత్రి సోమిరెడ్డి, ఆనం బ్రదర్స్ గైర్హాజరు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో క్రికెట్ బెట్టింగ్, ఇతర అక్రమ వ్యవహారాలపై తుపాన్ రేగింది. జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలు, నియోజకవర్గాల్లో సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. సీఐలు, డీఎస్పీలు తమ మాట వినడం లేదని, ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు విప్పటం వల్ల ఇబ్బంది కలుగుతోందని, ఇసుక నుంచి మద్యం వరకు అన్ని అక్రమ వ్యవహారాలను కట్టడి చేస్తున్నారంటూ గళమెత్తారు. జిల్లాలో పోలీసులు ముక్కుసూటిగా పనిచేయడం వల్ల తెలుగు తమ్ముళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బ పడుతోందని వాపోయారు. పార్టీ వ్యవహారాల కంటే ముందు ఈ విషయం తేల్చాలంటూ మంత్రుల ఎదుట పంచాయితీ పెట్టారు. ‘కనీసం సీఐ కూడా మాట వినకపోతే ఎమ్మెల్యేలుగా ఏం పని చేయాలో మీరే చెప్పండి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యల చిట్టాను విప్పారు. ‘చూసీచూడనట్టు వెళ్లమనండి’ నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నా«థ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హాజరుకాగా.. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం బ్రదర్స్ డుమ్మా కొట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు పాశం సునిల్‌కుమార్, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సమస్యలు ఏకరువు పెట్టారు. కొత్త ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టాక ఇసుక, మద్యం అక్రమ అమ్మకాలను పూర్తిగా కట్టడి చేశారని, క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను వారం క్రితం అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు తమకు ఇబ్బందిగా మారాయని వాపోయారు. ముఖ్యంగా ఇసుక ఆక్రమ రవాణాను కట్టడి చేశారని.. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. ‘మనవాళ్లను చూసీచూడనట్టు వదలేయమని అడుగుతున్నా పోలీస్ అధికారులెవరూ మాట వినటం లేదు’ అని ఫిర్యాదు చేశారు. గూడూరు ఎమ్మెల్యే సునిల్‌కుమార్ ఇసుక అక్రమ రవాణా అంశాన్ని లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో పేదలకు కూడా ఇసుక దొరకటం లేదని, వరుస కేసులు నమోదు చేస్తే అందరికీ కష్టమవుతుందని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కన్నబాబు మాట్లాడుతూ మద్యం షాపులపైనా పోలీసులు విరుచుకుపడుతున్నారని.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే వారితోపాటు లైసెన్స్‌దారులపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల టీడీపీ నేతల ఆర్థిక మూలాలకు దెబ్బ తగులుతోందని వాపోయారు. కనీసం ఎస్సై అయినా తమ వినకపోతే అధికార పార్టీ నేతలుగా ఏం చేయగలుగుతామని కొందరు ప్రశ్నించారు. మంత్రులతో కలెక్టర్, ఎస్పీ, జేసీ భేటీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు అమర్నాథ్రెడ్డి, పి.నారాయణతో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, జేసీ ఇంతియాజ్ అహ్మద్ భేటీ అయ్యారు. ఇదే సందర్భంలో పలువురు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు బెట్టింగ్ రాకెట్ కట్టడి విషయంలో జిల్లా ఎస్పీని అభినందించినట్టు సమాచారం. ఇసుక వ్యవహారంపై మాట్లాడగా.. దీనిపై శనివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
యూపీ ఫలితాలపై జోరందుకున్న బెట్టింగ్‌లు
లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ పోరాడుతుండగా.. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, బీఎస్పీ.. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ బరిలో దిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. యూపీలో విజయం ఎవరిది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తారా అనేదానిపై సర్వేల్లో స్పష్టత రావడం లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జోరందుకున్నా.. ఎవరు గెలుస్తారనే విషయంలో బుకీలు కూడా గందరగోళంలో పడ్డారు. యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసింది. మొదటి రెండు దశల ఎన్నికల వరకు ఎస్పీ గెలుస్తుందని జోరుగా పందేలు కాశారు. ఆ తర్వాత బెట్టింగ్ రాయుళ్లు బీజేపీ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారు. ప్రస్తుతం ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హాంగ్ వస్తుందని భావించిన బుకీలు.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం చూసి మనసు మార్చుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పందేలు కాయడానికి వెనుకంజ వేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో.. సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాయని బుకీలు భావిస్తున్నారు. 403 స్థానాలకు గాను బీజేపీ 161, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 150, బీఎస్పీ 72 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. పందేలు కూడా ఇదే లెక్కన కాస్తున్నారు. -
16 మంది క్రికెట్ బుకీలు అరెస్టు
లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం పెద్ద సంఖ్యలో క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇండియా -బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి 16 మంది క్రికెట్ బుకీలను స్థానిక స్టేట్ బ్యాంకు సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42 వేల నగదుతో పాటు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 8 సెల్ ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించామని పులివెందుల ఏఎస్పీ అంబురాజన్ తెలిపారు. -
బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...
చిత్తూరు జిల్లాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్.. రోజుకు రూ.10 కోట్ల వరకు అమాయకుల జేబులు ఖాళీ జిల్లాలో మొత్తం 25 మంది బుకీలు? నియంత్రించలేకపోతున్న పోలీసులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై జిల్లాలో బెట్టింగుల పర్వం జోరుగా సాగుతోంది. లీగ్ ప్లేఆఫ్ దశకు చేరడంతో ముఖ్యమైన టీంలపై లక్షల్లో బెట్లు కట్టేందుకు కూడా యువకులు వెనకాడడం లేదు. రెట్టింపు స్థాయిలో డబ్బు ఎర చూపి బుకీలు అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 25 మంది బుకీలు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిష్టవేసి కోట్ల రూపాయలు హాంఫట్ చేస్తున్నట్లు సమాచారం. చిత్తూరు: ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ పలువురు నిమిషాల్లో వేలు సంపాదిస్తుంటే.. మరికొంద రు బికారులుగా మారుతున్నారు. జిల్లావ్యాప్తంగా కోట్లలో బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం ఉన్నా.. తగినంత మంది సిబ్బంది లేక బెట్టింగును వారు నియంత్రించలేకపోతున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి బెట్టింగ్ రాయుళ్లు తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, పుత్తూరు, పుంగనూరులకు వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ చేసే విషయం, ఆ ముఠా తీసుకునే జాగ్రత్తలు తెలుసుకుంటే ఎవరైనా విస్మయానికి గురికావాల్సిందే. అమాయకులే టార్గెట్.. క్రికెట్ బెట్టింగ్ ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని బుకీలు అమాయకులకు వల వేస్తున్నారు. కొందరు యు వకులు ఈ రొంపిలో దిగి వదులుకోలేకపోతున్నారు. దీంతో బెట్టింగ్ ముఠా జేబులు నిండుతున్నాయి. అమాయకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే రెండు పార్టీల నుంచి బుకీలు కమీషన్ తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సుమారు 25 మంది బుకీలు పని చేస్తున్నట్లు సమాచారం. వీరు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఈ తంతును నడిపిస్తున్నారని తెలుస్తోంది. వీరందరూ తమకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ చేయాలనుకునే వారి నుంచి ముందస్తు రుసుం వసూలు చేసి సభ్యత్వం కల్పిస్తున్నారు. ఒక కంప్యూటర్, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు అందుబాటులో ఉంచుకొని జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏవిధంగా బెట్టింగ్ కట్టాలనుకుంటున్నారో సభ్యులు చెబితే వారు అదే విధంగా బెట్టింగ్ కట్టాలనుకునే వారితో ఒప్పందం కుదురుస్తారు. వీటిని ఎక్కడా రికార్డు చేయరు. కేవలం కోడ్ బాషను మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాచ్ ఓడిన వారి నుంచి మరుసటి రోజు డబ్బులు వసూలు చేసి కమీషన్ పట్టుకొని మిగతా సొమ్మును పక్కాగా గెలిచిన వారికి అందిస్తున్నారు. అద్దె ఇళ్లు, టైలరింగ్ షాపులు.. బెట్టింగ్ నిర్వహించాలంటే కచ్చితంగా కంట్రోల్ రూం ఉండాల్సిందే. ఒకప్పుడు వీరు పెద్దపెద్ద హోటళ్లలో కార్యకలాపాలు చేస్తుండే వారు. వీరి గుట్టు అందరికీ తెలియడంతో చిన్నచిన్న అద్దె గృహాలు, మొబైల్ వాహనాలు, టైలరింగ్ షాపుల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే హైఫై ముఠా మొబైల్ వాహనాల్లో కథ నడిపిస్తున్నారు. సుమో, స్కార్పియో లాంటి వాహనాలకు డీ2హెచ్‌లను అమర్చుకొని డీల్స్ ఓకే చేస్తున్నారు. ఈ వాహనం ఒకే చోట కాకుండా జిల్లా మొత్తం తిరుగుతుంది. బెట్టింగ్ విషయాలు బయటికి పొక్కకుండా కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడతారు. మెసేజ్‌లు పెడతారు. తమ సభ్యుల్లో ఎవరిపైనైనా అనుమానం వారితో వెంటనే కార్యకలాపాలు ఆపేస్తారు. ఫోన్ నంబర్ మార్చి మిగతా సభ్యులకు కొత్త నంబర్ తెలియజేస్తారు. ఎవరూ నోరు మెదపడం లేదు.. సాధారణంగా జూదంలో ఓడిపోయిన వాడే పోలీసులకు సమాచారం ఇస్తాడు. దీని ద్వారా పోలీసులు చర్య లు తీసుకుంటారు. అయితే బెట్టింగ్ విషయంలో ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. బెట్ ఏంటన్నది బుకీలే బయటపెడతారు. బుకీలు ఎక్కడి నుంచి వ్యవహారం నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. వ్యవహారం మొత్తం రహస్యం. దీన్ని ఎవరూ దాటడానికి వీల్లేదు. దాటితే వారికపై కఠిన చర్యలు ఉంటాయి. చంపడానికైనా వెనకాడరు. ఒక వేళ ఓడిపోయిన వ్యక్తి బెట్టింగ్ మొత్తం చెల్లించకపోతే...మరోసారి బెట్టింగ్ చేయడానికి అతడు అనర్హుడు. ఇంకో బెట్టింగ్ ముఠా కూడా అతనిన బెట్టింగ్‌కు సభ్యత్వం ఇవ్వదు. దీనికోసం వారు సరికొత్త సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నారు. కొత్తవారు సభ్యులుగా చేరాలంటే పాత సభ్యుడి సిఫారసు ఉండాల్సిందే. ప్రొటోకాల్ పాటించడానికే.. ప్రొటోకాల్ పాటించడానికే సమయం మొత్తం సరిపోతోందని.. మరి ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టడానికి టైమ్‌లేదని పోలీసులు వాపోతున్నారు. జిల్లా మొత్తం దాదాపు 3600 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా జనాభా 40 లక్షలు పైనే. ఈ లెక్కన ప్రతి 1111 మందికి ఒక పోలీసు ఉంటారు. జనాభా పెరుగుతున్నా పోలీసు నియామకాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనికి తోడు ఉన్న వారిపై పనిభారం పెరుగుతుండటంతో నేరాల కట్టడి అంతంత మాత్రంగానే ఉంది. -
మోతీనగర్‌లో ఐదుగురు బుకీలు అరెస్ట్
హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లతోపాటు రూ.5.30 లక్షల నగదు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భయపడుతున్న పాక్ క్రికెటర్
కోల్‌కతా : పాక్ పేసర్ మహమ్మద్ ఆమిర్ కోల్‌కతాలో దిగాక లోకల్ సిమ్ కార్డు తీసుకోవాలంటేనే భయపడుతున్నాడట. ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ 2010 నుంచి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న ఈ క్రికెటర్ ఇటీవలే తిరిగి జట్టులో స్థానం పొందాడు. ఈ క్రమంలో నిషేధం అతడిని పీడకలగా వెంటాడుతోంది. కోల్‌కతాకు చేరుకోగానే అధికారులు జట్టు సభ్యులందరికీ లోకల్ సిమ్ కార్డులను అందజేయగా ఆమిర్ మాత్రం సిమ్ కార్డును తిరస్కరించాడు. మ్యాచ్ ఫిక్సర్లు, బుకీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెబుతున్నాడు. కాల్ మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ సహచర జట్టు సభ్యుల వద్ద ఫోన్ తీసుకుంటున్నాడట. అంతేకాదు పాకిస్తాన్ గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నాడట. ఖాళీ సమయాల్లో వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడని నిర్వహణ అధికారుల్లో ఒకరు తెలిపారు. అయితే జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ లేనప్పుడు ఆమిర్ పాడే 'ఆతీఫ్ అస్లామ్' పాటలకు ఫిదా అయిపోయారు. కాగా శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
నలుగురు క్రికెట్ బుకీల అరెస్టు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పోలీసులు గురువారం నలుగురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. స్థానిక శివాలయం వీధిలో బుధవారం జరిగిన బంగ్లాదేశ్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్ లు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే బీటెక్ స్టూడెంట్తోపాటు జింకా చంద్రశేఖర్, లక్ష్మీనరసయ్య, వెంకటరమణ అనే వారు ఉన్నారు. వారి నుంచి రూ. 2.20 లక్షల నగదుతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సైలు మంజునాథరెడ్డి, ఆంజనేయులు తెలిపారు. -
నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
వైఎస్సార్ జిల్లా : మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను మంగళవారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.35లక్షల నగదుతోపాటు బెట్టింగ్ స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. గద్వాల్‌కు చెందిన బొగ్గు శివ, శ్రీధర్, శ్రీనివాసులు ప్రొద్దుటూరుకు వచ్చి తరచూ బెట్టింగ్ నిర్వహించేవారు. మంగళవారం క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. -
హిట్ వికెట్
క్రికెట్ బెట్టింగ్తో వీధిన పడుతున్న పలు కుటుంబాలు ఇప్పటికే భారీగా నష్టపోయిన యువకులు స్టార్ హోటళ్లు కేంద్రాలుగా సాగుతున్న వైనం మామూళ్ల మత్తులో పోలీసులు క్రికెట్, జీవితం ఇంచుమించూ ఒకటే. ఊరించే బౌన్సర్లూ ఉంటాయి. తికమక పెట్టే గుగ్లీలూ ఉంటాయి. ఏమరుపాటుగా ఉంటే హిట్ వికెట్ తప్పదు. వైకుంఠపాళిలో ఉన్నట్లు క్రికెట్లో బెట్టింగ్ పాము పొంచి ఉంటుంది. కుటుంబాన్ని వీధికి లాగి విషం చిమ్ముతుంది. తేలిగ్గా వచ్చే డబ్బు కోసం అత్యాశకు పోతే నెట్ ప్రాక్టీస్ లేని బ్యాట్స్‌మన్‌లా జీవితంలో డకౌట్ కాక తప్పదు. తిరుపతి: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. బెట్టింగ్ మత్తులో పడి కొందరు తెల్లారేసరికే బికారులుగా మారుతున్నారు. ఇప్పటికే భారత్‌తో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు పెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. బుకీలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కప్ గెలిచే దేశంపైన భారీ బెట్టింగ్‌లకు యువతను పురిగొల్పుతూ బుకీలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు సైతం మాముళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నారాయణ.. (పేరు మార్చాం). తన దగ్గరున్న డబ్బుతోపాటు, రూ.25 లక్షలు అప్పు తీసుకుని ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుస్తోందని బెట్టింగ్ పెట్టారు. రూ.30 వేలకు లక్ష రూపాయలుగా ఆన్లైన్లో బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. రూ.25 లక్షలు పోయాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక అతను కనీసం సొంత ఊరికికూడా పోలేక ముఖం చాటేస్తూ కుమిలిపోతున్నారు’. ‘రమాకాంత్..(పేరుమార్చాం) తాను కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని, పెట్టుబడి కావాలని తల్లిదండ్రుల చేత బలవంతంగా పొలం అమ్మించడంతో పాటు ఉన్న కొద్దోగొప్పో బంగారును సైతం తాకట్టు పెట్టించి దాదాపు రూ.10 లక్షలు జమ చేసుకున్నారు. ఇండియాతో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై ఇండియా ఓడిపోతుందని పందెం కాశాడు. రెండు మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. డబ్బులన్నీ పోయాయి. కుటుంబం వీధిన పడింది. ఇప్పుడు అతనికి దిక్కు తోచడం లేదు.’ ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఈ మహమ్మారి మత్తులో చిక్కుకుని విలవిలాడుతున్నారు. ఈ వ్యసనానికి అమ్మాయిలు సైతం బానిసలు కావడంతోపాటు, కమీషన్ ఏజెంట్లుగా అవతారం ఎత్తడం విశేషం. నగరంలో దందా ఇలా... తిరుపతి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ లాడ్జిలో ఈ వ్యవహారం సాగుతోంది. ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని ఇంకొక లాడ్జిలో.. ఇలా నగరంలో ప్రముఖ హోటళ్లలో బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ వ్యవహారం అంతా ఆన్లైన్లో జరగడం గమనార్హం. ఏజెంట్లు, బుకీలు అంతా సెల్‌ఫోన్ ద్వారానే వ్యవహారాన్ని నడుపుతున్నారు. పోలీసులు కొద్దిపాటి నిఘా పెడితే ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసే అవకాశం ఉంది. బెట్టింగ్‌లు ఇలా... జిల్లాలో ఎక్కువ మంది ఇండియా ఓడిపోతుందని పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు గెలుపొందుతాయని బెట్టింగ్ కాసి నిండా మునిగారు. పోయిన సొమ్మును సంపాదించాలని ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి పందేలు కాసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు నగరంలో తాజాగా కప్ గెలిచే దేశంపైనే బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్ట్రేలియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.20 వేలు, దక్షిణాఫ్రికా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.30 వేలు, ఇండియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.50 వేలు బెట్టింగ్ జరుగుతున్నట్లు వినికిడి. పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌ను కట్టడి చేయాలని నగర వాసులు, బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
హైటెక్ బెట్టింగ్
క్రికెట్ పై జోరుగా పందేలు అడ్డంగా దోచేస్తున్న బుకీలు చేతులు మారుతున్న కోట్లు టాస్పైనా సాగుతున్న బెట్టింగ్ జిల్లా వాసులకు క్రికెట్ వరల్డ్‌కప్ ఫీవర్ పట్టుకుంది. ఏ దేశమైనా సరే.. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అయితే కదలడం కష్టమే. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బుకీరాయుళ్లు రంగంలోకి దిగారు. విచ్చలవిడిగా పందేలు కాస్తున్నారు. అందినకాడికి అడ్డంగా దోచేసి మధ్యతరగతి ప్రజలకు టోపీలు పెట్టేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఆన్లైన్లోనే మూడు ఫోర్లు.. ఆరు సిక్సర్లుగా సాగుతోంది. తిరుపతి, క్రైం: క్రికెట్ బెట్టింగ్‌ల జోరు జిల్లాలో ఊపందుకుంది. మదనపల్లి, పలమనేరు, తిరుపతి నగరాల్లో బుకీ ఏజెంట్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. అధికంగా గెలుపు గుర్రాలపైనే బెట్టింగ్‌లు కాస్తున్నారు. తాజాగా ఇండియా -పాకిస్తాన్, ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారినట్టు సమాచారం. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి ప్రధాన దేశాలు ఆడినప్పుడు ప్రతిబాలుకూ, సిక్సర్లకు, ఫోర్లకు బెట్టింగ్ కట్టేవారి సంఖ్య పెచ్చుమీరుతోంది. ఇక జట్లు వారీగా బెట్టింగ్ కట్టేవారి సంఖ్య లక్షల్లోనే ఉన్నట్టు సమాచారం. చిన్న జట్టయినా.. గెలుస్తుందనే నమ్మకంతో వేలకు వేలు కుమ్మరిస్తున్నారు. కొందరు మ్యాచ్‌కు ముందుగానే టాస్‌పై కూడా బెట్టింగ్ కాస్తున్నట్టు తెలుస్తోంది. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రంగా బుకీ వ్యవస్థ నడుస్తున్నట్టు సమాచారం. వారి ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు రెండు వేల మంది బుకీలు తిష్టవేసినట్టు తెలిసింది. వీరు ప్రధానంగా స్టార్ హోటళ్లనే ఎంచుకుని తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. లావాదేవీలు ఎలా జరుగుతాయంటే బెట్టింగ్‌లకు సంబంధించి అంతా ఆన్లైన్లోనే ఈ వ్యవహారమంతా కొనసాగుతుంది. బ్యాంకు అకౌంట్, ఆన్లైన్ అకౌంట్ డబ్బులు చెల్లిస్తుంటారు. ఓ ఏజెంట్ ద్వారా బెట్టింగ్ టీమ్‌లో చేర్చుకున్నారంటే అతనిపై నమ్మకంతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన బ్లాంక్ చెక్, డబ్బులకు సంబంధించి లీగల్ టెర్మనాలజీలో లావాదేవీలు రాసుకుంటారు. కస్టమర్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయినా.. సరే.. బ్యాంకు ద్వారా చెల్లించాల్సిందే. లేని పక్షంలో సాధారణ ఏజెంట్లు, బుకీలు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటారు. వీరుచేసేది న్యాయపరమైంది కాకపోయినా లీగల్‌గా కమిట్మెంట్ అయిన తర్వాతనే బెట్టింగ్ టీమ్‌లో స్థానం లభిస్తుండడంతో పోలీసులూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు మకాం మార్చడం ఈ వ్యవస్థలో అంతా 20-20 మ్యాచ్ లెక్కన సాగుతోంది. ఏజెంట్లు, బుకీలు ఎప్పటికప్పుడు తప్పించుకునేందుకు సెల్ఫోన్లు, మకాంలు మార్చడం రివాజుగా సాగుతోంది. ఇందులో పెద్ద పెద్ద ఏజెంట్లు స్టార్హోటళ్లను ఎంచుకోగా మరికొందరు పట్టణాలకు సమీపంలోని ఇళ్లల్లో మకాం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లు స్టార్ హోటళ్లలోనే మకాం వేసి క్రికెట్ వీక్షిస్తూ బెట్టింగ్ కట్టేవారి కాల్స్ స్వీకరిస్తారు. ఈ సమాచారం బుకీలకు చేరవేస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లాభం వస్తే డబ్బు బ్యాంక్ అకౌంట్‌కు వస్తుంది. డబ్బులు పోయిన పక్షంలో సదరు బెట్టింగ్కట్టిన వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారు. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేనిపక్షంలో తెల్లవారే సరికి బ్యాంకు పనిచేసే వేళల్లో ఏజెంట్ల అకౌంట్లలో జమచేయాలి. లేకుంటే ముందుగానే రాసుకున్న లీగల్ టెర్మినాలజీ ప్రకారం కోర్టుకు లాగుతారు. ఈ వ్యవహారంలో మధ్యతరగతి వారే ఎక్కువగా చితికిపోతున్నట్టు సమాచారం. పోలీసులు బుకీవ్యవస్థను, ఏజెంట్లపై ఓ కన్నేయాలని పలువురు కోరుతున్నారు. -
బెట్టింగ్‌రాయుళ్ల బెండుతీస్తున్నారు
టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా గవర్నర్‌పేటలో ఏడుగురి అరెస్ట్ రూ.70వేల నగదు, 20 సెల్ఫోన్లు స్వాధీనం అజ్ఞాతంలోకి కీలక బుకీలు విజయవాడ సిటీ : క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిసారించారు. బుకీలతోపాటు బెట్టింగ్‌రాయుళ్ల బెండు తీసేందుకు నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిపి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని మంగళవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.70,350 నగదు, 20 సెల్ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. అయితే, బెట్టింగ్‌ల నిర్వహణలో ప్రముఖులుగా పేరొందిన బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నగరంలో జరిగే క్రికెట్ బెట్టింగ్‌లపై రెండు రోజులుగా ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకొని బుకీలు బెట్టింగ్‌లు నిర్వహించే తీరు.. నగరంలో పేద, మధ్య తరగతి, విద్యార్థులు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుంటున్న వైనాన్ని వివరించిన విషయం విదితమే. ఈ కథనాలపై స్పందించిన నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గవర్నరుపేట చేపల మార్కెట్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, మురళీధర్‌ల పర్యవేక్షణలో ఎస్ఐలు ఆర్.సురేష్‌రెడ్డి, జి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు సహా తదుపరి విచారణ కోసం గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో వీరి నుంచి బుకీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాబట్టినట్టు తెలిసింది. గతంలో బెట్టింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పిలిపించి బైండోవర్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తే మరికొందరు బెట్టింగ్ రాయుళ్లు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కీలక మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ రోజుల్లో ఇప్పటి కంటే రెట్టింపు పందేలు జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్‌లో కీలక భూమిక పోషించే ప్రధాన బుకీలను కట్టడి చేస్తే అనేక కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయి. అజ్ఞాతంలో బుకీలు.. పోలీసులు దాడులకు దిగడంతో పలువురు ప్రముఖ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు రెండు రోజులపాటు ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలిసిన వెంటనే ఇళ్లు వదిలి బయటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తమ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ పోలీసుల కదలికలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నూజివీడు, విస్సన్నపేట, ఇబ్రహీంపట్నం శివారుతోపాటు నగరంలోని పటమట ప్రాంతంలో ఖరీదైన అపార్టుమెంట్లలో వీరు ఆశ్రయం తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్
పట్టించుకోని పోలీసులు విజయవాడ సిటీ: క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు నగర పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. వీరు జోరుగా బెట్టింగ్‌లు సాగిస్తుండగా, నిలువరించాల్సిన పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నగరం కేంద్రంగా చేసుకొని బుకీలు సోమవారం కూడా క్రికెట్ బెట్టింగ్‌లు భారీగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఐర్లాండ్-వెస్టిండీస్ జట్లపై భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. నగరంలో ప్రధాన బుకీలుగా వ్యవహరించే వారికి రాజకీయ, పోలీసుల అండదండలు ఉన్నాయి. తమకు సహకరించే వారితో సోమవారం ఉదయమే ప్రధాన బుకీలు సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిచ్చిన భరోసాతో ముందుకు సాగిన బుకీలు ఇళ్ల నుంచే మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను చక్కబెట్టినట్లు సమాచారం. బెట్టింగ్‌ప్రణాళికలో భాగంగా బుకీలు ఏవిధంగా బెట్టింగ్‌లు నిర్వహించాలనేది ప్రాంతాల వారీగా తమ అనుచరుల(ఏజెంట్ల)కు ఆదేశాలు జారీ చేశారు. వీరు ఎప్పటి మాదిరిగానే పంటర్లకు టచ్‌లో ఉంటూ బెట్టింగ్‌లు కట్టించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వస్తారేమోనని పంటర్లు ముందుకు రాకపోవడంతో బుకీల అనుచరులే పందెగాళ్లకు పూర్తి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులు ఎవరూ కూడా తమ జోలికి రారని, ఒకవేళ వచ్చిన తమ బాస్(బుకీ)లు చూసుకుంటారని బెట్టింగ్‌రాయుళ్లకు అభయవివ్వడం గమనార్హం. ఇందుకు అనుగుణంగానే పోలీసులు కూడా పెద్దగా దృష్టిసారించకపోవడంతో యధావిధిగానే బెట్టింగ్‌లు సాగాయి. హైదరాబాద్ పరిణామాలు కూడా ఇక్కడి బుకీలకు కాసుల వర్షం కురిపించినట్టు తెలిసింది. అక్కడి పోలీసులు ఆదివారం కొందరు బుకీలను అదుపులోకి తీసుకోవడంతో ఇక్కడి బుకీలకు డిమాండ్ పెరిగింది. అక్కడి పంటర్లు వీరి ద్వారానే బెట్టింగ్‌లు కట్టినట్టు సమాచారం. బుకీల పరిభాషలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లపై 20పైసల ఆట జరిగినట్లు సమాచారం. అంటే ఐర్లాండ్ గెలుపొందితే రూ.10వేలు ఇస్తారు. అలాగాక వెస్టిండీస్ జట్టు గెలుపొందితే రూ.2వేలు మాత్రమే ఇస్తారు. వెస్టిండీస్ జట్టుతో పోల్చితే ఐర్లాండ్ జట్టు ఏమాత్రం పటిష్టమైనది కాదు. దీంతో పంటర్లు సహజంగానే వెస్టిండీస్‌పై భారీగా బెట్టింగ్‌లు కట్టారు. ఐర్లాండ్ గెలుపొందడంతో పంటర్లు తీవ్రంగా నష్టపోయినట్టు సమాచారం. -
'ఆప్' గుర్రాలపై బుకీల బెట్టింగ్ జోరు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని బుకీలు హాట్ ఫేవరేట్ గా భావిస్తున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల 'జాదూ'ను ఆప్ రిపీట్ చేయవచ్చనే అంచనాతో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని పార్లమెంట్ స్థానాలపై అధిక ఆసక్తిని బుకీలు చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఇంకా బెట్టింగ్ ప్రారంభం కానప్పటికి.. బుకీలు ఎక్కువగా ఆమ్ ఆద్మీపార్టీపైనే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 7 నుంచి మే 12 తేది వరకు జరిగే సాధారణ ఎన్నికల్లో దేశమంతటా ఎక్కువ సంఖ్యలోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలు గెలిచే అవకాశముందని బుకీలు అంచనా వేస్తున్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ, కేజ్రివాల్ ల మధ్య భీకర పోరు సాగే అవకాశం ఉండటంతో బుకీలు పుణ్యక్షేత్రంపై దృష్టిని కేంద్రికరిస్తున్నారు. ఇంకా చంఢీఘడ్ లోకసభ స్థానంలో ఆప్ అభ్యర్థి గుల్ పనాగ్, బీజేపీ నుంచి కిరణ్ ఖేర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ భన్సాల్ ల మధ్య త్రిముఖ పోటి రసవత్తరంగా మారడంతో ఆస్థానంపై బుకీలు కన్నేస్తున్నారు. ఇంకా నందన్ నీలెకని పోటీ చేసే బెంగళూరులోనూ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని స్థానాల్లోను బెట్టింగ్ భారీగా జరిగే అవకాశముందంటున్నారు. బుకీలో దృష్టిలోఉన్న స్థానాల్లో అజయ్ మాకెన్ పోటి చేస్తున్న న్యూఢిల్లీ, అమేథి, న్యూఢిల్లీ, చాందీని చౌక్, ఘజియాబాద్ స్థానాలపై బెట్టింగ్ జోరు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేవరెట్ స్థానం అంటే ఎలాంటి సందేహాం లేకుండా గెలిచే స్థానంపై బుకీలు తక్కువ మొత్తాన్ని ఇచ్చే విధంగా నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగతుందనే అంచనాతో ఆపార్టీపై 2.25 పైసలు, కాంగ్రెస్ పై 2.40 పైసలు, ఆమ్ ఆద్మీ పార్టీపై 3.40 పైసలు బెట్టింగ్ జరిగింది. ఒకవేళ పంటర్ 1 లక్ష రూపాయలు బీజేపీపై పెట్టుబడి పెడితే 2.25 లక్షలు, ఆమ్ ఆద్మీ పార్టీపై పెడితే 3.40 లక్షలు సొంత చేసుకుంటారన్న మాట. రానున్న ఎన్నికల్లో బెట్టింగ్ విలువను ఇంకా నిర్ఱారించలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని బుకీ ఒకరు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బెట్టింగ్ జోరు కొనసాగవచ్చనే వార్తలతో పోలీసు యంత్రాంగం బెట్టింగ్ వీరులను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. బెట్టింగ్ పాల్పడితే ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం శిక్షార్హులని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసుతో ఏడు ఏళ్ల వరకు శిక్ష పడవచ్చని పోలీసులు తెలిపారు. -
బుకీ రిటన్స్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లేవీ జరగడంలేదు... అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కూడా అంతగా పోటీ ఉన్న జట్ల మధ్య జరగడంలేదు... అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లకు చేతినిండా పనే. అందుకు కారణం త్వరలో ఢిల్లీ విధానసభకు జరగనున్న ఎన్నికలే. గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగేవి. దీంతో గెలుపోటములు నిర్ణయించడం పెద్దగా కష్టమయ్యేది కాదు. అప్పుడు బుకీలకు కూడా పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎక్కడ.. ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. ఇది నగరంలోని బెట్టింగ్‌రాయుళ్లకు వరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందనే విషయంపై కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతుంటే మరికొందరు స్థానిక అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయంపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొన్నిచోట్ల మెజార్టీల మీద కూడా బెట్టింగ్ జరుగుతోందని సమాచారం. అభ్యర్థులు, మెజార్టీలమీద కాసే పందేలా రేట్లు ప్రాంతానికోరకంగా ఉన్నాయని చెబుతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో అభ్యర్థుల మద్దతుదారులే ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న బెట్టింగ్ సమాచారం ప్రకారం.. అత్యధికంగా న్యూఢిల్లీపై బెట్టింగ్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్నారు. అందరూ మహామహులే బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపెవరిదో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఈ నియోజవర్గంలోని అభ్యర్థులపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో సరిపడా మెజార్టీ సాధించి, గద్దెనెక్కే పార్టీల విషయమై జరుగుతున్న బెట్టింగ్ వివరాల్లోకెళ్తే... బీజేపీపై తక్కువగా... ఆప్‌పై ఎక్కువగా... బుకీలు మిగతా పార్టీలకంటే తక్కువగా భారతీయ జనతా పార్టీ రేటును రూ. 2.25గా నిర్ణయించారు. రెండో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఈ పార్టీ రేటును రూ.2.40గా నిర్ణయించారు. ఇక అన్ని పార్టీలకంటే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ రేటును రూ.3.40గా నిర్ణయించారు. బీజేపీపై బెట్టింగ్ కంటే ఆమ్ ఆద్మీపై బెట్టింగ్ కాయడాన్ని ‘మోస్ట్ రిస్కీ’గా బుకీలు అభివర్ణిస్తున్నారు. నగరానికి చెందిన బుకీ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘ ఓ పార్టీ రేటును అతి తక్కువగా నిర్ణయించామంటే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు బీజేపీ మీద లక్ష రూపాయల పందెం కట్టారనుకుందాం. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే మీకు రూ. 2.25 లక్షలొస్తాయి. అదే కాంగ్రెస్ మీద కడితే రూ. 2.40 లక్షలు, ఆప్ మీద కడితే రూ. 3.40 లక్షలు వస్తాయి. అయితే చాలా మంది రెండు పార్టీల మీద పందెం కాస్తున్నారు. ఒకదాంట్లో నష్టం వస్తే మరోదాని ద్వారా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఇలా చేస్తారు. అయితే రంగంలో మూడు పార్టీలుండడం, పందెం కాసిన రెండు పార్టీలూ ఓడిపోతే పందెం కాసినవారి పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ప్రస్తుతం రేట్లు ఇలా ఉన్నా నవంబర్ నెలాఖరునాటికి పరిస్థితి మారే అవకాశముంది. అప్పటి పరిస్థితుల ప్రకారం ఎవరు ఏ పార్టీపై ఎక్కువగా బెట్టింగ్‌కు పాల్పడతారో చూసి దాని ప్రకారం రేట్లు నిర్ణయిస్తారు.