కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)ను ఫిక్సింగ్ భూతం వదిలేటట్లు కనబడుటం లేదు. ఇప్పటికే పలువురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా నిషేధాని గురవ్వగా, తాజాగా పీఎస్‌ఎల్‌లో మరొకసారి ఫిక్సింగ్ కలకలం రేగింది. దుబాయ్‌లో జరుగుతున్న పీఎస్‌ఎల్ క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారనే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.'
'కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా బుకీలు ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆటగాళ్ల నుంచి వారికి ఎలాంటి స్పందన దక్కలేదు. ఈ సమస్యను ఇప్పటికే ఆటగాళ్లు మా దృష్టికి తీసుకువచ్చారు. అప్రమత్తమైన మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం' అని సదరు ప్రతినిధి తెలిపారు.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకల చెలరేగడం ఇది తొలిసారి కాదు. గత సీజన్‌లో లతీఫ్, షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఐదేళ్ల నిషేధం పడగా, నాసీర్ జంషెడ్‌పై ఏడాది నిషేధం విధించారు.
Comments
Please login to add a commentAdd a comment