16 మంది క్రికెట్‌ బుకీలు అరెస్టు | 16 cricket bookies arrested in ysr district | Sakshi
Sakshi News home page

16 మంది క్రికెట్‌ బుకీలు అరెస్టు

Published Fri, Feb 10 2017 5:12 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

16 cricket bookies arrested in ysr district

లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్‌ జిల్లా):
వైఎస్సార్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం పెద్ద సంఖ్యలో క్రికెట్‌ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇండియా -బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి 16 మంది క్రికెట్ బుకీలను స్థానిక స్టేట్ బ్యాంకు సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42 వేల నగదుతో పాటు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దీంతో పాటు 8 సెల్ ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించామని పులివెందుల ఏఎస్పీ అంబురాజన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement