ఆగస్టు 1న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
తాప్సీ (నటి), అరుణ్‌లాల్ (క్రికెటర్)
ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఇది శనైశ్చరునికి సంబంధించినది. శని స్థిరత్వానికి, ఆయుష్షుకు, వృత్తికీ కారకుడు. అందువల్ల వీరికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి.
రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 1. ఇది సూర్యునికి సంబంధించినది కాబట్టి కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. లక్కీనంబర్లు: 1,4,6,8 లక్కీ కలర్స్: బ్లాక్, వయొలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. లక్కీడేస్: ఆది, బుధ, శనివారాలు. సూచనలు: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం,
- డాక్టర్ మహమ్మద్ దావూద్