Tapsi
-
ఓటీటీలో తాప్సీ హిట్ సినిమా సీక్వెల్ రెడీ
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. వినీల్ మాథ్యూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని సస్పెన్స్‌కి గురి చేయడమే కాకుండా బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ పేరుతో మళ్లీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మేకర్స్ తాజాగా ప్రకటించారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. -
అది నా అదృష్టం
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ‘శభాష్ మిథు’ అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ టైటిల్ రోల్లో కనిపిస్తారు. ‘ఈ సినిమా చేయడం నా అదృష్టంలా భావిస్తున్నాను’ అన్నారు తాప్సీ. ‘శభాష్ మిథు’ చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘ఈ సినిమా చేయడంలో రెండు రకాల సవాళ్లు ఉన్నాయి. మొదటిది క్రికెట్. నాకు క్రికెట్ ఆడటం రాదు. ప్రొఫెషనల్ ప్లేయర్లా ఆడటం నేర్చుకోవాలి. రెండవది మిథాలీ రాజ్‌లా స్క్రీన్ మీద కనిపించాలి. మిథాలీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం పూర్తిగా భిన్నమైనవి. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఏ మాట అయినా ఆమె ఆలోచించే మాట్లాడతారు. నేను అందుకు పూర్తి విరుద్ధం. మహిళా క్రికెట్లో మిథాలీ ఒక ఐకాన్. ఆమె పాత్రను స్క్రీన్ మీద పోషించే అవకాశం రావడం అదృష్టం. కేవలం క్రీడాకారిణిగానే కాదు.. ఒక వ్యక్తిగా మిథాలీ అంటే నాకెంతో గౌరవం’’ అన్నారు తాప్సీ. ‘స్పోర్ట్స్ పర్సన్‌గా నటించడానికి మీ బాయ్‌ఫ్రెండ్ (మాథ్యూస్ బో, బ్యాడ్మింటన్ ప్లేయర్) నుంచి ఏదైనా టిప్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు– ‘‘మెదడు ఆపరేషన్ చేసేవాళ్లు, హృదయానికి సంబంధించిన వాళ్లు ఏం చేయాలో చెప్పకూడదు కదా. రెండూ వేరు వేరు స్పోర్ట్స్. అలానే పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను విడివిడిగా ఉంచడానికి ఇష్టపడతాం’’ అని సమాధానమిచ్చారు. -
నాకు నలుగురు హీరోలు
తాప్సీ ‘‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాల్లో నాకు ఒకే హీరో ఉంటాడు. కానీ, ‘ఆనందోబ్రహ్మ’ సినిమాలో మాత్రం నాకు నలుగురు హీరోలున్నారు. తొలిసారి నేను చేసిన హారర్ కామెడీ చిత్రమిది. ప్రతి పాత్రకూ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అని తాప్సీ పన్ను అన్నారు. తాప్సీ పన్ను, శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘తాగుబోతు’ రమేష్, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో మహి వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘ఇదొక హారర్ కామెడీ జోనర్ అని దర్శకుడు చెప్పారు. కానీ, కథలో మనుషులను చూసి దెయ్యం భయపడుతుంది అనే పాయింట్ నాకు నచ్చి, సినిమా తీశా. సాంకేతికపరంగా సినిమా బావుంటుంది. ఆగస్ట్ 18న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యాలను పెద్దగా నమ్మను. అందుకే హారర్ కామెడీ సినిమా కథ రాయగలిగా. సాధారణంగా దెయ్యాలకు మనుషులు భయపడుతుంటారు. కానీ, దెయ్యాలు మనుషులకు భయపడితే? ఎలా ఉంటుందనే పాయింట్‌తో కథ రాశా. కిషోర్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, రమేష్ ఒకర్ని మించి ఒకరు బాగా చేశారు’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘తాగుబోతు’ రమేష్, ‘షకలక’ శంకర్, కెమెరామెన్ అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ శ్రవణ్ కటికనేని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె. -
అందుకు నన్ను బాధ్యురాలిని చేశారు
నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు అంటూ ఇంత కాలం తనలో దహిస్తున్న ఆవేదనను వెళ్లకక్కింది నటి తాప్సీ. ఈ అమ్మడు ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. అయినా ఆమె అందాలను తెరపై ఆవిష్కరించడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు తప్ప అభినయాన్ని రాబట్టాలని ఎవరూ భావించలేదన్నది తాప్సీ ఆవేదన. ముఖ్యంగా కోలీవుడ్‌లో ధనుష్ వంటి స్టార్ హీరోకు జంటగా పరిచయమైన తాప్సీకి ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, జాతీయ అవార్డులు రాబట్టుకున్నా ఈమెకు మాత్రం ఇక్కడ ఏమంత ఆదరణ లభించలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో వెలిగిపోతున్న తాప్సీ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించింది. అవేమిటో ఒక లుక్కేద్దాం. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను. అందుకే హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే నాకు కమర్శియల్ కథా చిత్రాలు అమరలేదు. అందుకే చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్ర అపజయాలతో నాపై అచ్చిరాని నటి అని ముద్ర వేసి దూరంగా పెట్టారు. అలా చిత్ర నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు. ఇది నన్ను చాలా బాధకు గురి చేసింది. చాలా కాలంగా మనసులోనే దాసుకుని అనుభవించిన మానసిక వేదన ఇది. అయితే నా కుటుంబ సభ్యులు పక్క బలంగా నిలిచారు. ఆ తరువాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టాను. అక్కడ మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. నా అభిమానులకు నేను చెప్పేదొక్కటే. ఎవరిపైనా ఆధారపడకండి. అమ్మ, నాన్న, అన్నయ్యల సహకారం కోసం ఎదురు చూడకుండా మీ అవసరాలను మీరే పూర్తి చేసుకోండి. ఎలాంటి సమస్యనైనా మీరే ధైర్యంగా ఎదుర్కోండి. -
అదే లేకుంటే అవకాశాలు ఎందుకొస్తాయి
చిత్ర పరాజయానికి నేనా కారణం అంటూ నటి తాప్సీ దక్షిణాది దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ ఢిల్లీ అమ్మడికిప్పుడు ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. వచ్చినా నటించడానికి భయం వేస్తోంది అంటున్నారు. అయితే బాలీవుడ్లో మాత్రం చిత్రాలు చేతి నిండానే ఉన్నాయి. అమితాబ్‌బచ్చన్ తో కలిసి నటించిన పింక్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో హిందీ చిత్ర పరిశ్రమలో తాప్సీ సినీ పయనం చాలా జోరుగా సాగుతోంది. దీంతో దక్షిణాది చిత్ర దర్శకులపై అభాండాలు వేసేంత ధైర్యం వచ్చేసింది. ఇంతకీ ఈ భామ ఏమంటుందో చూద్దామా. దక్షిణాది చిత్ర దర్శక నిర్మాతలు నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వలేదు. గ్లామర్ పాత్రలే ఇచ్చారు. చిత్రం పరాజయం పాలైతే బాధ్యులెవరు? నాకు రాశిలేని నటి అనే ముద్రవేశారు. నాలోని నటనా ప్రతిభను నిరూపించుకునే పాత్ర ఒక్కటీ రాలేదు. అందుకే నేను బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాను. హిందీలో నేను నటించిన పింక్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నాకూ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకరిని తిట్టడం, నేరం మోపడం చాలా సులభం. అందుకు ముందు కారణాన్ని ఆలోచించడం మరచిపోతున్నారు. నన్ను రాశిలేని నటిగా ఇక్కడ చిత్రీకరించినా, హిందీలో అరడజను చిత్రాలున్నాయి. చేతి నిండా సంపాదిస్తున్నాను. తాను రాశి లేని నటినైతే బాలీవుడ్లో ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నిస్తోందీ భామ. -
భారతీయ సిల్వర్ స్క్రీన్ చూడని చిత్రం ఘాజీ
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ ఎవరూ చూడని చిత్రంగా ఘాజీ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు రానా పేర్కొన్నారు. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవాగా జీవించి భళా అనిపించుకున్న బహుభాషా నటుడు రానా. టాలీవుడ్ నటుడే అయినా తమిళం, హిందీ భాషల్లోనూ బహుళ ప్రాచుర్యం పొంది మోస్ట్ వాంటెడ్ నటుడిగా ఎదుగుతున్న రానా తాజాగా కథానాయకుడిగా నటించిన మరో త్రిభాషా చిత్రం ఘాజీ. నటి తాప్సీ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ.సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్ మెంట్ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవ దర్శకుడు సంకల్ప్ వెండితెరపై ఆవిష్కరించిన భారీ ఎండ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం ఘాజీ. కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చిన రానాతో సాక్షి భేటీ. ప్ర: ఘాజీ చిత్ర నేపథ్యం ఏమిటి? జ: ఇది 1971లో విశాఖపట్టణంలో జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య సముద్ర భాగంలో జరిగిన యాదార్థ యుద్ధం ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం. ప్ర: ఇంతకు ముందు ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఘాజీ చిత్రానికీ డిఫరెంట్ ఏమిటి? జ: ఇంతకు ముందు ఇండియా–పాకిస్తాన్ ల మధ్య పోరు కథలతో భారతీయ చిత్రాలు చాలా తక్కువే వచ్చాయి. అయితే ఘాజీ చిత్రం నేవి నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఈ తరహా చిత్రాలను ఇప్పటి వరకూ భారతీయ వెండితెరపై చూసి ఉండరు. ప్ర: ఘాజీ చిత్రంలో మీరు నటించడానికి ప్రధాన కారణం? జ: ముందుగా కొత్త కాన్సెప్‌్టతో కూడిన కథా చిత్రాల్లో నటించడానికి నేను చాలా ఆసక్తి చూ పుతాను. ఆ విధంగా నేను సినిమా లవర్ని. ఘాజీ చి త్రం మనదేశంలో మన విశాఖపట్టణంలో 1971లో నాకు తెలియని చిన్నతనంలో విన్న యుద్ధం గురించిన కథ. ఘాజీ అనే సబ్‌మెరైన్ లో 71 రోజుల పాటు జరిగిన ఇండియా–పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఇతివృత్తం కావడంతో సహజంగానే ఈ చిత్రంలో నటించాలనే కోరిక కలిగింది. ఇంకా చెప్పాలంటే బ్లూఫిష్ అనే కథ చదివి దీని రచయిత, దర్శకుడు అయిన సంకల్ప్‌ను వెతుక్కుంటూ వెళ్లి ఈ చిత్ర అవకాశాన్ని అందుకున్నాను. మనం ఇక్కడ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే అందుకు కారణం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల పోరు, త్యాగాలే. వారిని గౌరవించేలా ఈ ఘాజీ చిత్రం ఉంటుంది. ప్ర: ఘాజీ చిత్రంలో హైలెట్స్ గురించి? జ: చిత్ర కథే ఒక హైలెట్. చిత్రం 60 శాతం అండర్వాటర్లోనే జరుగుతుంది. అండర్‌వాటర్‌లో నటించడం చాలా రిస్క్‌తో కూడింది. సూర్యరశ్మి సోకదు. సాధారణ దుస్తులు ధరించలేం. అందుకు ప్రత్యేక దుస్తులు ధరించి నటించాం. చిత్రం చాలా సీరియస్‌గా సాగుతుంది. ఇందులో నేను లెఫ్టినెంట్ ఆర్మీ అధికారిగా నటించాను. అతి ఫోర్స్ గానీ, అనవసర సంభాషణలు గానీ ఉండవు. కథ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఘాజీ చిత్రంలో నటించడం గర్వంగా భావిస్తున్నా. ప్ర: నటి తాప్సీ గురించి? జ: నటి తాప్సీది ఇందులో కీలక పాత్ర. తను ఇందులో బెంగాలీ అమ్మాయిగా నటించారు. ఆమె నటనకు చాలా పేరు వస్తుంది. ప్ర: మీరు ఎక్కువ పిరియడ్ కథా చిత్రాల్లోనే నటించండానికి కారణం? ప్ర: కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఏ చిత్రానికైనా కంటెంట్ ముఖ్యం. కథ నన్ను ఆకట్టుకుంటే ఏ తరహా చిత్రం అయినా చేయడానికి నేను రెడీ. సక్సెస్ అవుతుందనే చిత్రాలు చేయలేం. ఉదాహరణకు బాహుబలి చిత్రాన్ని విజయం సాధించాలన్న ఒక్క కారణంతోనే చేయలేదు. ఒక గొప్ప చిత్రం, వినూత్న ప్రయోగంతో చేయాలన్న లక్ష్యంతో ఆ చిత్రం చేశాం. అది భారతీయ సినిమా గర్వించే చిత్రంగా నిలిచింది. ప్ర: బాహుబలి–2 చిత్రం గురించి? జ: బాహుబలికి సంబంధించిన రెండు కథలు ముందుగానే సిద్ధం అయ్యాయి. బాహుబలి చిత్రం అద్భుత విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ ఇంకా ప్రముఖ సాంకేతిక నిపుణులతో మరింత బ్రహ్మాండంగా తెరెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఆ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ప్ర: మీ తాతగారు డి.రామానాయుడు ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో ఏదైనా రీమేక్‌లో నటించాలన్న కోరిక ఉందా? జ: కోరిక ఉన్నా వాటిని రీమేక్ చేయడం, అందులో నటించడం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే అవన్నీ గోల్డెన్ హిట్ చిత్రాలు. సరిగా చేయలేమేమోనన్న భయం. అందుకే అలాంటి సాహసం చేయలేను. ప్ర: తదుపరి చిత్రాలు? జ: ప్రస్తుతం తెలుగులో తేజ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. త్వరలో దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది 1945 నేపథ్యంలో సాగే పిరియడ్ కథా చిత్రమే. -
ఆయన స్పాట్ ఫ్రెండే!
హీరోలు హీరోయిన్లను సిఫారసు చేయడం అన్నది సాధారణంగా జరిగే విషయమే. అయితే దీన్ని ఎవరూ అంగీకరించరు. సిఫారసు చేసే హీరోలు కూడా హీరోయిన్ల ఎంపిక అన్నది దర్శక నిర్మాతల పరిధిలోని విషయం అనే చెబుతుంటారు. ఇక ఫలాన హీరో నాకు సిఫారసు చేశారని హీరోయిన్లు మాత్రం ఎందుకు చెబుతారు? ఏమీ చెప్పకపోయినా వారి మధ్య ఏదో ఉందని గాసిప్స్ గుప్పించే మీడియా నిజాలు చెబితే ఇంకా రెచ్చిపోదూ. అందుకు నటి తాప్సీ కూడా తనకెవరూ సిఫారసు చేయడం లేదని ఢంకా ఊదేస్తోంది. ఇంతకు ముందు వరకూ తమిళం, తెలుగు భాషల్లో నటించిన ఈ ఢిల్లీ బ్యూటీకి ఇక్కడ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. అయితే బాలీవుడ్ అమ్మడిని ఆదుకుంది. ఆ మధ్య అమితాబ్ నటించిన పింక్ చిత్రంలో అత్యాచారానికి గురైన అమ్మాయిగా జీవించడంతో అక్కడ తాప్సీ పరిస్థితి బాగానే ఉంది. ఈ భామకు టాలీవుడ్ యువ నటుడు రానా సిఫారసు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రానా బహుభాషా నటుడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే త్రిష, తమన్నా, శ్రియలతో ఈయన్ని కలిపి వదంతులు దొర్లాలి. తాజాగా రానాతో తాప్సీ సన్నిహితం అంటూ గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బేబీ అనే హిందీ చిత్రంలో కలిసి నటించిన రానా, తాప్సీ తాజాగా కాళీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రంలో నాయకి పాత్రకు తాప్సీకి రానానే సిఫారసు చేశారనే ప్రచారానికి స్పందించిన ఈ ఢిల్లీ పాప నటుడు రానా తనకు షూటింగ్ స్పాట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేసింది. అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయినా రానా తనకు సిఫారసు చేయాల్సిన అవసరం లేదని, హిందీలో తానిప్పుడు బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నానని చెప్పింది. అలా ఈ కథకు తాను అవసరం కావడంతో దర్శకుడు తనను ఎంపిక చేశారని తాప్సీ పేర్కొంది. -
నచ్చకపోతే వదిలేస్తా!
నచ్చకపోతే వదిలేస్తానంటోంది నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో నాయకిగా ఒక రౌండ్ కొట్టేసిన ఈ ఉత్తరాది భామ తాజాగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. ఆ మధ్య బిగ్‌బీ అమితాబ్‌తో నటించిన పింక్ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు తాప్సీ నటనకు ప్రశంసలు అందాయి. దీంతో ఈ అమ్మడికక్కడ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్న తాప్సీ ఒక భేటీలో మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదన్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి వచ్చానని, ఆ తరువాత ఆ రంగం ద్వారా సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అప్పుడు కూడా చేతి ఖర్చుల కోసమే చిత్రాల్లో నటించానని అంది. అలాంటిది ఒక దశలో సినిమా బాగా నచ్చిందని, దాంతో నటనపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపింది. తనకు ఆత్మవిశ్వాసం అధికం అని పేర్కొంది. దేనికీ భయపడను. తాను మోడలింగ్ చేసేటప్పుడు తన తండ్రి కంటికి నిద్రలేకుండా బతికారని అంది. అందుకు కారణం తన గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమోనన్న భయమేనని చెప్పింది.ఆ తరువాత తన ప్రకటనలు ప్రసారం అవుతుండగా ఆయన స్నేహితులు ప్రశంసిస్తుంటే నమ్మకం కుదిరిందని తెలిపింది. చుట్టు పక్కల వారికి భయపడే తల్లిదండ్రులు ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుండా పెంచుతున్నారని అంది. తాను అలాంటి కుటుంబం నుంచి వచ్చినదానినేనని పేర్కొంది. కట్టుబాట్లలో పెరిగినంత వరకూ తనకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియదని అంది. సినీరంగ ప్రవేశం తరువాత స్నేహితులు, ఇతరుల సహచర్యంతో ప్రపంచాన్ని చూశానని చెప్పింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు తాను చెప్పింది వినడంతో పాటు మహిళలకు కట్టుబాట్లు అవసరం లేదని నమ్మతున్నారని చెప్పింది. కట్టుబాట్లు అనేవి స్త్రీలను అణచి వేయకూడదని అంది. ఇతరుల గురించి ఆలోచించడం పట్టించుకోవడం వదిలి మనగురించి ఆలోచిస్తే సంతోషం కలుగుతుంది, మన గురించి కాకుండా వారి గురించి ఆలోచిస్తే ఆనందానికి దూరం అవుతామని అంది. తనకు నటిగా సంతోషం లభిస్తోందిని, ఇష్టం లేకపోతే నటనను వదిలేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు తగ్గాయని, మంచి అవకాశాలు వస్తే ఆ భాషల్లో నటిస్తానని అంది. ఇకపోతే తాను పెళ్లికి తొందర పడడం లేదని, నచ్చిన వ్యక్తి తారస పడ్డప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది. -
దెయ్యాలు భయపడితే!
హారర్ ప్లస్ కామెడీ... నటీనటులకు మాంచి విజయాలు అందిస్తూ, దర్శక–నిర్మాతలకు కాసులు కురిపిస్తున్న హిట్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఢిల్లీ భామ తాప్సీ కూడా ఇటువంటి తెలుగు సినిమాలో నటించనున్నారు. కానీ, ఆమె చేయబోయేది కామెడీ హారర్ సినిమా. మాములుగా మనోళ్లు ‘హారర్ కామెడీ’ అంటుంటారు కదా.. రివర్స్‌లో ‘కామెడీ హారర్’ అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మతలబు. రొటీన్‌గా ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ దెయ్యాలను చూసి మనుషులు భయపడుతారు. కానీ, ఇందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయట! రెగ్యులర్ ఫార్ములాకి రివర్స్‌లో పూర్తి వినోదాత్మక చిత్రమిది. ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ ఈ కొత్త జానర్‌ను తెలుగుకి పరిచయం చేయబోతున్నారు. ‘భలే మంచిరోజు’ నిర్మాతలు విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆల్రెడీ తాప్సీకి కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగాయి. తాప్సీ ముఖ్యతారగా నటించనున్న ఈ సినిమాలో జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్లు కీలక పాత్రలు చేయనున్నారు. ‘‘ఈ నెల 22న తాప్సీ హైదరాబాద్ వస్తారు. దర్శకుడితో ఆమె తన లుక్ గురించి డిస్కస్ చేయడంతో పాటు సినిమాకి సంతకం చేస్తారు’’ అని సమాచారం. ఆత్మలు, దెయ్యాలు మనుషులను భయపెట్టడమనేది ప్రతి హారర్ కామెడీ సినిమాలోనూ చూస్తున్నాం. బట్ ఫర్ ఏ ఛేంజ్... మనుషులను చూసి దెయ్యాలు, ఆత్మలు భయపడితే? తాప్సీ ముఖ్యతారగా ‘పాఠశాల’ ఫేమ్ మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా మూలకథ ఇదేనట!! -
రెండో ఇల్లు
ఆల్రెడీ తాప్సీకి ముంబైలో ఓ సొంత ఫ్లాట్ ఉంది. ఇప్పుడు తాజాగా అంధేరీలోని ఓషివారాలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్ కొన్నారు. వచ్చే ఏడాది ఈ కొత్త ఇంట్లో అడుగుపెడతారట. ఇంతకీ ఈ ఢిల్లీ బ్యూటీకి ముంబైలో రెండు ఇళ్లు ఎందుకు? అన్నది కొంతమంది సందేహం. మరేం లేదు. హిందీలో తాప్సీకి మంచి ఛాన్సులొస్తున్నాయి. దాంతో ముంబైలో సెటిల్ కావాలనుకున్నారట. చిన్న ఇంట్లో సర్దుకుపోవడం ఎందుకని పెద్ద ఫ్లాట్ కొన్నారట. -
ఈ డేట్ గుర్తు పెట్టుకోండి!
మార్చి 31, 2017... గుర్తు పెట్టుకోండి. నాలుగు నెలల ముందే మేము కర్చీఫ్ వేస్తున్నామంటున్నారు తాప్సీ. ఈ తేదీపై కర్చీఫ్ వేయడం ఏంటి అనుకుంటున్నారా! తాప్సీ నటిస్తున్న ఫిమేల్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ ‘నామ్ షబానా’. ఈ చిత్రాన్ని వచ్చే మార్చి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బబ్లీ లుక్స్, గ్లామర్ డాల్ ఇమేజ్‌తో సౌత్‌లో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీ, హిందీలో నటించిన అక్షయ్‌కుమార్ ‘బేబీ’తో తనలోని యాక్షన్ యాంగిల్ చూపించారు. ఇక, ‘బేబీ’కి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘నామ్ షబానా’లో ఆమెదే మెయిన్ రోల్ కనుక, యాక్షన్ గాళ్‌గా విశ్వరూపం చూపిస్తానంటున్నారు. మీరు ఫొటోలో చూస్తున్నది... ఈ చిత్రంలో తాప్సీ ఫస్ట్ లుక్. ఇందులో అక్షయ్‌కుమార్ అతిథి కంటే కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించారు. -
తక్కువ అంచనా వెయ్యొద్దు!
‘‘కవర్‌పేజీ చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. అలాగే, ముసుగులో ఉన్న షబానాను తక్కువ అంచనా వెయ్యొద్దు’’ అంటున్నారు తాప్సీ. ‘నామ్ షబానా’లో తాప్సీ చేస్తున్న రహస్య గూఢచారి పాత్ర పేరు షబానా. అక్షయ్ కుమార్ ‘బేబీ’కి ప్రీక్వెల్ ఇది. ‘‘అసలే శీతాకాలం, ఆపై నాకు జలుబు. వర్షపు సీన్లు తీస్తున్నారు’’ అని తాప్సీ చెప్పుకొచ్చారు. అన్నట్లు తాప్సీతో ‘భలే మంచి రోజు’ నిర్మాతలు ఓ హారర్ థ్రిల్లర్ నిర్మించాలనుకుంటున్నారట. ఇందులో దయ్యంగా కనిపించడానికి తాప్సీ రెడీ అన్నారట! -
స్మైలీ అండ్ స్టైలీ
తాప్సీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. స్మైలింగ్ ఫేస్. తాప్సీ ఎప్పుడూ కొత్తగా కనబడతారు. స్టైలింగ్ లుక్. ఈ స్మైలింగ్, స్టైలింగ్... సినిమాలకు కొత్త ఫ్లేవర్‌ను తెచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ఫ్లేవర్‌తో తాప్సీ స్క్రీన్ మీదకు వస్తున్నారు. వచ్చే శుక్రవారం ‘పింక్’ రిలీజ్. అందులో తాప్సీ స్మైల్‌ని, స్టైల్‌ని మించి... ఓ కొత్త యాంగిల్‌ని మీరు చూస్తారు. ఇంటర్వ్యూ చదవండి. ఆ కొత్తదనం ఏమిటో సినిమా రిలీజ్‌కు ముందే... మీకు తెలుస్తుంది! ♦ హలో తాప్సీ... చాన్నాళ్లయింది మిమ్మల్ని చూసి.. కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపిస్తున్నారు.. తాప్సీ: (నవ్వుతూ). ఈ స్టైల్ బాగుందనే అనుకుంటున్నా. ఓ సినిమా కోసం జుత్తుని కురచగా కత్తిరించు కున్నా. సినిమా కోసం ఏ హెయిర్ స్టైల్ అయినా నాకు ఓకే. అవసరమైతే డీ-గ్లామరైజ్డ్గా కూడా మారిపోతాను. ♦ చేసే క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే, ఈ మధ్య ఏ సినిమా పడితే అది చేయడం లేదేమో? నిజమేనండి. గ్లామరస్ రోల్స్ చాలా చేశా. ఇప్పుడూ అలాంటివి చేస్తా. కానీ, ఎక్కువగా నటనకు చాన్స్ ఉన్నవి మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య హిందీలో చేసిన ‘బేబీ’ మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘పింక్’ ఇంకా మంచి పేరు తెస్తుంది. ♦ ‘పింక్’ అంత గొప్పగా ఉంటుందా? అమితాబ్ బచ్చన్‌గారి కాంబినేషన్ లో ఈ సినిమా చేయడం ఓ మరచిపోలేని అనుభూతి. ఇందులో నాది చాలెంజింగ్ రోల్. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి క్యారెక్టర్. రియల్ లైఫ్‌లో నాకలాంటి అనుభవాలు లేవు. కనీసం నాకు తెలిసినవాళ్ల లైఫ్‌లోనూ జరగలేదు. అందుకే ఓ విక్టిమ్ (బాధితురాలు)లా నేను ఫీలవలేను. అందువల్ల, ఈ క్యారెక్టర్ చేయడం సవాల్‌గా అనిపించింది. కోర్ట్‌లో సాగే సీన్స్‌లో ఎక్కువగా ఎమోషన్ అవడం, ఎక్కువ సీన్స్‌లో ఏడవడం.. ఇలా రియల్ లైఫ్‌లో నేను కానిది చేశాను. బాగా చేశాననే అనుకుంటున్నా. ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నా. ♦ రియల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తారు. సినిమా కోసం అందుకు విరుద్ధంగా చేసినప్పుడు ఏమనిపిస్తుంది? యాక్టర్స్‌కి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే.. స్క్రీన్‌పై డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్గా కనిపించవచ్చు. కాకపోతే మా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. ‘పింక్’లో నేను చేసిన అరోరా క్యారెక్టర్ నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. ♦ అదేంటీ.. నిజజీవితంలో మీపై లైంగిక దాడులు జరగలేదన్నారు.. ఇప్పుడీ పాత్ర మీకు దగ్గరగా ఉందంటున్నారు? చదువుకునే రోజుల్లో భయం భయంగా ఉండేదాన్ని. ఆ తర్వాత మైండ్ సెట్ మారింది. నేనెలా బతకాలని కోరుకుంటున్నానో అలానే ఉంటున్నాను. సొసైటీ గురించి పట్టించుకోను. ‘మనం ఇలా ఉంటే వాళ్లేమనుకుంటారో’ అని నా ఇష్టాలను మానుకోను. అలాగని, నేను లెక్కలేనితనంగా, ఇష్టం వచ్చినట్లుగా ఉండను. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో నేను చేసిన అరోరా పాత్ర ఫీలింగ్ కూడా అదే. న్యాయం కోసం పోరాడుతుంది. ♦ మీరు సినిమాలో పోరాడారు. రియల్‌గా లైంగిక దాడులు ఎదుర్కొనే అమ్మాయిలు పోరాటం చేస్తూనే ఉన్నారు.. అంతెందుకు మీ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన పెద్ద షాక్... నేను ఢిల్లీ అమ్మాయినే. కానీ, నా చేతిలో ఏం ఉంటుంది? ఒకవేళ ఉంటే మాత్రం క్రిమినల్స్‌కి టఫ్ పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ.. మొత్తం ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ, క్యాపిటల్ సిటీ కాబట్టి ఢిల్లీలో మాగ్జిమమ్ వెలుగులోకొచ్చేస్తాయ్. చదువు లేకపోవడంవల్లనా? సరిగ్గా పెరగకపోవడం వల్లనా? దేనివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అర్థం కావడంలేదు. కానీ, ఇలాంటి దారుణాల గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ♦ ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం మన రాజ్యాంగంలో రాసినవే దాదాపు ఇప్పటికీ పాటిస్తున్నాం. చట్టంలో సవరణలు జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ‘లా’ గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్న వ్యక్తిని. నా అభిప్రాయం ఏంటంటే... పట్టుబడితే పనిష్మెంట్ కఠినంగా ఉండాలి. అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినవాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, ఎక్కడ భయపడుతున్నారు? తప్పు చేసినవాళ్లు (నిర్భయ కేసులో దోషులు) చట్టానికి భయపడలేదు. మృగాల్లా ప్రవర్తించారు. ‘చట్టం మనల్ని ఏం చేస్తుందిలే. నచ్చింది చేసేద్దాం, ఏమీ జరగదు’ అని రెచ్చిపోయారు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరి ఆలోచనా ఇలానే ఉండి ఉంటుంది. చట్టానికి ఎప్పుడైతే భయపడతారో.. అప్పుడే వీటన్నిటికి అడ్డుకట్ట పడుతుంది. ♦ మీరు సెలబ్రిటీ కనుక చుట్టూ బాడీగార్డ్స్‌తో సేఫ్‌గా ఉంటారు.. నార్మల్ గాళ్స్‌కి సేఫ్టీ తక్కువే? ఏదైనా ప్రెస్మీట్స్, ఈవెంట్స్ అప్పుడే మాకు బాడీగార్డ్స్ ఉంటారు. విడిగా ఉండరు కదా. ముంబయ్, ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బాడీగార్డ్స్ ఉండరు. నార్మల్ గాళ్లానే ఉంటాను. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఒంటరిగానే వెళతాను. అప్పుడు సేఫ్టీ చాలా తక్కువ. ♦ సెలబ్రిటీలు బయటికొస్తే చాలు.. జనాలు గుమిగూడతారు. ఉదాహరణకు మొన్న మీరు బెంగళూరు వెళ్లినప్పుడు కొంతమంది చుట్టుముట్టేశారు... సెలబ్రిటీల లైఫ్‌లో ఇలాంటివి కామన్. మమ్మల్ని దగ్గరగా చూడాలనుకుంటారు. వీలైతే తాకాలనుకుంటారు. అదంతా అభిమానంతోనే అని నా ఫీలింగ్. ఫ్యాన్స్ ఎప్పుడూ హాని చేయాలనుకోరు. కానీ, కొంతమంది మాత్రం ఎక్కడెక్కడో టచ్ చేయాలని చూస్తారు. ఎగ్జైట్మెంట్ వలన వాళ్లను వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. అత్యుత్సాహంతో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నామనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటారు. హద్దులు దాటనంతరవకూ మాకు బాగానే ఉంటుంది. అభిమానం హద్దులు దాటితేనే అసౌకర్యంగా ఉంటుంది. ♦ ఆ సమయాల్లో మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటా. ‘టికెట్ కొని నీ సినిమా చూసే ప్రేక్షకులు వీళ్లే. తిట్టకు. వీలైతే పెదాల పైకి నవ్వు తెచ్చుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకో. వీళ్లంతా నీవాళ్లే’ అనుకుంటాను. కోపం ఎగిరిపోతుంది. ♦ నా కూతుర్ని అలా పెంచుతా! ఐదు, పదేళ్ల తర్వాత మీరు తల్లవుతారు కదా. అప్పుడు మీకు పాప కావాలా? బాబా? నాకు పాప కావాలి. బాబు ఇష్టం కాదని కాదు. పాపని ఎందుకు కోరుకుంటున్నానంటే నేను చేయలేనివన్నీ నా కూతురు చేయాలి. చాలా హ్యాపీగా ఉండాలి. ♦ ఏంటి మీరు చేయలేకపోయినవి? నా టీనేజ్‌లో నేను భయపడుతూ బతికాను. ఎవరైనా అబ్బాయిలు కామెంట్ చేస్తే, నన్ను తప్పుగా అనుకుంటారేమోనని సంకోచం. కానీ, నా కూతురు అలా భయపడకూడదు. ‘తప్పు చేసినవాడు భయపడాలి? మనం కాదు’ అని క్లియర్‌గా చెబుతాను. మా ఇంట్లో నాకు మా అమ్మానాన్న కొన్ని హద్దులు పెట్టారు. సమాజంలో పరిస్థితులకు భయపడి అలా చేశారు. నేను వాళ్లని తప్పు పట్టడంలేదు. కానీ, నా కూతురికి మాత్రం నేను లేని పోని హద్దులు పెట్టను. స్వేచ్ఛగా బతకమంటాను. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకునేంత కాన్ఫిడెన్స్‌గా పెంచుతాను. ♦ సెలబ్రిటీ కాకముందు ఎలా రియాక్ట్ అయ్యేవారు? భయపడేదాన్ని. బస్‌లో వెళుతున్నప్పుడో, పబ్లిక్ ప్లేసెస్లోనో ఎవరైనా టచ్ చేస్తే వణికిపోయేదాన్ని. ఎందుకంటే, ‘మనదే తప్పు, అందుకే ఇలా జరిగింది’ అనుకునేదాన్ని. స్టార్టింగ్ నుంచీ పేరెంట్స్ అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం వల్లే అమ్మాయిల్లో ఇలా భయం పెరుగుతుంది. అబ్బాయిలు తాకినప్పుడు ఆ అమ్మాయి మీద జాలిపడేవాళ్లు చాలా తక్కువ, అమ్మాయిదే తప్పనడానికి రెడీ అయ్యేవాళ్లు ఎక్కువ ఉంటారు. అందుకే, అబ్బాయి తప్పు చేసినా అమ్మాయి తాను తప్పు చేసినట్లుగా ఫీలవుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అమ్మాయిలు తిరగబడాలి. బుద్ధి చెప్పడం మొదలుపెడితే... తాకడానికి కాదు కదా.. కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారు. ♦ అమ్మాయిలకు బోల్డన్ని హద్దులు.. అబ్బాయిలకు కావల్సినంత స్వేచ్ఛ. అబ్బాయిలకూ హద్దులు విధిస్తే బాగుంటుంది కదా? నిజంగా బాగుంటుంది. అమ్మాయిలపై దాడులు తగ్గుతాయని నా అభిప్రాయం. ఓ అమ్మాయి ఇవి చేయాలి. ఇవి చేయకూడదు. ఇక్కడికి వెళ్లాలి, అక్కడికి వెళ్లకూడదు. సన్‌సెట్ తర్వాత, లేట్ నైట్ పార్టీలకు వెళితే అంతే సంగతులు.. అంటూ అమ్మాయిలు ఏం చేయకూడదో పెద్ద లిస్ట్ ఉంది. ఇలాంటి లిస్ట్ అబ్బాయిలకు ఇవ్వలేదు. అబ్బాయిలకూ ఇస్తే, వాళ్లు విచ్చలవిడిగా తిరగరు. లేట్ నైట్స్‌లో ఇంటి పట్టునే ఉంటారు. చాలా సమస్యలు తగ్గుతాయి. ♦ ప్రొఫెషనల్‌గా హ్యాపీ. పర్సనల్‌గా సింగిల్‌గానే ఉన్నారు? పెళ్లి గురించే అడుగుతున్నారు కదా. బాలీవుడ్లో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా చాలా సాధించాలి. ♦ మ్యారేజ్‌కి రైట్ టైమ్ అనేది ఉంటుందేమో? నా దృష్టిలో పెళ్లికి టైమ్ అంటూ లేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు చేసుకోవాలి. నాకిప్పుడు అనిపించడంలేదు. ప్రొఫెషనల్‌గా బాగా వర్క్ చేశాం అనే తృప్తి లభించాక పెళ్లి చేసుకునేంత టైమ్ ఉంటుంది. అదే నాకు రైట్ టైమ్. ♦ అంటే.. పాతిక నుంచి 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం మంచిదంటారు కదా? ఆ ఆలోచనలో మార్పు రావాలి. ఏజ్ దాటుతోంది కదా అని బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు, అది వర్కవుట్ అయితే ఓకే. ఫోర్డ్స్ మ్యారేజెస్ ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగుతాయి. అది మంచిది కాదు. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ♦ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా... ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనేంతగా ఫిజికల్ సిస్టమ్ సపోర్ట్ చేయదు? ఇది ఒకప్పటి మాట. 20 ఏళ్లల్లోనే కాదు.. 60 ఏళ్లల్లోనూ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంది. సైన్స్ పరంగా మంచి మార్పొచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది. సైన్స్, టెక్నాలజీ సపోర్ట్‌తో హ్యాపీగా తల్లి కావచ్చు. మొన్నీ మధ్యే ఓ అరవయ్యేళ్ల మహిళ తల్లయ్యారు. ♦ ఫైనల్లీ తెలుగుకి ఎందుకు దూరమయ్యారు? నేను దూరం కాలేదండి బాబూ. ప్లీజ్.. మంచి అవకాశాలివ్వండి. ఇప్పుడు నేను చేస్తున్నవాటిలో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ అనే సినిమా ఒకటి. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. నటిగా నాకు సవాల్‌గా నిలిచే క్యారెక్టర్స్ ఆశిస్తున్నా. ఎవరైనా ఇస్తే, తప్పకుండా చేస్తా. - డి.జి. భవాని -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పింక్ : అఫీషియల్ ట్రైలర్z నిడివి : 2 ని. 26 సె. హిట్స్ : 64,38,142 ‘‘ఆర్యూ ఎ వర్జిన్ మిస్ అరోరా?’’ అమితాబ్ అడిగాడు. కోర్టు బోనులో ఉంది తాప్సీ. నో.. నేను వర్జిన్ని కాదు అన్నట్టు తల ఊపింది. ‘‘అవునో, కాదో నోటితో చెప్పండి. అలా తల ఊపొద్దు’’ అన్నాడు అమితాబ్. సెక్షన్ 307 కింద అరెస్ట్ అయింది తాప్సీ. అటెంప్ట్ టు మర్డర్! అమితాబ్ అడుగుతున్నాడు. ‘‘అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. నీకూ, రాజ్వీర్కి మధ్య?’’ చెప్తోంది తాప్సీ. వాయిదాలు నడుస్తున్నాయి. అమితాబ్ నమ్ముతున్నాడు. నమ్మడు. నమ్ముతున్నాడు. నమ్మడు. ఆ లాయర్‌కి బై పోలార్ డిజార్డర్. మూడ్స్ అప్పటికప్పుడు మారిపోతుంటాయి. తను వాదిస్తున్నది తాప్సీ కోసం, ఆమె ఇద్దరు స్నేహితురాళ్ల కోసం అని మర్చిపోయి వాదిస్తుంటారు. చివరికి ఏం జరుగుతుంది? అది సినిమాలో చూడండి. ఇప్పటికైతే ఏం జరిగిందన్నది ఈ యూట్యూబ్‌లో చూడండి. ‘పికు’, ‘వికీ డోనార్’ చిత్రాలను డెరైక్ట్ చేసిన షూజిత్ సర్కార్ చేయి ‘పింక్’లోనూ ఉంది. కానీ నిర్మాతగా. సెప్టెంబర్ 16 మూవీ రిలీజ్ అవుతోంది. -
ఈ అభిమానం మరువలేను...
వరంగల్ అంటే ఎంతో ఇష్టం నగరానికి రావడం రెండో సారి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా... హీరోయిన్ తాప్సీ ‘వరంగల్ అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం ఎప్పటికీ మరువలేను. నేను రెండు సార్లు ఇక్కడకు వచ్చినా ప్రతీసారి వేల సంఖ్యలో అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు.. అయితే, వరంగల్‌లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని తెలిసినా చూడడానికి సమయం చిక్కడం లేదు. మరోసారి వీలు చూసుకుని వచ్చి అన్ని ప్రదేశాలను చూస్తాను’ అని చెప్పుకొచ్చారు సినీ హీరోయిన్ తాప్సీ. 9669 ప్రొడక్షన్ ప్రతినిధి వినోద్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆమె ఎక్స్‌క్లూజివ్‌గా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ మేరకు తాప్సీ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే... - పోచమ్మమైదాన్ ఆదరణ అపూర్వం.. వరంగల్‌కు రావడం ఇది రెండో సారి. గతంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చాను. అప్పుడు ఎంతోమంది అభిమానులు నన్ను చూసేందుకు వచ్చారు. నా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అలా వారు చూపించిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేను. అందుకే వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడున్న పర్యాటక ప్రాంతాల గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్‌తో చూడలేకపోతున్నా. మరోసారి తీరికగా వచ్చి వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం తప్పక సందర్శిస్తాను. మోడలింగ్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. 2008లో మిస్ ఇండియా కాంటెస్ట్‌లో 28 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచా. మిస్ బెస్ట్ స్క్రీన్, ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నా. డిగ్రీ పూర్తయ్యూక నీకిష్టమైన రంగంలోకి వెళ్లమని నాన్న చెప్పారు. దీంతో బీటెక్ పూర్తి చేశాక మోడలింగ్ రంగంలోకి వచ్చాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చినా వెళ్లలేదు. ఆ సమయంలోనే కె.రాఘవేంద్రరావు తన సినిమా కోసం హీరోయిన్ కోసం వెదుకుతున్నారని తెలిసి అడిషన్‌కు వెళ్లాను. నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సార్ సినిమాలో హీరోయిన్ పాత్ర దక్కడం నా లక్కీ. ఇక ఓసారి నా జీవితంలో మరిచిపోలేని సంఘటన గురించి చెప్పాలి వస్తే.. ‘గుండెల్లో గోదారి’ సినిమా షూటింగ్ కోసం పాలకొల్లు వెళ్లే సరికి అక్కడ ఎవరూ లేరు. నేను కారు దిగే సమయానికి వేల సంఖ్యలో గుమిగూడారు. నాకు అంత మంది అభిమానులు ఉన్నారని అప్పుడే తెలిసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు రాత్రయినా సరే గంటల తరబడి నిల్చుని చూసేవారు. ఆత్మవిశ్వాసంతోనే విజయం ప్రతీ ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తాననేపట్టుదల ఉండాలి. వీటికి తోడు మనం ఎంచుకున్నది మంచి మార్గమై ఉండి.. కష్టపడి తత్వం కలిగే ఉంటే విజయం తప్పక వరిస్తుంది. నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 24 సినిమాల్లో నటించాను. మరో రెండు సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
అమ్మానాన్న... ఓ కల!
కళాకారులకు భాషతో పని లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేయడమే. కానీ, పరభాషల్లో రాణించి, మాతృభాషలో ఒక్క సినిమా కూడా చేయకపోతే అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. సొంత భాషలో సినిమా వస్తే, డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ అలానే అనుకుంటున్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళాల్లో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక, పంజాబీ భాషలో అవకాశం రావడమే ఆలస్యం. ప్రస్తుతం అక్కడి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకు ఆనందంగా ఉందని తాప్సీ చెబుతూ - ‘‘పంజాబీ అమ్మాయిని కాబట్టి మా అమ్మా నాన్నలకు నేను ఒక్క పంజాబీ సినిమాలో అయినా నటించాలనేది కల. ఆ కల నెరవేర్చాలని నాకూ ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కథలు విన్నా. చాలా బాగున్నాయి. ఇప్పటికి నాలుగు భాషల్లో సినిమాలు చేశా. ఇప్పుడు పంజాబీలో కూడా కనిపిస్తే.. నటిగా, అమ్మానాన్నల కల నెరవేర్చిన కూతురిగా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు. -
బాక్సాఫీస్ టు బిజినెస్ వరల్డ్
తమన్నా స్వయంగా డిజైన్ చేసిన చెవి దిద్దులు మార్కెట్లోకి వస్తే... అవి హాట్కేక్లే! తాప్సీ ఈవెంట్ మేనేజర్‌గా మారితే... ఆమెకు ఈవెంట్స్ బాధ్యత ఇవ్వనివాళ్ళుంటారా! కాజల్ అగర్వాల్, ఆమె చెల్లెలు నిషా నగల వ్యాపారం మొదలుపెడితే కొననివాళ్లుంటారా..! ఇప్పటి దాకా మగాళ్ల రాజ్యమైన ఈ రంగాల్లో వీళ్లిప్పుడు జెండా పాతారు. అవును... సెలబ్రిటీలు ఏం చేసినా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. వాళ్లకున్న క్రేజ్ అలాంటిది. అయితే, మేల్ డామినేషన్ ఉన్న రంగాల్లోనూ కొంతమంది కథా నాయికలు అడుగుపెట్టి, జేజేలు అందుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా చేస్తున్న ‘వైట్ అండ్ గోల్డ్’ నగల వ్యాపారానికి బోల్డంత డిమాండ్ ఉంది. చెల్లెలు షగున్‌తో కలిసి తాప్సీ చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాజల్, నిషా అగర్వాల్ చేస్తున్న ‘మార్ సాలా’ నగల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల చందంగా ఉందట. వీళ్లే కాకుండా... రీసెంట్గా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ల జాబితాలో... సంజన, ప్రణీత, రకుల్ ప్రీత్‌సింగ్... ఇలా ఎందరెందరో! ఈ అందగత్తెలు చేపట్టిన వ్యాపారం కబుర్లు ఏమిటంటే... టేస్టీ టేస్టీ ఫుడ్.. సో గుడ్! మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే హాయిగా ఉంటుంది. అన్ని పనులూ తేలికగా చేసుకుని అనుకున్నవన్నీ సాధించవచ్చన్నది ప్రణీత అభిప్రాయం. అందుకే పోషక విలువలున్న ఆహారం తీసుకుంటారామె. అందరికీ అలాంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇటీవల ఆమె బెంగళూరులో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. టేస్టీ టేస్టీ ఫుడ్ వడ్డించడమే ఈ రెస్టారెంట్ లక్ష్యం అని ప్రణీత అంటున్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో బిజినెన్ ఉమన్‌గా మారాలని ఆమె అనుకుంటున్నారు. రైట్ టైమ్ చూసి, ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. బాపూ బొమ్మ హోటల్ అంటే గిరాకీ ఉండకుండా ఉంటుందా? రిమ్ జిమ్... రకుల్ ప్రీత్ సింగ్ మెరుపు తీగలా ఉంటారు. అలా ఉండడం కోసం ఆమె జిమ్ చేస్తారు. సమాజంలో పెరిగిన ఆరోగ్య, సౌందర్య స్పృహ రీత్యా ఇప్పుడు సినిమా తారలు మాత్రమే కాకుండా అందరూ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తు న్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రకుల్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించారు. అయితే సంజన, ప్రణీత తమ సొంత ఊళ్లో వ్యాపారం మొదలుపెడితే రకుల్ మాత్రం తన సొంత ఊరు ఢిల్లీలో కాక హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ‘ఎఫ్ 45’ పేరుతో గచ్చిబౌలిలో ఫిట్నెస్ సెంటర్ ఆరంభించారు. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో అగ్రనాయికగా దూసుకెళుతున్న రకుల్ సొంతంగా పెట్టారు కాబట్టి, ఈ జిమ్ సెంటర్‌కు వెళ్లే అభిమానుల సంఖ్య బాగానే ఉంటుందని చెప్పొచ్చు. బమ్చిక్ బమ్చిక్ చెయ్యి బాగా..! శరీరం, మనసు.. రెండూ తేలికగా ఉండాలంటే యోగాకి మించిన మంచి సాధనం లేదంటారు. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంజన బ్యూటీ సీక్రెట్ కూడా యోగానే! యోగా వల్ల మెరుగైన ఫలితాలు పొందిన సంజన నలుగురికీ మేలు చేయాలనుకున్నారు. అందుకే, తన సొంత ఊరు బెంగళూరులోని కోరమంగళలో ‘అక్షర్ పవర్ యోగా అకాడమీ’ పేరుతో ఓ యోగా సెంటర్ ప్రారంభించారు. సంజన అభిమానులు మాత్రమే కాదు.. ఆమెలాగా స్లిమ్‌గా ఉండాలనుకునేవాళ్లందరి దృష్టి ఇప్పుడీ యోగా సెంటర్ మీదే! ఎంచక్కా ‘బమ్ చిక్ బమ్ చిక్ చెయ్యి బాగా...’ అంటూ యోగా చేసేసి ఈ సెంటర్లో అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందవచ్చని సంజన అంటున్నారు. జనరల్‌గా సినిమా తారలు ఏదైనా బిజినెస్ మొదలుపెడితే అవకాశాలు లేకే అలా చేస్తున్నారని అనుకోవడం సహజం. కానీ, రకుల్, ప్రణీత, సంజనల చేతి నిండా సినిమాలున్నాయి. అంత బిజీలోనూ వాళ్లిలా బిజినెస్ వైపు మొగ్గడానికి చాలా కారణాలున్నాయి. సినిమా కెరీర్ ఎన్నేళ్ళు ఉంటుందో గ్యారెంటీ లేదు కాబట్టి, ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రత్యామ్నాయంగా ఒక బిజినెస్ కెరీర్‌ని స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో గుండెల మీద చెయ్యేసుకుని మిగతా జీవితాన్ని గడిపేయొచ్చు కదా! నేటి తరం తారలు ఇలా వ్యాపారవేత్తలుగా మారడానికి అది కూడా కారణం అయ్యుంటుంది. అఫ్కోర్స్... వాళ్ళకున్న అభిరుచి కూడా దానికి కలగలిసిందన్నది కాదనలేని విషయం. -
బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!
‘‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు. ‘ఫలానా సినిమాలో గ్లామర్ పరంగా కొంచెం హద్దు దాటినట్లున్నారు?’ అనే ప్రశ్నకు కథానాయికలు సర్వసాధారణంగా చెప్పే జవాబు అది. ఒకప్పుడు నిండైన చీరకట్టులో కనిపించిన తారలు.. అప్పుడప్పుడు మాత్రం కురచ గౌనుల్లోనూ, ఉల్లిపొర లాంటి చీరల్లోనూ కనువిందు చేసేవారు. ఇప్పుడు మామూలుగానే ట్రెండ్ మారింది. దాంతో, బట్టల నిడివి తగ్గడం సాధారణమైంది. నడుము, నాభి చూపించడం సర్వసాధారణమైంది. నిన్న మొన్నటివరకూ ముందు వైపు అందాలనే ప్రదర్శించిన తారలు ఇప్పుడు బ్యాక్ పై దృష్టి పెడుతున్నారు. పాటల్లో కొన్ని సెకన్ల పాటు వీపు భాగం చూపిస్తున్న తారలు విడిగా అవార్డుల ఫంక్షన్లలో ఇంకా రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ స్టయిల్లో పొడవాటి గౌనుల్లో దర్శనమిస్తున్నారు. వీపు అంతా కనిపించేలా వెనక భాగంలో దాదాపు నడుము నుంచి మాత్రమే బట్టలు ఉండేలా ఆ గౌన్లను డిజైన్ చేయించుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వీపు అందాలను చూపించి, వార్తల్లో నిలిచినవాళ్లల్లో తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, రాశీ ఖన్నా తదితరులు ఉన్నారు. వీళ్ల బ్యాక్ బ్యూటీ చూడకుండా, వెనకెనకే ఫాలో కాకుండా ఉండడం కుర్రకారుకు కష్టమే. ఆ సంగతి అలా ఉంచితే... ఇలా పొదుపైన బట్టలు వాడుతున్న తారలు పిసినారులని మాత్రం అనుకోకండి. ఒక్కో గౌను ఖరీదు మినిమమ్ 50 వేల రూపాయల నుంచి మొదలవుతుంది. కొన్నిటి ధర అయితే, లక్ష పైగానే ఉంటుందట -
కాంచన హిట్‌తో తాప్సీ దశ తిరిగిందా ?
-
షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ!
కథానాయికలు లఘు చిత్రాల్లోనటించడం అనేది ఇప్పుడో ట్రెండ్ అయిపోయేటట్టు కనిపిస్తోంది. ఇటీవలే రాధికా ఆప్టే ‘అహల్య’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ లఘు చిత్రం యూ ట్యూబ్‌లో భారీ హిట్లు సాధించి, సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ జాబితాలో తాప్సీ కూడా చేరనున్నారు. ఆమె ఓ హిందీ లఘు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ‘పాన్‌సింగ్ తోమర్’, ‘బుల్లెట్ రాజా’ చిత్రాల దర్శకుడు తిగ్మాంషు దూలియా ఇటీవల ఆమెను కలిసి, ఓ లఘు ప్రేమకథా చిత్రంలో నటించమని అడిగారు. ఈ కథ నచ్చి. తాప్సీ నటించడానికి అంగీకరించారు. దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘తిగ్మాంషుతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అందుకే ఆయన ఈ లఘు చిత్రకథ గురించి చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. కథ కూడా చాలా బాగుంది’’ అని తెలిపారు. ముంబయ్ పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ లఘు చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరపనున్నారు. -
ఆగస్టు 1న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: తాప్సీ (నటి), అరుణ్‌లాల్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఇది శనైశ్చరునికి సంబంధించినది. శని స్థిరత్వానికి, ఆయుష్షుకు, వృత్తికీ కారకుడు. అందువల్ల వీరికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరి పుట్టిన తేదీ 1. ఇది సూర్యునికి సంబంధించినది కాబట్టి కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. లక్కీనంబర్లు: 1,4,6,8 లక్కీ కలర్స్: బ్లాక్, వయొలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. లక్కీడేస్: ఆది, బుధ, శనివారాలు. సూచనలు: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేయడం, - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
విదేశాల్లో కూడా ఆ సినిమా విడుదల
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ థ్రిల్లర్ సినిమా 'ఖాన్'ను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి భాషలైన స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వంటి భాషల్లో కూడా తర్జుమా చేయనున్నారు. తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్పగా ఆధరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మొత్తం పది అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో తాప్సీ, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ అంతర్జాతీయంగా విడుదల చేసే చిత్రంలో పాటలు ఉండవని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే దర్శకుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
తాప్సీ సరికొత్త బిజినెస్!
‘సన్నాఫ్ సత్యమూరి’్తలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. కానీ అందాల కథానాయిక తాప్సీ మాత్రం తన నిజజీవితంలోనే వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే తన స్నేహితులతో కలిసి ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు తాప్సీ. ఆ సంస్థ పక్షాన మొదటి వేడుకను కూడా ఇటీవలే నిర్వహించారు. హీరోయిన్గా ఒకవైపు, వెడ్డింగ్ ప్లానర్‌గా మరో వైపు రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న తాప్సీ ఆ విశేషాలు చెబుతూ - ‘‘సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాపార రంగంలోకి దిగడం చాలా ఆనందంగా ఉంది. నటిగానే కాకుండా వేరే రంగంలో కూడా నాకంటూ గుర్తింపు తెచ్చు కోవాలనుకున్నాను. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇలా వ్యాపారం లోకి అడుగు పెట్టానని చాలామంది అనుకుంటు న్నారు. కానీ, అందులో వాస్తవం లేదు. నాకిప్పుడు అవకాశాలకు కొదవ లేదు. కేవలం నా సృజనాత్మకతను మరో రంగంలో చూపించాలనేదే నా ప్రయత్నం’’ అన్నారు. -
తాప్సీ దశ మారుతుందా..?
-
త్రిషకి పోటీగా తాప్సీ
-
అతిథి పాత్రలో తాప్సీ
-
ప్రొడ్యూసర్‌గా మారనున్న తాప్సీ ?
-
ఆదాయం @ ఆన్లైన్
ఆదాయాలు అరకొరగా ఉన్నా.. ఉప్పు, పప్పు ధరల నుంచి పండుగాడి స్కూలు ఫీజుల దాకా అన్నీ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. ధరల భారాన్ని తట్టుకునేందుకు ఒక్క ఉద్యోగం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే అదనపు ఆదాయాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాల్సి ఉంటోంది. ఇంటర్నెట్ విప్లవంతో ఇలాంటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వస్తున్నాయి. కాస్త నైపుణ్యం.. సృజనాత్మకత ఉంటే ఆన్లైన్లో ఆదాయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి.. అనువాదాలు, ఐటీ పరమైన సేవలు, న్యాయపరమైన సలహాలు మొదలైన వాటికోసం వివిధ సంస్థలు ప్రస్తుతం ఆన్లైన్ మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇందుకు మెరుగ్గానే ముట్టచెబుతున్నాయి కూడా. ఇలాంటి జాబ్స్ కోసం ఇల్యాన్స్డాట్కామ్, ఒడెస్క్డాట్కామ్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నమోదు చేయించుకుని, ఆయా అంశాల్లో మీ నైపుణ్యాన్ని నిరూపించే కొన్ని పరీక్షలు ప్యాసయితే చాలు. కాంట్రాక్టరు/ఫ్రీలాన్సర్ల జాబితాలో మీ పేరును కూడా చేరుస్తుంది వెబ్సైటు. మీ ప్రొఫైల్, నైపుణ్యాలు నచ్చితే క్లయింట్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. గంటకి ఇంత చొప్పున లేదా ప్రాజెక్టుకు ఇంత చొప్పున అని వర్క్ దక్కించుకోవచ్చు. కాస్త ఎక్కువ కష్టపడగలిగితే, క్లయింట్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంటే మరిన్ని ఎక్కువ ప్రాజెక్టులు, మరింత ఆదాయం ఆర్జించవచ్చు. అయితే, సర్వే ఫారంలు నింపితే చాలు డాలర్లలో సంపాదించవచ్చు, ముందస్తుగా కొంత కడితే రెగ్యులర్‌గా ఆదాయం వచ్చే ప్రాజెక్టులు ఇస్తాం అంటూ అనేక వెబ్సైట్లు ఊరిస్తుంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ-ట్యూషన్స్.. బోధన అనుభవం ఉండి, వివిధ సబ్జెక్టులపై పట్టు గానీ ఉంటే ఆన్‌లైన్‌లోనూ పాఠాలు చెప్పే ప్రాజెక్టులు దక్కించుకోవచ్చు. 2షన్డాట్నెట్, ట్యూటర్విస్టాడాట్కామ్ వంటి వెబ్సైట్లలో ఆన్లైన్ ట్యూటర్‌గా పేరు నమోదు చేయించుకోవచ్చు. ఏయే సబ్జెక్టుల్లో మీకు అనుభవం ఉంది, ఏయే తరగతులకు చెప్పగలరు, అనుభవం, మీకు వీలుండే సమయం, ఎంత రెమ్యూనరేషన్ ఆశిస్తున్నారు వంటి అంశాలను పొందుపర్చాలి. వీటిని ధ్రువీకరించుకున్నాక.. సదరు సైట్ మీ పేరును పోర్టల్‌లో ఉంచుతుంది. ఆసక్తి గల విద్యార్థులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒక్కసారి పట్టు దొరికాక.. వివిధ ప్రాంతాల్లో ఉండే పలువురు విద్యార్థులకు ఏకకాలంలో బోధించడం ద్వారా మరింత ఎక్కువగా సంపాదించడానికి వీలవుతుంది. పుస్తకాల పబ్లిషింగ్ .. రచనా వ్యాసంగంపై ఆసక్తి ఉంటే మీరు రాసే వాటిని ఆన్లైన్లో ప్రచురించి, వాటి అమ్మకాల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. ఇలాంటి వాటి పబ్లిషింగ్ కోసం అమెజాన్ సంస్థ కిండిల్ డెరైక్ట్ పబ్లిషింగ్ పేరుతో ఉచిత సర్వీసు అందిస్తోంది. దీంట్లో నమోదు చేసుకుంటే కిండిల్ బుక్‌స్టోర్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాటి అమ్మకాల ద్వారా రాయల్టీలను అందుకోవచ్చు. దేశాలను బట్టి 35-70 శాతం మేర రాయల్టీ ఉంటుంది. ఫోటోల అమ్మకం.. ఫోటోగ్రఫీ మీ హాబీ అయితే దాన్ని సైతం ఆన్లైన్లో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఐస్టాక్ఫొటోడాట్కామ్, షటర్పాయింట్ వంటి వెబ్సైట్లలో మీరు తీసే ఫొటోలను ఉంచవచ్చు. అవి అమ్ముడైన ప్రతిసారి 15-85 శాతం దాకా రాయల్టీ కింద అందుకోవచ్చు. విక్రయాలకు సంబంధించిన ఫొటోల ఎంపికపై ఆయా వెబ్సైట్లు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుంటాయి. నాణ్యత బాగుండి, మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత ఎక్కువగా ఫొటోలు ఉంటే అంత ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి. ఆన్లైన్ షాపు .. హస్తకళలు, మరెక్కడా ఎక్కువగా దొరకని ప్రత్యేక ఉత్పత్తులు లాంటివాటితో ఆన్లైన్లో షాపు తెరవొచ్చు. ఈబేడాట్ఇన్, అమెజాన్‌డాట్‌ఇన్, ఇండీబజార్డాట్కామ్ వంటి వెబ్సైట్ల ద్వారా విక్రయించవచ్చు. వీటిలో నమోదు ప్రక్రియ సులువుగానే ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాలను వెరిఫై చేసుకున్న తర్వాత స్టోర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి లాంటి విషయాల గురించి సదరు వెబ్సైటు తగిన సహాయం అందిస్తుంది. యాప్స్ తయారీ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యాప్స్‌కి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాప్స్ ఎలా తయారు చేయాలన్న దానిపై ఆన్లైన్లో పాఠాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. యాప్‌ను తయారు చేసే గూగుల్ ప్లే, విండోస్ ఫోన్ స్టోర్ వంటి వాటిలో ఉంచవచ్చు. నిర్దిష్ట ఫీజులేమైనా ఉంటే మినహాయించుకుని డౌన్లోడ్లను బట్టి సదరు సైటు మీకు చెల్లింపులు జరుపుతుంది. అయితే, లక్షల కొద్దీ యాప్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి కనుక.. మీ యాప్ వైవిధ్యంగా ఉంటేనే నిలదొక్కుకోగలుగుతుంది. డొమైన్లు కొనడం.. అమ్మడం .. మిగతా వస్తువులు కొని అమ్మినట్లే.. డొమైన్ నేమ్స్‌ని కూడా కొని, అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇప్పటికే చాలా మటుకు నేమ్స్ అమ్ముడైపోయినప్పటికీ.. కొత్త రకం వ్యాపారాలు, వెబ్సైట్లు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. కాస్త క్రియేటివ్‌గా ఆలోచించగలిగి, మంచి డొమైన్ నేమ్స్‌ను పట్టుకోగలిగితే చాలు. ఆ నేమ్‌కి ఉన్న డిమాండ్‌ను బట్టి కొన్న దానికి అనేక రెట్లు ఎక్కువ రేటుకు అమ్మి లాభాలు గడించవచ్చు. ఉదాహరణకు.. వెకేషన్రెంటల్స్డాట్కామ్ అనే డొమైన్‌ని హోమ్ఎవే అనే సంస్థ దాదాపు రూ. 175 కోట్లకు కొనుక్కుంది. పోటీ కంపెనీకి ఈ నేమ్ దక్కకూడదనే దీన్ని కొనుక్కున్నట్లు సదరు సంస్థ చెప్పుకొచ్చింది. ప్రకటనలతో ఆదాయం .. మీకంటూ బ్లాగు, వెబ్సైటు లేదా యూట్యూబ్‌లో చానల్ని గానీ ప్రారంభిస్తే.. వాటిల్లో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. ఇందుకోసం గూగుల్ యాడ్‌సెన్స్‌లో అకౌంటు తీసుకోవాలి. ఎంత ఎక్కువ మంది మీ బ్లాగ్ లేదా వెబ్సైటును సందర్శిస్తే.. మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇక వీటిల్లో ఏం రాయాలంటారా.. మీకు తెలిసినవీ, మీకు నచ్చిన విషయాల గురించి రాయొచ్చు. యూట్యూబ్‌లో ఆసక్తికరమైన వీడియోలు రూపొందించి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేయడం ఒక్కటే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వాటిని చూసేలా ప్రమోట్ కూడా చేయాలి. యూట్యూబ్ సగటున సుమారు 1,000 వ్యూస్‌కి 10 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా భారీగా ఆర్జిస్తున్న వారి సంఖ్య బాగానే ఉంటోంది. ఎల్రూబియస్ఓఎంజీ పేరుతో యూట్యూబ్ చానల్ని నిర్వహించే 24 ఏళ్ల స్పానిష్ వీడియో గేమ్ కామెంటేటర్.. దీని ద్వారా ఏటా దాదాపు రూ. 24 కోట్ల దాకా అందుకుంటున్నాడు. -
చిన్ననాటి కోరిక ఆరంభంతో తీరింది
కలలు కనడం, ఆశలు పెంచుకోవడం మానవ సహజం. ముఖ్యంగా కౌమారదశలో అమ్మాయిలు భవిష్యత్ గురించి చాలా ఊహించుకుంటారు. ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అవి నెరవేరకపోతే ఆ నిరాశ జీవితాంతం ఏదో ఒక మూల దాగి ఉంటుంది. నటి తాప్సీకి అలాంటి తీరని కోరిక మరో విధంగా నెరవేరిందట. ఈ ఉత్తరాది భామ తమిళంలో ఆడుగళం చిత్రంతో పరచయమైంది. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టినా ఆ తర్వాత నటించిన చిత్రాలేవీ ఆమెకు గుర్తింపు నివ్వలేకపోయాయి. దీంతో తెలుగు, హిందీ చిత్రాలపై దృష్టి సారించింది. తాజాగా ఆరంభం చిత్రంతో కోలీవుడ్‌కు వచ్చింది. ఈ చిత్రం హిట్ అయినా ఆ క్రెడిక్ట్ అంతా మరో హీరోయిన్ నయనతారనే తన్నుకుపోయింది. ఈ చిత్రం ద్వారా తన చిరకాల కోరిక నెరవేరిందని అంటోంది తాప్సీ. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ తన తొలి చిత్రం ఆడుగళంతోనే తమిళ ప్రేక్షకులు ఆదరించారని పేర్కొంది. మళ్లీ ఇప్పుడు ఆరంభం చిత్రంతో వచ్చానని అంది. తనపై వాళ్ల ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొంది. జీవితంలో కోరుకున్నది జరగలేదన్న చింత ఉందా? అన్న ప్రశ్నకు తాను చదువు పూర్తి చేసి ఏదో ఒక పత్రికలో విలేకరిగా పనిచేసి పాపులర్ అవ్వాలని ఆశించానంది. ఆ కల తారుమారై మోడలింగ్, నటన అంటూ జీవిత పయనం సాగుతోందని పేర్కొంది. అప్పటి తన కోరిక ఆరంభం చిత్రం ద్వారా నెరవేరిందని చెప్పింది. ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రను ఎంతగానో ఆస్వాదిస్తూ నటించానని తెలిపింది. నిజ జీవితంలో తీరని ఆశ తెర జీవితంలోనైనా నెరవేరడం సంతోషంగా ఉందని తాప్సీ సంతృప్తిని వ్యక్తం చేసింది. -
‘ఆట ఆరంభం’ ఆడియో వేడుక
అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఆరంభం’. విష్ణువర్దన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట పెద్ద హిట్. ఈ సినిమాను ‘ఆట ఆరంభం’ పేరుతో తెలుగులోకి అనువదించారు డా. జి.శ్రీనుబాబు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. -
హాలీవుడ్ చిత్రంలో ఓ పాత్రకు డబ్బింగ్
ఉత్తరాది భామ తాప్సీ దక్షిణాదిన ఏ స్థాయిలో రాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చేతిలో మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇటీవల ఓ అరుదైన అవకాశం వచ్చింది. హాలీవుడ్ చిత్రం ‘రిడ్డిక్’లో కటీ సాకాఫ్ పోషించిన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం అది. విన్ డీసిల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మూడు భాషల్లో ఎవరైనా ప్రముఖ తారతో కటీ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని భావించారట. తెలుగు, తమిళ భాషల్లో తాప్సీకి కావల్సినంత ప్రాచుర్యం ఉంది. ఈ మధ్యకాలంలో నటిస్తున్న తెలుగు చిత్రాల్లో తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారామె. తెలుగు ఎలాగూ చెప్పారు కాబట్టి.. తమిళ్ చెప్పడం కష్టమేం కాదు. ఇక, ఈ బ్యూటీ పుట్టి, పెరిగింది ఢిల్లీలో కాబట్టి హిందీ సునాయాసంగా మాట్లాడేస్తారు. ‘చష్మే బద్దూర్’ ద్వారా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తాప్సీతో డబ్బింగ్ చెప్పించాలనుకుని ఉంటారు. ఇలాంటి అవకాశం రావడం ఇదే మొదటిసారి అని, కచ్చితంగా మూడు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పగల సమర్థత తనకుందని తాప్సీ అంటున్నారు. అయితే షూటింగ్స్ వరుసగా ఉండటంతో డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలా? అని ఆలోచిస్తున్నారట. -
గోపిచంద్, తాప్సిల సాహసం