నాకు నలుగురు హీరోలు | I have four heroes - tapsi | Sakshi
Sakshi News home page

నాకు నలుగురు హీరోలు

Published Thu, Jul 20 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

నాకు నలుగురు హీరోలు

నాకు నలుగురు హీరోలు

తాప్సీ

‘‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాల్లో నాకు ఒకే హీరో ఉంటాడు. కానీ, ‘ఆనందోబ్రహ్మ’ సినిమాలో మాత్రం నాకు నలుగురు హీరోలున్నారు. తొలిసారి నేను చేసిన హారర్‌ కామెడీ చిత్రమిది. ప్రతి పాత్రకూ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుంది’’ అని తాప్సీ పన్ను అన్నారు. తాప్సీ పన్ను, శ్రీనివాస్‌ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘తాగుబోతు’ రమేష్, ‘షకలక’ శంకర్‌ ప్రధాన పాత్రల్లో మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. విజయ్‌ చిల్లా మాట్లాడుతూ– ‘‘ఇదొక హారర్‌ కామెడీ జోనర్‌ అని దర్శకుడు చెప్పారు. కానీ, కథలో మనుషులను చూసి దెయ్యం భయపడుతుంది అనే పాయింట్‌ నాకు నచ్చి, సినిమా తీశా. సాంకేతికపరంగా సినిమా బావుంటుంది. ఆగస్ట్‌ 18న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యాలను పెద్దగా నమ్మను. అందుకే హారర్‌ కామెడీ సినిమా కథ రాయగలిగా. సాధారణంగా దెయ్యాలకు మనుషులు భయపడుతుంటారు. కానీ, దెయ్యాలు మనుషులకు భయపడితే? ఎలా ఉంటుందనే పాయింట్‌తో కథ రాశా. కిషోర్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, రమేష్‌ ఒకర్ని మించి ఒకరు బాగా చేశారు’’ అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘తాగుబోతు’ రమేష్, ‘షకలక’ శంకర్, కెమెరామెన్‌ అనీష్‌ తరుణ్‌ కుమార్, ఎడిటర్‌ శ్రవణ్‌ కటికనేని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement