అదే లేకుంటే అవకాశాలు ఎందుకొస్తాయి
చిత్ర పరాజయానికి నేనా కారణం అంటూ నటి తాప్సీ దక్షిణాది దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ ఢిల్లీ అమ్మడికిప్పుడు ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. వచ్చినా నటించడానికి భయం వేస్తోంది అంటున్నారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం చిత్రాలు చేతి నిండానే ఉన్నాయి. అమితాబ్‌బచ్చన్ తో కలిసి నటించిన పింక్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో హిందీ చిత్ర పరిశ్రమలో తాప్సీ సినీ పయనం చాలా జోరుగా సాగుతోంది. దీంతో దక్షిణాది చిత్ర దర్శకులపై అభాండాలు వేసేంత ధైర్యం వచ్చేసింది. ఇంతకీ ఈ భామ ఏమంటుందో చూద్దామా. దక్షిణాది చిత్ర దర్శక నిర్మాతలు నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వలేదు. గ్లామర్ పాత్రలే ఇచ్చారు.
చిత్రం పరాజయం పాలైతే బాధ్యులెవరు? నాకు రాశిలేని నటి అనే ముద్రవేశారు. నాలోని నటనా ప్రతిభను నిరూపించుకునే పాత్ర ఒక్కటీ రాలేదు. అందుకే నేను బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాను. హిందీలో నేను నటించిన పింక్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నాకూ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకరిని తిట్టడం, నేరం మోపడం చాలా సులభం. అందుకు ముందు కారణాన్ని ఆలోచించడం మరచిపోతున్నారు. నన్ను రాశిలేని నటిగా ఇక్కడ చిత్రీకరించినా, హిందీలో అరడజను చిత్రాలున్నాయి. చేతి నిండా సంపాదిస్తున్నాను. తాను రాశి లేని నటినైతే బాలీవుడ్‌లో ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నిస్తోందీ భామ.