చిన్ననాటి కోరిక ఆరంభంతో తీరింది
చిన్ననాటి కోరిక ఆరంభంతో తీరింది
Published Thu, Nov 28 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
కలలు కనడం, ఆశలు పెంచుకోవడం మానవ సహజం. ముఖ్యంగా కౌమారదశలో అమ్మాయిలు భవిష్యత్ గురించి చాలా ఊహించుకుంటారు. ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అవి నెరవేరకపోతే ఆ నిరాశ జీవితాంతం ఏదో ఒక మూల దాగి ఉంటుంది. నటి తాప్సీకి అలాంటి తీరని కోరిక మరో విధంగా నెరవేరిందట. ఈ ఉత్తరాది భామ తమిళంలో ఆడుగళం చిత్రంతో పరచయమైంది. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టినా ఆ తర్వాత నటించిన చిత్రాలేవీ ఆమెకు గుర్తింపు నివ్వలేకపోయాయి. దీంతో తెలుగు, హిందీ చిత్రాలపై దృష్టి సారించింది.
తాజాగా ఆరంభం చిత్రంతో కోలీవుడ్‌కు వచ్చింది. ఈ చిత్రం హిట్ అయినా ఆ క్రెడిక్ట్ అంతా మరో హీరోయిన్ నయనతారనే తన్నుకుపోయింది. ఈ చిత్రం ద్వారా తన చిరకాల కోరిక నెరవేరిందని అంటోంది తాప్సీ. దీని గురించి ఈ బ్యూటీ తెలుపుతూ తన తొలి చిత్రం ఆడుగళంతోనే తమిళ ప్రేక్షకులు ఆదరించారని పేర్కొంది. మళ్లీ ఇప్పుడు ఆరంభం చిత్రంతో వచ్చానని అంది. తనపై వాళ్ల ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొంది.
జీవితంలో కోరుకున్నది జరగలేదన్న చింత ఉందా? అన్న ప్రశ్నకు తాను చదువు పూర్తి చేసి ఏదో ఒక పత్రికలో విలేకరిగా పనిచేసి పాపులర్ అవ్వాలని ఆశించానంది. ఆ కల తారుమారై మోడలింగ్, నటన అంటూ జీవిత పయనం సాగుతోందని పేర్కొంది. అప్పటి తన కోరిక ఆరంభం చిత్రం ద్వారా నెరవేరిందని చెప్పింది. ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రను ఎంతగానో ఆస్వాదిస్తూ నటించానని తెలిపింది. నిజ జీవితంలో తీరని ఆశ తెర జీవితంలోనైనా నెరవేరడం సంతోషంగా ఉందని తాప్సీ సంతృప్తిని వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement