ఈ డేట్ గుర్తు పెట్టుకోండి! | Taapsee's Female-oriented action movie 'Nam Shabana' | Sakshi
Sakshi News home page

ఈ డేట్ గుర్తు పెట్టుకోండి!

Published Tue, Nov 29 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

ఈ డేట్ గుర్తు పెట్టుకోండి!

ఈ డేట్ గుర్తు పెట్టుకోండి!

మార్చి 31, 2017... గుర్తు పెట్టుకోండి. నాలుగు నెలల ముందే మేము కర్చీఫ్ వేస్తున్నామంటున్నారు తాప్సీ. ఈ తేదీపై కర్చీఫ్ వేయడం ఏంటి అనుకుంటున్నారా! తాప్సీ నటిస్తున్న ఫిమేల్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ ‘నామ్ షబానా’. ఈ చిత్రాన్ని వచ్చే మార్చి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బబ్లీ లుక్స్, గ్లామర్ డాల్ ఇమేజ్‌తో సౌత్‌లో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీ, హిందీలో నటించిన అక్షయ్‌కుమార్ ‘బేబీ’తో తనలోని యాక్షన్ యాంగిల్ చూపించారు. ఇక, ‘బేబీ’కి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘నామ్ షబానా’లో ఆమెదే మెయిన్ రోల్ కనుక, యాక్షన్ గాళ్‌గా విశ్వరూపం చూపిస్తానంటున్నారు. మీరు ఫొటోలో చూస్తున్నది... ఈ  చిత్రంలో తాప్సీ ఫస్ట్ లుక్. ఇందులో అక్షయ్‌కుమార్ అతిథి కంటే కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement