అమ్మానాన్న... ఓ కల! | tapsi dream is acting in panjabi movie | Sakshi
Sakshi News home page

అమ్మానాన్న... ఓ కల!

Published Sat, Mar 19 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

అమ్మానాన్న... ఓ కల!

అమ్మానాన్న... ఓ కల!

కళాకారులకు భాషతో పని లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేయడమే. కానీ, పరభాషల్లో రాణించి, మాతృభాషలో ఒక్క సినిమా కూడా చేయకపోతే అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. సొంత భాషలో సినిమా వస్తే, డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ అలానే అనుకుంటున్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళాల్లో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

హిందీలో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక, పంజాబీ భాషలో అవకాశం రావడమే ఆలస్యం. ప్రస్తుతం అక్కడి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకు ఆనందంగా ఉందని తాప్సీ చెబుతూ - ‘‘పంజాబీ అమ్మాయిని కాబట్టి మా అమ్మా నాన్నలకు నేను ఒక్క పంజాబీ సినిమాలో అయినా నటించాలనేది కల. ఆ కల నెరవేర్చాలని నాకూ ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కథలు విన్నా. చాలా బాగున్నాయి. ఇప్పటికి నాలుగు భాషల్లో సినిమాలు చేశా. ఇప్పుడు పంజాబీలో కూడా కనిపిస్తే.. నటిగా, అమ్మానాన్నల కల నెరవేర్చిన కూతురిగా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement