Punjabi film
-
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాదిలో పలువురు సీనియర్ నటులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ప్రముఖ పంజాబీ నటుడు, కమెడియన్ అమృత్ పాల్ చోటు కన్నుమూశారు. పంజాబీ సినిమాల్లో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో పంజాబీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని పంజాబీ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమృత్ పాల్ చోటూ సర్దార్జీ, సర్దార్ జీ- 2తో పాటు పలు చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు సంపాదించారు. ఆయన పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. అమృత్ పాల్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నేను చనిపోయాననడంతో తీవ్రమైన భయానికి గురయ్యా.. నటి ఆవేదన
ప్రముఖ పంజాబీ నటి నికిత్ ధిల్లాన్ సోషల్ మీడియా ఖాతా ఇటివలే హ్యాకింగ్‌కు గురైంది. ఆమె ఖాతాలో హ్యాక్ చేసిన ఓ దుండగుడు నటి చనిపోయిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ఈ వార్త విని నటి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో అత్యంత భయానక పరిస్థితి ఎదురైందన్నారు. కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారని నటి నికిత్ ధిల్లాన్ వివరించింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో.. 'మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి గోప్యతను అనుమతించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని రాసి ఉంది. ' హ్యాకర్ పోస్ట్ చేశారు. నికిత్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'మా అమ్మమ్మ భటిండాలో నివసిస్తోంది. ఎవరో ఫోన్ చేసి నేను చనిపోయారని చెప్పారని తెలిసింది. వెంటనే ఆమె మా అమ్మని పిలిచి తీవ్రంగా ఏడ్చింది. ఆమె మానసికంగా కుంగిపోయింది. మేమంతా ఏం జరిగిన విషయం ఆమె వివరించినా ఓదార్చలేకపోయాం. హ్యాకింగ్, సోషల్ మీడియా గురించి ఆమెకు అర్థం కాలేదు. ఆమె వయసు రీత్యా మేం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంది. ఈ వార్త ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. మరుసటి రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది'అంటూ ధిల్లాన్ భయానక పరిస్థితిని వివరించారు. ఆమె మాట్లాడుతూ.. 'నా కలలో కూడా ఇంత దూరం వెళతారని నేను ఊహించలేదు. ఇలాంటి పరిస్థితికి ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది భావించి ఉంటారు. కానీ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంత షాక్‌కు గురయ్యారో నాకు మాత్రమే తెలుసు.'అని వాపోయింది పంజాబీ నటి. దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నా ఫేస్బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనప్పుడు మొహాలీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశా. అప్పుడు వారు నాకు ఎలాంటి సాయం చేయలేదు. కాల్ స్క్రీన్ షాట్ కూడా సైబర్ సెల్‌కు సమర్పించినా ఇప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది నటి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ గురి కావడంతో ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ' అని వాపోయింది. View this post on Instagram A post shared by Nikeet Dhillon (@nikeetdhillon) -
తొలి పరిచయం!
జయప్రద తొలి పరిచయానికి శ్రీకారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ., మలయాళం, హిందీ, భోజ్ పురి.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన జయప్రద ఇప్పుడు తొలి పరిచయం ఏంటీ? అనుకోవచ్చు. ఆమె పంజాబీ తెరకు పరిచయం కానున్నారు. జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అమితాబ్ బచ్చన్, జయప్రద కాంబినేషన్లో ‘ఆజ్ కా అర్జున్’ (1990), రజనీకాంత్, ప్రేమ్ చోప్రా, రేఖ కాంబినేషన్ లో ‘ఫూల్ బనే అంగారే’ ఇంకా ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, అజయ్ దేవగన్ వంటి హీరోలతోనూ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగానూ బొకాడియాకి పేరుంది. తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ వోతీ దా వ్యాహ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా ‘భూత్.. అంకుల్–తుసీ గ్రేట్ హో’ని ఆరంభించారు బొకాడియా. జయప్రదకు పంజాబీలో ఇది తొలి సినిమా కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రాజ్ బబ్బర్ చేస్తున్న పంజాబీ సినిమా ఇదే కావడం విశేషం. -
పంజాబీ చిత్రంలో లక్కు ఎలా ఉంటుందో!
తమిళసినిమా: అందాల నటి కాజల్‌అగర్వాల్ ఇప్పుడు పంజాబీగా మారనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ఏమిటీ అర్ధం కాలేదా? కాజల్ ఏమిటీ పంజాబీ అమ్మయిగా మరడం ఏమిటీ? పంజాబీ అబ్బాయిని ప్రేమించిందా? అనే సందేహాలు మీకు కలగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాజల్‌కు ప్రేమ, పెళ్లి విషయాల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులు కూడా కాజల్‌కు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు. తన తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా సిద్ధం, వారు చెబితే నటనను కూడా మానేస్తాను అని కాజల్ ఇటీవల బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కనేసింది. కాబట్టి కాజల్ అగర్వాల్ పెళ్లికి సిద్ధం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయనే చెప్పాలి. తమిళంలో ప్యారీస్ ప్యారీస్ అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో ఒకటి రెండు అవకాశాలు చేతిలో ఉన్యాయి. కాబట్టి కాజల్‌అగర్వాల్ పెళ్లి ఆలోచనలో ఉన్న మాట నిజమే అయినా, మీరు ఊహించుకుంటున్నట్లు ఆమెకింకా పెళ్లి గడియలు రాలేదు. ఇంతకీ పంజాబీ అమ్మాయి గొడవేంటనేగా మీ ప్రశ్న. ఇప్పటి వరకూ తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ స్టార్స్ అందరితోనూ నటించిన కాజల్ హిందిలో ఒకటి రెండు చిత్రాలు చేసినా బాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ముంబాయికి చెందిన ఈ అమ్మడు ఇప్పుడు కొత్తగా పంజాబీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోందట. ఈ విషయాన్ని కాజల్‌అగర్వాల్ తన ట్విట్టర్లో పేర్కొంది. ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని కాజల్ పేర్కొంది. మొత్తం మీద ఈ 33 ఏళ్ల బ్యూటీ నాలుగో లాంగ్వేజ్‌లోకి కాలిడుతోందన్న మాట. నటులకు భాషా భేదం లేదంటారు. చూద్దాం మరి పంజాబీ చిత్ర పరిశ్రమలో కాజల్ లక్కు ఎలా ఉంటుందో! -
మరో ‘డ్రగ్స్’ సినిమాకు సీబీఎఫ్సీ ఓకే
ముంబై: పంజాబ్ లో మాదకద్రవ్యాల వ్యసనంపై రూపొం దించిన ఉడ్తా పంజాబ్ సినిమాకు 89 కట్స్ చెప్పిన సీబీ ఎఫ్‌సీ, ఇదే అంశంపై తీసిన మరో సిని మాకు మాత్రం అనుమతి ఇచ్చింది. బల్జీత్ సింగ్ రూపొందించిన ఢీ పంజాబ్ ఢీకి ‘క్లీన్ యూ’ ధ్రువపత్రం మంజూరు చేసింది. పంజాబ్‌లో భ్రూణహత్యలు, మాదకద్రవ్యాల వల్ల కలుగుతున్న అనర్థాలపై ఈ సినిమా చర్చిస్తుంది. కాగా, సీబీఎఫ్సీ ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఉద్దేశపూర్వకంగానే సీబీఎఫ్సీ అధిపతి పహ్లాజ్ నిహ్లానీ తమ సినిమాను అడ్డుకుంటున్నారంటూ ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బాంబే హైకోర్టును ఆదేశించడం తెలిసిందే. దీని పై స్పందించిన కోర్టు సీబీఎఫ్‌సీకి చీవా ట్లు పెట్టింది. ఈ వివాదంపై రేపు (సోమవారం) తీర్పు వెలువడనుంది. -
అమ్మానాన్న... ఓ కల!
కళాకారులకు భాషతో పని లేదు. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేయడమే. కానీ, పరభాషల్లో రాణించి, మాతృభాషలో ఒక్క సినిమా కూడా చేయకపోతే అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. సొంత భాషలో సినిమా వస్తే, డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం తాప్సీ అలానే అనుకుంటున్నారు. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ ఢిల్లీ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళాల్లో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక, పంజాబీ భాషలో అవకాశం రావడమే ఆలస్యం. ప్రస్తుతం అక్కడి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకు ఆనందంగా ఉందని తాప్సీ చెబుతూ - ‘‘పంజాబీ అమ్మాయిని కాబట్టి మా అమ్మా నాన్నలకు నేను ఒక్క పంజాబీ సినిమాలో అయినా నటించాలనేది కల. ఆ కల నెరవేర్చాలని నాకూ ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కథలు విన్నా. చాలా బాగున్నాయి. ఇప్పటికి నాలుగు భాషల్లో సినిమాలు చేశా. ఇప్పుడు పంజాబీలో కూడా కనిపిస్తే.. నటిగా, అమ్మానాన్నల కల నెరవేర్చిన కూతురిగా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.