సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాదిలో పలువురు సీనియర్ నటులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ప్రముఖ పంజాబీ నటుడు, కమెడియన్ అమృత్ పాల్ చోటు కన్నుమూశారు. పంజాబీ సినిమాల్లో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో పంజాబీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ విషయాన్ని పంజాబీ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమృత్ పాల్ చోటూ సర్దార్జీ, సర్దార్ జీ- 2తో పాటు పలు చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు సంపాదించారు. ఆయన పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. అమృత్ పాల్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment