నవ్వుల రాజా.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?  | Comedian Neel Nanda Tragically Dies At Age 32 - Sakshi
Sakshi News home page

Comedian Neel Nanda Death: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ కమెడియన్ కన్నుమూత!

Published Sun, Dec 24 2023 6:51 PM | Last Updated on Sun, Dec 24 2023 7:21 PM

Comedian Neel Nanda tragically dies at 32 - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ స్టాండ్‌అప్ కమెడియన్ నీల్ నందా(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్‌ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

నీల్ నందా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా రచయిత కూడా. నీల్ నందా ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శించారు. అతను కామెడీ సెంట్రల్, ఎంటీవీ, వైస్‌ల్యాండ్, హులు అనేక కామెడీ షోస్‌లో కూడా కనిపించాడు. అంతేకాకుండా వెస్ట్‌సైడ్ కామెడీ థియేటర్‌లో ప్రదర్శించిన అన్‌నెససరీ ఈవిల్ షో  లాస్‌ఎంజిల్స్‌ వీక్లీ టాప్ -10లో చోటు దక్కించుకుంది.  అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నీల్ నందా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు. 

2013లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మీ కిమ్మెల్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు  ఇన్‌సైడ్ జోక్, హులు కమింగ్ టు ది స్టేజ్‌లో కూడా కనిపించాడు. నీల్ నందా మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన హాస్యనటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement