మరో ‘డ్రగ్స్’ సినిమాకు సీబీఎఫ్‌సీ ఓకే
ముంబై: పంజాబ్ లో మాదకద్రవ్యాల వ్యసనంపై రూపొం దించిన ఉడ్తా పంజాబ్ సినిమాకు 89 కట్స్ చెప్పిన సీబీ ఎఫ్‌సీ, ఇదే అంశంపై తీసిన మరో సిని మాకు మాత్రం అనుమతి ఇచ్చింది. బల్జీత్ సింగ్ రూపొందించిన ఢీ పంజాబ్ ఢీకి ‘క్లీన్ యూ’ ధ్రువపత్రం మంజూరు చేసింది. పంజాబ్‌లో భ్రూణహత్యలు, మాదకద్రవ్యాల వల్ల కలుగుతున్న అనర్థాలపై ఈ సినిమా చర్చిస్తుంది. కాగా, సీబీఎఫ్సీ ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది.
ఉద్దేశపూర్వకంగానే సీబీఎఫ్‌సీ అధిపతి పహ్లాజ్ నిహ్లానీ తమ సినిమాను అడ్డుకుంటున్నారంటూ ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బాంబే హైకోర్టును ఆదేశించడం తెలిసిందే. దీని పై స్పందించిన కోర్టు సీబీఎఫ్‌సీకి చీవా ట్లు పెట్టింది. ఈ వివాదంపై రేపు (సోమవారం) తీర్పు వెలువడనుంది.